త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఎజెండా.. ఇండస్ట్రియల్​ పాలసీ 2.0

Telangana | ఇన్వెస్ట్ తెలంగాణ (Telangana) గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలను ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న‌ది. ఇప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న పారిశ్రామిక రంగాలను మరింత విస్తరించటంతో పాటు కొత్త రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఈ పాలసీలను (Industrial Policy) తయారు చేసింది.

G

Telangana | Published On Nov 28, 2026, 10.48 am IST

Telangana | పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఎజెండా.. ఇండస్ట్రియల్​ పాలసీ 2.0
Advertisement

Telangana | త్రినేత్ర న్యూస్‌: ఇన్వెస్ట్ తెలంగాణ (Telangana) గ్లోబల్ సమ్మిట్ వేదికగా 11 కొత్త పాలసీలను ఆవిష్కరించేందుకు ప్రజా ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న‌ది. ఇప్పటికే రాష్ట్రంలో బలంగా ఉన్న పారిశ్రామిక రంగాలను మరింత విస్తరించటంతో పాటు కొత్త రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా ఈ పాలసీలను (Industrial Policy) తయారు చేసింది. పరిశ్రమల శాఖ, ఐటీ శాఖ, విద్యాశాఖల ఆధ్వ‌ర్యంలో ఈ కొత్త పాలసీలను రూపొందించింది. 2047 నాటికి తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) గతేడాది గ్లోబల్ సమ్మిట్‌లో (Global Summit) తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించిన విష‌యం తెలిసిందే. అందులో నిర్దేశించుకున్న లక్ష్యాలకు, భవిష్యత్ పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పాలసీలను తీసుకురానుంది. , , Telangana Rising

తయారీ రంగానికి ప్రాధాన్యం

రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత విస్తరించేందుకు నూతన పారిశ్రామిక విధానం (Industrial Policy 2.0) తీసుకురానున్నారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశమున్న వస్త్ర తయారీ, రెడీమేడ్ దుస్తులు, పాదరక్షలు, తోలు ఉత్పత్తుల పరిశ్రమలకు ప్రత్యేక పాలసీలను రూపొందిస్తున్నారు. రక్షణ, విమానయాన, అంతరిక్ష పరిశ్రమల్లో తెలంగాణకు ఇప్పటికే ప్రత్యేక గుర్తింపు ఉంది. ఈ రంగాల్లో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించేందుకు సమగ్ర పాలసీని సిద్ధం చేస్తున్నారు. పారిశ్రామిక ఉత్పత్తుల రవాణా, గిడ్డంగులు, సరఫరా వ్యవస్థల అభివృద్ధికి లాజిస్టిక్స్ పాలసీని తీసుకురానుంది.

మారుతున్న అవసరాలకు అనుగుణంగా..

సాఫ్ట్‌వేర్ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన హైదరాబాద్‌లో గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్ల ఏర్పాటు వేగంగా విస్తరిస్తోంది. ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల తయారీ రంగాల్లోనూ పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయి. ఆయా రంగాల అవసరాలకు అనుగుణంగా ఐటీ శాఖ కొత్త పాలసీలను సిద్ధం చేస్తున్న‌ది. సమగ్ర ఐసీటీ పాలసీతో పాటు గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్లు, డేటా సెంటర్లు, ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్ల పరిశ్రమలకు ప్రత్యేక పాలసీలను తీసుకురానున్నారు. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్ రంగాల అభివృద్ధికి ఏవీజీసీ పాలసీని రూపొందిస్తున్నారు.

విదేశీ విద్యాసంస్థలు

విదేశాల్లో పేరొందిన ఉన్నత విద్యాసంస్థలు రాష్ట్రంలో తమ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రత్యేక పాలసీని తీసుకురానున్నారు. అంతర్జాతీయ స్థాయి విద్య, పరిశోధన అవకాశాలు తెలంగాణ విద్యార్థులకు ఇక్కడే అందుబాటులోకి రావాలనేది ముఖ్యమంత్రి సంకల్పం. ఇందులో భాగంగా విదేశీ ఉన్నత విద్యాసంస్థల క్యాంపస్‌ల ఏర్పాటుకు ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నారు.

సమ్మిట్​ వేదికగా 11 పాలసీలు..

1. ఇండస్ట్రియల్ పాలసీ 2.0
2. ఫుట్‌వేర్ అండ్ లెదర్ పాలసీ
3. టెక్స్‌టైల్స్ అండ్ అపారెల్ పాలసీ 2.0
4. ఏరోస్పేస్, డిఫెన్స్ అండ్ స్పేస్ పాలసీ
5. లాజిస్టిక్స్ పాలసీ
6. ఐసీటీ పాలసీ 2.0
7. గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్స్ (జీసీసీ) పాలసీ
8. డేటా సెంటర్స్ పాలసీ 2.0
9. ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్స్ పాలసీ
10. యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ (ఏవీజీసీ) పాలసీ
11. ఫారిన్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ ఆఫ్‌షోర్ క్యాంపస్ పాలసీ

Advertisement
Advertisement