త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Cockroach Janata Partys | కాక్రోచ్ పార్టీకి షాక్‌.. ఎక్స్ ఖాతా పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు

Cockroach Janata Partys | ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (Cockroach Janata Partys)కి ఢిల్లీ హైకోర్టులో షాక్ త‌గిలింది. బ్లాక్ అయిన ఎక్స్ ఖాతాను త‌క్ష‌ణ‌మే పున‌రుద్ధ‌రించేందుకు నిరాక‌రించింది. ఈ మేర‌కు స‌మాధానం కోరుతూ కేంద్రం, ఎక్స్‌కు నోటీసులు జారీ చేసింది.

D

National | Published On May 29, 2026, 3.56 pm IST

Cockroach Janata Partys | కాక్రోచ్ పార్టీకి షాక్‌.. ఎక్స్ ఖాతా పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించిన హైకోర్టు
Advertisement

Cockroach Janata Partys | సోషల్ మీడియాలో రాజ‌కీయ ఉద్య‌మంగా పుట్టుకొచ్చిన‌ ‘కాక్రోచ్‌ జనతా పార్టీ’ (Cockroach Janata Partys) ఎక్స్ ఖ‌తా బ్లాక్ అయిన విష‌యం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజిత్ దీప్కే (Abhijeet Dipke) ఢిల్లీ హైకోర్టును (Delhi High Court) ఆశ్రయించారు. ఎలాంటి కారణం లేకుండానే తమ పార్టీ ఖాతాను ఎక్స్ నిలిపి వేసిందంటూ ఆయన పిటిషన్ వేశారు. ఈ పిటిష‌న్‌పై ఢిల్లీ హైకోర్టు ఇవాళ విచార‌ణ చేప‌ట్టింది.

విచార‌ణ సంద‌ర్భంగా పార్టీ ఎక్స్ ఖాతాను వెంట‌నే పునరుద్ధరించాలని అభిజిత్ తరపు న్యాయవాది కోరారు. ఈ వాద‌న‌ల‌పై స్పందించిన కోర్టు.. తక్షణమే ఎక్స్ ఖాతాను పునరుద్ధరించాలన్న విన్నపాన్ని తిరస్కరించింది. ఈ అంశంపై సమగ్ర పరిశీలన అవసరమని పేర్కొంది. ఈ మేర‌కు దీనిపై స‌మాధానం కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వం, ఎక్స్ సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం వాద‌న‌లు విన్న త‌ర్వాతే ఖాతా పున‌రుద్ధ‌ర‌ణ‌ను ప‌రిశీలిస్తామ‌ని తెలిపింది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను జులై 7వ తేదీకి వాయిదా వేసింది.

Also Read..

క‌ల్తీ మ‌ద్యం తాగి 15 మంది మృతి.. ప‌లువురి ప‌రిస్థితి విష‌మం

రైతుల‌కు 3 గంట‌ల క‌రెంట్ చాలట‌.. ఇది రేవంత్ మ‌న‌సులోని ఆలోచ‌నే : హ‌రీశ్‌రావు

చేతులెత్తి న‌మ‌స్క‌రిస్తున్నా.. 33 జిల్లాల్లో రైతు డిస్కంల‌పై ప‌బ్లిక్ హియ‌రింగ్ పెట్టండి: క‌విత విన‌తి

Advertisement
Advertisement