త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..

X | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు పోస్టుల షెడ్యూలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై 18 నెలల ముందుగానే పోస్టులను సిద్ధం చేసి, నిర్ణీత తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా ప్రచురించేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలను కూడా జత చేయవచ్చు. గతంలో ఈ సదుపాయం వెబ్‌సైట్, ఐఓఎస్ యాప్‌లకు మాత్రమే పరిమితమైంది.

S

Technology | Published On Nov 28, 2026, 11.01 am IST

X | ఎక్స్‌లో కొత్త ఫీచర్.. 18 నెలల ముందే పోస్టుల షెడ్యూలింగ్..
Advertisement

X | సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఆండ్రాయిడ్ వినియోగదారులకు పోస్టుల షెడ్యూలింగ్ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై 18 నెలల ముందుగానే పోస్టులను సిద్ధం చేసి, నిర్ణీత తేదీ, సమయానికి ఆటోమేటిక్‌గా ప్రచురించేలా షెడ్యూల్ చేసుకోవచ్చు. ఫోటోలు, వీడియోలను కూడా జత చేయవచ్చు. గతంలో ఈ సదుపాయం వెబ్‌సైట్, ఐఓఎస్ యాప్‌లకు మాత్రమే పరిమితమైంది.

ఎలా షెడ్యూల్ చేయాలి..?

ఎక్స్ సంస్థ ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం పోస్టుల షెడ్యూలింగ్ ఫీచర్‌ను అధికారికంగా విడుదల చేసింది. ఎక్స్‌లో స్టాఫ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్న ఎవ్జెనీ మాట్సియుక్ ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన ఎక్స్‌లో షేర్ చేశారు. వినియోగదారులు పోస్టును టైప్ చేసి, అవసరమైన ఫోటోలు లేదా వీడియోలను జతచేసి, ప్రచురించాల్సిన తేదీ, సమయాన్ని ఎంచుకోవచ్చు. అనంతరం సెట్ షెడ్యూల్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే సరిపోతుంది. నిర్ణీత సమయానికి ఎక్స్ ఆటోమేటిక్‌గా పోస్టును ప్రచురిస్తుంది. షెడ్యూల్ చేసిన తర్వాత యాప్‌ను తెరిచి ఉంచాల్సిన అవసరం లేదు. ఇతర పనులు చేసుకుంటూ యాప్‌ను యథావిధిగా ఉపయోగించుకోవచ్చు. పోస్టు విజయవంతంగా షెడ్యూల్ అయినట్లు నోటిఫికేషన్ కూడా వస్తుంది.

అవ‌స‌రం అయితే మార్పులు సైతం..

షెడ్యూల్ చేసిన పోస్టులను ఆండ్రాయిడ్ యాప్‌లోని డ్రాఫ్ట్స్ విభాగంలో చూసుకోవచ్చు. అవసరమైతే ప్రచురణ సమయానికి ముందే పోస్టులో మార్పులు చేయడం, తేదీ, సమయాన్ని మార్చడం లేదా పూర్తిగా తొలగించడం చేయవచ్చు. మార్పులు చేసిన తర్వాత సేవ్ ఛేంజెస్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మార్పులు వద్దనుకుంటే వాటిని రద్దు చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ముందుగానే కంటెంట్ సిద్ధం చేసుకునే వారికి మరింత సౌలభ్యం కలగనుంది. ముఖ్యంగా క్రమం తప్పకుండా పోస్టులు చేసే వ్యక్తులు, సంస్థలకు ఇది ఉపయోగకరంగా ఉండనుంది.

కొత్త పేరెంట‌ల్ కంట్రోల్స్‌..

ఇటీవల ఎక్స్ పలు కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. 13 నుంచి 17 ఏళ్ల వయసున్న టీనేజర్ల ఖాతాలకు సంబంధించి పేరెంటల్ కంట్రోల్స్‌ను అందుబాటులోకి తెచ్చింది. తల్లిదండ్రులు తమ ఖాతాలను పిల్లల ఖాతాలతో అనుసంధానించుకుని కొన్ని సెట్టింగులను పర్యవేక్షించే అవకాశం కల్పించింది. అలాగే ఒకే పోస్టులో జతచేయగలిగే ఫోటోలు, వీడియోల పరిమితిని కూడా పెంచింది. గతంలో ఉన్న పరిమితిని సవరించి, ఇప్పుడు ఒక పోస్టులో గరిష్ఠంగా 20 ఫోటోలు, వీడియోలను జతచేసుకునే అవకాశం కల్పించింది. తాజా షెడ్యూలింగ్ ఫీచర్‌తో ఆండ్రాయిడ్ యాప్‌లోనూ ఎక్స్ వినియోగదారులకు మరిన్ని సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి.

Advertisement
Advertisement