Butter Prices | వెన్న, నెయ్యి ధరలకు రెక్కలు.. పెరగనున్న పాల ఉత్పత్తుల ధరలు..
Butter Prices | దేశంలో వెన్న, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ ధరలు మరింత పెరిగే అవకాశముందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాలలో కొవ్వు శాతం కలిగిన పదార్థాల సరఫరా తగ్గడం, పశువుల దాణా ఖర్చులు 15 నుంచి 20 శాతం పెరగడం, పాల సేకరణ తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. దేశంలో అతిపెద్ద పాల సహకార సంస్థ అమూల్ రోజువారీ పాల సేకరణ కూడా సాధారణ స్థాయితో పోలిస్తే 15 శాతం తగ్గినట్లు సమాచారం.
Butter Prices | దేశంలో వెన్న, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ ధరలు మరింత పెరిగే అవకాశముందని నివేదికలు వెల్లడిస్తున్నాయి. పాలలో కొవ్వు శాతం కలిగిన పదార్థాల సరఫరా తగ్గడం, పశువుల దాణా ఖర్చులు 15 నుంచి 20 శాతం పెరగడం, పాల సేకరణ తగ్గడం ఇందుకు ప్రధాన కారణాలుగా మారాయి. దేశంలో అతిపెద్ద పాల సహకార సంస్థ అమూల్ రోజువారీ పాల సేకరణ కూడా సాధారణ స్థాయితో పోలిస్తే 15 శాతం తగ్గినట్లు సమాచారం.
తగ్గుతున్న పాల ఉత్పత్తి..
దేశవ్యాప్తంగా వెన్న, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ ధరలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. పాల ఉత్పత్తి పెరుగుదల ఆశించిన స్థాయిలో లేకపోవడం, పాల సేకరణ ఖర్చులు అధికమవడం, నిల్వలు తగ్గిపోవడంతో డెయిరీ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతోంది. శనివారం వెలువడిన మింట్ నివేదిక ప్రకారం తక్కువ వర్షపాతం, పచ్చి మేత కొరత కారణంగా శీతాకాలంలో సాధారణంగా పెరిగే పాల ఉత్పత్తి ఈసారి ఆశించిన స్థాయిలో పెరగలేదు. దీంతో వెన్న, నెయ్యి వంటి అధిక కొవ్వు పదార్థాల తయారీకి అవసరమైన పాలు తగినంతగా అందుబాటులో ఉండడం లేదు. భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా కొనసాగుతున్నప్పటికీ, మొత్తం పాల లభ్యతకు, పాలలోని కొవ్వు పదార్థాల సరఫరాకు మధ్య వ్యత్యాసం ఏర్పడుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పశుసంవర్ధక గణాంకాలు-2026 ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో దేశ పాల ఉత్పత్తి 2.4 శాతం పెరిగి 253.81 మిలియన్ టన్నులకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో ఇది 247.87 మిలియన్ టన్నులుగా నమోదైంది. అయితే 2025 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 3.58 శాతం వృద్ధితో పోలిస్తే ఈసారి వృద్ధి మందగించింది. గత పదేళ్ల సగటు వార్షిక వృద్ధి రేటు 5.41 శాతంతో పోల్చినా ప్రస్తుత వృద్ధి తక్కువగానే ఉంది.
పాల కొవ్వు కొరతకు కారణాలివే..
కర్ణాటక, మహారాష్ట్ర వంటి కరవు ప్రభావిత రాష్ట్రాల్లో పచ్చి మేత కొరత, నీటి సమస్యలు, పశువుల దాణా ధరల పెరుగుదల పాల ఉత్పత్తిపై ప్రభావం చూపుతున్నాయి. దేశంలో అతిపెద్ద పాల సహకార సంస్థ అమూల్ రోజువారీ పాల సేకరణ సాధారణంగా ఉండే 3.5 కోట్ల లీటర్లతో పోలిస్తే సుమారు 15 శాతం తగ్గినట్లు నివేదిక పేర్కొంది. వెన్న, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ సరఫరాలోనూ కొరత ఏర్పడినట్లు డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నెలల తరబడి నెయ్యి సరఫరా అందుబాటులో లేదని సమాచారం. మరోవైపు, పాల ఉత్పత్తిలో గేదె పాల వాటా తగ్గడం కూడా కొవ్వు పదార్థాల లభ్యతపై ప్రభావం చూపుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో దేశ పాల ఉత్పత్తిలో గేదె పాల వాటా సుమారు 43 శాతంగా ఉంది. ఆవు పాలతో పోలిస్తే గేదె పాలలో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. అందువల్ల గేదె పాల స్థానంలో ఆవు పాల ఉత్పత్తి పెరిగినా, మొత్తం పాల పరిమాణం పెరిగిన స్థాయిలో వెన్న, నెయ్యి తయారీకి అవసరమైన పాల కొవ్వు లభ్యత పెరగడం లేదు.
పెరిగిన దాణా ఖర్చులు.. ఇప్పటికే భారీగా పెరిగిన వెన్న ధరలు..
పశువుల దాణా ధరలు కూడా డెయిరీ కంపెనీలకు భారంగా మారాయి. మొక్కజొన్న, డీ-ఆయిల్డ్ రైస్ బ్రాన్ కేక్, సోయా ఆధారిత పదార్థాల ధరలు పెరగడంతో సెప్టెంబర్‌లో పశువుల దాణా ఖర్చులు గతేడాదితో పోలిస్తే 15 నుంచి 20 శాతం అధికమయ్యాయి. ఈ ప్రభావం పాల ఉత్పత్తుల ధరల్లో ఇప్పటికే కనిపిస్తోంది. 2023 అక్టోబర్‌లో కిలో వెన్న ధర రూ.348గా ఉండగా, ఈ అక్టోబర్ నాటికి 54.3 శాతం పెరిగి రూ.537కు చేరింది. ఇదే సమయంలో స్కిమ్డ్ మిల్క్ పౌడర్ ధర 18 శాతం పెరిగి కిలోకు రూ.295గా నమోదైంది. నిల్వలు తిరిగి పెరిగే వరకు 2027 ఆర్థిక సంవత్సరం పొడవునా పాల సేకరణ ఖర్చులు అధికంగానే ఉండే అవకాశం ఉందని అంచనా. పచ్చి మేత లభ్యత మెరుగుపడడం, పశువుల పోషణ, పాల ఉత్పాదకత పెరగడంపైనే సరఫరా సాధారణ స్థితికి చేరడం ఆధారపడి ఉంటుందని నివేదిక వెల్లడించింది. రానున్న కొన్ని నెలల పాటు సరఫరా కొరత కొనసాగితే వెన్న, నెయ్యి, ఫ్రెష్ క్రీమ్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు
- ●IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!

Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!




