Suicide | తల్లికి వీడియో పంపి.. హోటల్‌లో రూమ్‌లో యువకుడు బలవన్మరణం..!
Suicide | మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని పోచారం ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఓయో హోటల్ దిగిన అతడు తల్లికి వీడియో పంపి బలవన్నరణం చెందాడు.
Suicide | త్రినేత్ర న్యూస్: మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్‌లోని పోచారం ఐటీ కారిడార్‌లో ఓ యువకుడు ఆత్మహత్య (Suicide) చేసుకున్నాడు. ఓయో హోటల్ దిగిన అతడు తల్లికి వీడియో పంపి బలవన్నరణం చెందాడు. జగద్గిరిగుట్ట ఆల్విన్ కాలనీకి చెందిన కోట శ్రీరామ్ (29) ఆంధ్రపద్రేశ్‌లోని గుంటూరులో (Guntur) ఉన్న ఓ ప్రైవేటు థియేటర్‌లో కస్టమర్ కేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. తన తండ్రికి ఆరోగ్యం బాగాలేదని చెప్పి యజమాని మహింద్రా వద్ద రూ.10 వేలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆఫీస్‌కు సంబంధించిన సెల్‌ఫోన్, రూ.6 వేల నగదును యజమానికి తెలియకుండా తీసుకున్నారు. అంతేకాకుండా ఆఫీస్ ఫోన్‌పే ఖాతా నుంచి రూ.99,999 తన అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకున్నాడని శ్రీరామ్ తల్లి వనజలక్ష్మికి ఫోన్‌చేసి చెప్పాడు. సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు.
దీంతో పోలీసులు శ్రీరామ్ బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన శ్రీరామ్.. చౌదరిగూడ ఓయూ కాలనీలోని 'లివింగ్ ట్రీ' హోటల్ గది నంబర్ 201లో బస చేశాడు. శుక్రవారం ఉదయం తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు వీడియో తీసి తల్లికి, యజమానికి పంపాడు. తాను ఉన్న హోటల్ లొకేషన్ కూడా పంపించాడు. అప్రమత్తమైన యజమాని వెంటనే హోటల్ సిబ్బందికి విషయం తెలియజేశారు. దీంతో గది తలుపులు పగులగొట్టి చూసేసరికి.. శ్రీరామ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. కిందికి దించి చూడగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సంబంధిత వార్తలు

Software Employee Suicide | ఒంటరిగా ఉండలేక.. ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య.. ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగిని సూసైడ్ నోట్లో ఇంకేముందంటే!
నవంబర్ 27, 2026

Online Betting | బెట్టింగ్ యాప్‌ల ఉచ్చులో పడ్డాడు.. అప్పు తీర్చలేక బాసర IIIT విద్యార్థి బలవన్మరణం
నవంబర్ 24, 2026

JNTU | హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి.. జేఎన్టీయూలో విద్యార్థి ఆత్మహత్య
నవంబర్ 16, 2026
తాజావార్తలు
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు
- ●IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!
- ●Rukmini Vasanth | ఎన్టీఆర్ డ్రాగన్ సెట్స్‌లో రుక్మిణి వసంత్
- ●Rahul Gandhi | ప్రజాస్వామ్యానికి చరమగీతం పాడేందుకే 850 సీట్ల ప్రతిపాదన

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం

Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!

Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

IPL 2027 | కేకేఆర్ కెప్టెన్‌గా రింకూ సింగ్..? మద్దతు ప్రకటించిన మాజీలు..!



