త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

P Chidambaram | అమిత్ షాకు జ్ఞాప‌క‌శ‌క్తి లోపించింది : చిదంబ‌రం

P Chidambaram | హోంమంత్రి అమిత్ షా (Amit Shah)పై కాంగ్రెస్ (Congresss) సీనియర్ నేత పి. చిదంబరం (P Chidambaram) సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరిని షా త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీ నేత‌కు జ్ఞాపకశక్తి లోపించిందో లేక నిజాన్ని దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

D

National | Published On Nov 27, 2026, 12.29 pm IST

P Chidambaram | అమిత్ షాకు జ్ఞాప‌క‌శ‌క్తి లోపించింది : చిదంబ‌రం
Advertisement

P Chidambaram | త్రినేత్ర న్యూస్ : మహిళా రిజర్వేషన్ చట్టం అమలుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ (Congresss) సీనియర్ నేత పి. చిదంబరం (P Chidambaram) కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభ, రాష్ట్ర అసెంబ్లీల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ల (womens reservation) అమలును కాంగ్రెస్ అడ్డుకోలేదని అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌ను తీవ్రంగా త‌ప్పుబ‌ట్టారు. రిజర్వేషన్ల అంశంపై కాంగ్రెస్ వైఖరిని షా త‌ప్పుగా చిత్రీక‌రిస్తున్నార‌ని విమ‌ర్శించారు. బీజేపీ నేత‌కు జ్ఞాపకశక్తి లోపించిందో లేక నిజాన్ని దాచిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారో త‌న‌కు తెలియ‌డం లేద‌ని వ్యాఖ్యానించారు.

మహిళా రిజర్వేషన్ల చట్టం ఆమోదానికి కాంగ్రెస్ పూర్తి మద్దతు ఇచ్చిన విష‌యాన్ని గుర్తు చేశారు. అంతేకాదు ఈ రిజ‌ర్వేష‌న్ల‌ను త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని త‌మ పార్టీ డిమాండ్ చేస్తోంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ''రాజ్యాంగ (106వ సవరణ) చట్టం, 2023ను పార్లమెంటు ఉభయ సభలు 2023 సెప్టెంబర్ 20, 21 తేదీల్లోనే ఆమోదించాయి. ఈ బిల్లుకు కాంగ్రెస్ పూర్తి మ‌ద్ద‌తు ఇచ్చింది. చ‌ట్టాన్ని త‌క్ష‌ణ‌మే అమ‌లు చేయాల‌ని కోరుతూ వ‌స్తున్నాం. అయినా ప్ర‌భుత్వం దానిని ఎందుకు అమ‌లు చేయ‌డం లేదు..? ఇప్ప‌టికే చ‌ట్టం ఉన్న‌ప్పుడు దాన్ని అమ‌లు చేయ‌కుండా బీజేపీ (BJP) ప్ర‌భుత్వం ఎందుకు జాప్యం చేస్తోంది. కొత్త బిల్లు తీసుకురావాల్సిన అవ‌స‌రం ఏముంది..?

తదుపరి జనాభా లెక్కల (సెన్సస్) తర్వాత చేపట్టే నియోజకవర్గాల పునర్విభజన ప్ర‌క్రియ‌తో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ల అమ‌లును ముడిపెడుతూ ఈ చ‌ట్టంలో ఆర్టిక‌ల్ 334Aను చేర్చారు. పార్లమెంటు చర్చల సమయంలోనే కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ నిబంధనను వ్యతిరేకించాయి. జనాభా లెక్కలు, డీలిమిటేషన్ అనే రెండు అనవసరపు అడ్డంకులను ఇది సృష్టిస్తుందని మేము వాదించాము. అయినా, ఆర్టికల్‌ 334A విషయంలో బీజేపీ పట్టుదలగా వ్యవహరించింది. ఆర్టికల్ 334Aను తొలగిస్తే.. మహిళా రిజర్వేషన్లను వెంటనే అమలు చేయవచ్చు" అని చిదంబ‌రం చెప్పుకొచ్చారు.

Also Read..

SIP మిస్ అయితే.. బ్యాంక్ ఖాతా, సిబిల్ స్కోర్‌పై ప్రభావం ప‌డుతుందా..?

వైన్స్‌ల వ‌ద్ద కేసీఆర్‌.. ప‌బ్బుల్లో కేటీఆర్ క‌టౌట్లు పెడ‌తాం.. బీఆర్ఎస్ నేత‌ల‌కు చ‌న‌గాని ద‌యాక‌ర్ వార్నింగ్‌

పెద్దపల్లి జిల్లా నేతల మధ్య విభేదాలు.. మంత్రి అడ్లూరికి బీఎం సందీప్ పిలుపు

Advertisement
Advertisement