Sheesh Mahal | రూ. 5 లక్షల సోఫా, రూ. 11 లక్షల షాండ్లియర్.. సందర్శన కోసం తెరుచుకున్న కేజ్రీవాల్ శీష్ మహల్
Sheesh Mahal | ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీఎంగా ఉన్నప్పుడు ఉపయోగించిన అధికారిక నివాసం ‘శీష్ మహల్’ (Sheeshmahal) సందర్శన కోసం తెరుచుకుంది. బీజేపీ ప్రభుత్వం తొలిసారి మీడియా ప్రతినిధులను ఈ అద్దాల మేడలోకి అనుమతించింది. ఈ సందర్భంగా బంగ్లాలో ఉన్న ప్రతి వస్తువు ధరను తెలిసేలా అక్కడ ప్రైస్ ట్యాగ్‌లు, బిల్లు వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. బంగ్లా నిర్మాణం, ఇంటీరియర్స్ కోసం ఏకంగా రూ.58 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపింది.
Sheshmahal | త్రినేత్ర న్యూస్ : ఢిల్లీలో ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘శీష్ మహల్’ (Sheeshmahal) వ్యవహారం వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సీఎంగా ఉన్నప్పుడు శీష్ మహల్ (Sheesh Mahal) పునరుద్ధరణలో భారీగా అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నాయి. బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వం ఈ ‘అద్దాల మేడ’లో నివాసం ఉండట్లేదు. ఈ బంగ్లాను మ్యూజియంగా మార్చి తాజాగా ప్రజల సందర్శన కోసం అందుబాటులో ఉంచింది. తొలిసారి మీడియా ప్రతినిధులను ఈ అద్దాల మేడలోకి అనుమతించింది. బంగ్లాలో ఉన్న ప్రతి వస్తువు ధరను తెలిసేలా అక్కడ ప్రైస్ ట్యాగ్‌లు, బిల్లు వివరాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
పీడబ్ల్యూడీ (PWD) మంత్రి పర్వేష్ వర్మ (PWD Minister Parvesh Verma) స్వయంగా మీడియా ప్రతినిధులను ఈ శీష్ మహల్‌లోకి తీసుకెళ్లారు. ఈ భవనం నిర్మాణం, అలంకరణ కోసం విచ్చలవిడిగా ప్రజాధనాన్ని ఖర్చు చేశారని ఆరోపించారు. బంగ్లా నిర్మాణం, ఇంటీరియర్స్ కోసం ఏకంగా రూ.58 కోట్లు ఖర్చు చేసినట్లు చెప్పారు. ఇందులో రూ. 5.47 లక్షల విలువైన సోఫా, రూ. 11 లక్షల విలువైన షాండ్లియర్ ఉన్నాయని ఆయన వివరించారు. కొవిడ్ సమయంలో అత్యవసర ప్రాతిపదికన ఫైళ్లపై సంతకాలు చేసి ఈ విలాసవంతమైన బంగ్లాను నిర్మించినట్లు విమర్శించారు. కేజ్రీవాల్ ఖాళీ చేసినప్పటి నుంచి ఈ బంగ్లాలో ఒక్క వస్తువును కూడా మార్చలేదని చెప్పారు. ఈ బంగ్లా కోసం కొనుగోలు చేసిన ప్రతి వస్తువుకు సంబంధించిన బిల్లులు తమ వద్ద ఉన్నాయని స్పష్టం చేశారు.




Also Read..
త్రీ లైన్ విప్ అంటే ఏమిటి? దాన్ని ధిక్కరిస్తే ఎంపీ పదవి పోతుందా?
సుప్రీం ఆదేశాలకు తిరుగులేదు.. రేపు అక్కడ దీపం వెలగాల్సిందే..!
స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో 340 మంది ఉద్యోగుల తొలగింపు..? కారణాలేమిటి..?
తాజావార్తలు
- ●Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..
- ●X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..
- ●Telangana | పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఎజెండా.. ఇండస్ట్రియల్ పాలసీ 2.0
- ●Butter Prices | వెన్న, నెయ్యి ధరలకు రెక్కలు.. పెరగనున్న పాల ఉత్పత్తుల ధరలు..
- ●Suicide | తల్లికి వీడియో పంపి.. హోటల్లో రూమ్‌లో యువకుడు బలవన్మరణం..!
- ●Deeksha Divas | ఒకరోజు ముందే దీక్షా దివస్.. కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం

Gold And Silver Prices Today | బులియన్ మార్కెట్లలో జోరు.. వారాంతంలో ర్యాలీ..

X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..

Telangana | పారిశ్రామికాభివృద్ధికి సరికొత్త ఎజెండా.. ఇండస్ట్రియల్ పాలసీ 2.0

Butter Prices | వెన్న, నెయ్యి ధరలకు రెక్కలు.. పెరగనున్న పాల ఉత్పత్తుల ధరలు..






