Chanagani Dayakar | మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరించడం సిగ్గుచేటు: టీపీసీసీ నేత చనగాని దయాకర్
Chanagani Dayakar | తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం సిగ్గుచేటని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) విమర్శించారు.
Chanagani Dayakar | త్రినేత్ర.న్యూస్: తెలంగాణ కాంగ్రెస్ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) రాజ్యసభ నామినేషన్‌ను తిరస్కరించడం సిగ్గుచేటని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) విమర్శించారు. బీజేపీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నదని మండిపడ్డారు. ఎలక్షన్ కమిషన్ అనే దానికంటే బీజేపీ పార్టీ కమిషన్ అంటే బాగుంటదని దుయ్యబట్టారు. మధ్యప్రదేశ్ ఎన్నికల కమిషన్ అధికారిని తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. రాజ్యసభ ఎన్నికలను రద్దు చేసి మళ్లీ నిర్వహించాలన్నారు.
మీనాక్షి నటరాజన్ నామినేషన్ రద్దు చేయడం అంటే మహాత్మా గాంధీని అవమానించమేనని చెప్పారు. ఆమెపై కేసు వివరాలు పూర్తిగా తెలుసుకోకుండానే నామినేషన్ రద్దు ఏకపక్ష కుట్ర అనేది తేలిపోయిందన్నారు.
మీనాక్షి నటరాజన్ మధ్యప్రదేశ్ నుంచి కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అయితే ఆమె నటరాజన్ నామినేషన్‌ను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ కోర్టులో పెండింగ్‌లో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించిన వివరాలను మీనాక్షి తన నామినేషన్ పత్రాల్లో పేర్కొనలేదని, ఈ నేపథ్యంలోనే నామినేషన్‌ను తిస్కరించినట్లు అధికారులు వెల్లడించారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!
- ●RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ
- ●RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?
- ●Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!
- ●Minister Tummala | సీతమ్మసాగర్కు సుప్రీం ‘లైన్ క్లియర్’.. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులకు ఊరట
- ●Garuda Seva | గరుడ వాహనంపై వివహరించిన తిరుమలేశుడు..!

Asia's 50 Best Bars 2026 | ఆసియాలో 50 బెస్ట్ బార్స్ లిస్ట్.. టాప్-10లో గోవా ‘బాయిలర్మేకర్’..!

RRR | ట్రిపుల్ ఆర్ పనులు వేగంగా సాగుతున్నయ్ : కేంద్ర మంత్రి గడ్కరీ

RAAKA | బన్నీ అభిమానులకు గుడ్న్యూస్.. ‘రాకా’ను అట్లీ అలా ప్లాన్ చేస్తున్నాడా?

Minister Tummala | మోదీ జీ సమయం ఇవ్వండి.. అపాయింట్మెంట్ ఇవ్వాలని మంత్రి తుమ్మల రిక్వెస్ట్..!





