త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోరు.. వారాంతంలో ర్యాలీ..

Gold And Silver Prices Today | గ‌త ప‌ది రోజులుగా భారీ ర్యాలీల‌తో ఈక్విటీ మార్కెట్లు సంద‌డి చేయ‌గా, ఈ వారం ముగింపు స‌మ‌యంలో మాత్రం ప‌రిస్థితి తారుమారైంది. ప‌శ్చిమ ఆసియాలో ఉద్రిక్త‌త‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, భార‌త్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ టారిఫ్‌ల బాదుడుకు రెడీ అవ‌డం.. వంటి కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది.

S

Business | Published On Nov 28, 2026, 11.17 am IST

Gold And Silver Prices Today | బులియ‌న్ మార్కెట్ల‌లో జోరు.. వారాంతంలో ర్యాలీ..
Advertisement

Gold And Silver Prices Today | గ‌త ప‌ది రోజులుగా భారీ ర్యాలీల‌తో ఈక్విటీ మార్కెట్లు సంద‌డి చేయ‌గా, ఈ వారం ముగింపు స‌మ‌యంలో మాత్రం ప‌రిస్థితి తారుమారైంది. ప‌శ్చిమ ఆసియాలో ఉద్రిక్త‌త‌లు మ‌ళ్లీ పెర‌గ‌డం, ముడి చ‌మురు ధ‌ర‌లు పెరుగుతుండ‌డం, భార‌త్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల‌పై అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ మ‌ళ్లీ టారిఫ్‌ల బాదుడుకు రెడీ అవ‌డం.. వంటి కార‌ణాల‌తో ఈక్విటీ మార్కెట్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. దీంతో ప్ర‌పంచ మార్కెట్ల‌తోపాటు దేశీయ సూచీలు సైతం న‌ష్టాల్లో ముగిశాయి. అదే స‌మ‌యంలో బులియ‌న్ మార్కెట్ల‌లో జోరు పెరిగింది. గ‌త ప‌ది రోజులుగా భారీగా త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు వారం ముగింపు స‌మ‌యంలో మ‌ళ్లీ పుంజుకున్నాయి. ఈ వారాంతంలో ఆయా లోహాల ధ‌ర‌లు భారీగా పెరిగి స్థిర‌ప‌డ్డాయి.

అంత‌ర్జాతీయ బులియ‌న్ మార్కెట్ల‌లో ఔన్స్ బంగారం ధ‌ర గ‌త సెష‌న్‌లో ఏకంగా 2.46 శాతం ఎగ‌బాకి 3,654 డాల‌ర్ల‌కు చేర‌గా, వెండి ధ‌ర 5.22 శాతం ఎగ‌సి 43 డాల‌ర్ల‌కు చేరుకుంది. దేశీయ క‌మోడిటీ మార్కెట్ ఎంసీఎక్స్‌లో గోల్డ్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 2,926 పాయింట్లు పెరిగి 1,25,198 వ‌ద్ద స్థిర‌ప‌డింది. సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ కాంట్రాక్టు 6,479 పాయింట్లు పెరిగి 1,52,322 వ‌ద్ద నిలిచింది. ఇక శ‌నివారం దేశీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఒక మోస్త‌రుగా త‌గ్గ‌గా, వెండి ధ‌ర‌ల్లో ఎలాంటి మార్పు లేదు.

స్పాట్ మార్కెట్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు..

24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.12,786 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.1,02,288 గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,27,860 గా ఉంది. 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.12,78,600 గా ఉంది. ఇది కింద‌టి రోజు ముగింపుతో పోలిస్తే రూ.5,400 త‌గ్గింది.

22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.11,720 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.93,760గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.1,17,200 ఉండగా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.11,72,000గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.5,000 త‌గ్గింది.

18 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధ‌ర రూ.9,589 ఉండ‌గా, 8 గ్రాముల ధ‌ర రూ.76,712గా ఉంది. 10 గ్రాముల ధ‌ర రూ.95,890 ఉండ‌గా, 100 గ్రాముల బంగారం ధ‌ర రూ.9,58,900గా ఉంది. ఇది క్రితం ముగింపుతో పోలిస్తే రూ.4,100 త‌గ్గింది.

దేశీయ మార్కెట్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,700గా ఉంది. క్రితం ముగింపుతో పోలిస్తే వెండి ధ‌ర‌లో ఎలాంటి మార్పు లేదు. అలాగే హైద‌రాబాద్‌లో 1 కిలో వెండి ధ‌ర రూ.1,70,000 ఉండ‌గా, తులం ధ‌ర రూ.1,700 గా ఉంది.

Advertisement
Advertisement