toxic liquor | కల్తీ మద్యం తాగి 15 మంది మృతి.. పలువురి పరిస్థితి విషమం
toxic liquor | మహారాష్ట్రలో కల్తీ మద్యం (toxic liquor) కలకలం రేపింది. పూణె (Pune) శివారు ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు.
toxic liquor | మహారాష్ట్రలో కల్తీ మద్యం (toxic liquor) కలకలం రేపింది. పూణె (Pune) శివారు ప్రాంతాల్లో కల్తీ మద్యం సేవించి సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. పింప్రి చించ్వాడ్ (Pimpri-Chinchwad)లోని దాపోడి, ఫుగేవాడి ప్రాంతాల నుంచే ఎనిమిది మరణాలు నమోదయ్యాయి. పూణెలోని కాలేపడల్ ప్రాంతంలో ముగ్గురు, హడప్సర్ (Hadapsar) ప్రాంతంలో నలుగురు మరణించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈ నకిలీ మద్యం ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విచారం వ్యక్తం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఇక ఈ కల్తీ మద్యం ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కల్తీ మద్యాన్ని యోగేష్ వాంఖడే అనే వ్యక్తి తయారు చేసినట్లు ఆరోపణలు రావడంతో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడికి అక్రమ మద్యం వ్యాపారంతో సంబంధం ఉందని, గతంలో ఇతనిపై పలు కేసులు కూడా నమోదైనట్లు పోలీసులు గుర్తించారు. ఈ కల్తీ మద్యం వ్యవహారం వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారన్న దానిపై అధికారులు కూపీ లాగుతున్నారు.
Also Read..
ఈసారి సాధారణం కంటే తక్కువే వర్షాలు.. జూన్‌లో అధిక ఉష్ణోగ్రతలు : ఐఎండీ
రిజర్వ్ చేసిన మూడు నెలల్లోనే తుది తీర్పు వెల్లడించాలి: హైకోర్టులకు సుప్రీం కీలక ఆదేశాలు
నాలుగు వందల కోట్లు నష్టపరిహారం ఇవ్వాల్సిందే - మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ హైకోర్టులో కేసు
సంబంధిత వార్తలు

spurious liquor | నాగాలాండ్‌లో కల్తీ మద్యం కలకలం.. 19 మంది మృతి
సెప్టెంబర్ 26, 2026

Rahul Gandhi | రాహుల్ గాంధీకి ముద్దు పెట్టిన యువతి.. వీడియో వైరల్
ఆగస్టు 24, 2026

Paise Ki Goonj | ఛత్రోన్ కీ గూంజ్ కాదు పైసే కీ గూంజ్.. రాహుల్ కార్యక్రమం కోసం ఒక్కో ఇన్‌ఫ్లుయెన్సర్‌కు రూ. 35 వేలు
ఆగస్టు 22, 2026
తాజావార్తలు
- ●TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్
- ●ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..
- ●CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ
- ●N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు
- ●Satyam Srirangam | జ్ఞానేశ్ కుమార్ అక్రమాలపై రేపు రాష్ట్రవ్యాప్త ఆందోళనలు
- ●Ram Charan | దసరాకు రామ్‌చరణ్, సుకుమార్ మూవీ లాంఛ్ - గెస్ట్‌గా పవన్ కళ్యాణ్

TG TET | ఇంకా 7 వేల మంది టీచర్లు 'టెట్' ఫెయిల్

ATM Charges | 3 రోజులు బ్యాంకుల సమ్మె.. ఏటీఎం చార్జీలపై ఖాతాదారులకు ఊరట..

CJI Surya Kant | ప్రతి ఐదుగురు టీనేజర్లలో ఒకరికి డ్రగ్స్ ముప్పు: సీజేఐ

N Ramachander Rao | కుటుంబవాదం భారత ప్రజాస్వామ్యానికే ముప్పు : ఎన్ రామచందర్ రావు



