Chanagani Dayakar | వైన్స్‌ల వద్ద కేసీఆర్.. పబ్బుల్లో కేటీఆర్ కటౌట్లు పెడతాం.. బీఆర్ఎస్ నేతలకు చనగాని దయాకర్ వార్నింగ్
Chanagani Dayakar | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) అన్నారు. కేటీఆర్ (KTR) కటౌట్లను పబ్బుల వద్ద, కేసీఆర్ (KCR) ఫొటోలను వైన్స్‌ల దగ్గర పెడతామని హెచ్చరించారు.
Chanagani Dayakar | త్రినేత్ర న్యూస్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని, చిల్లర రాజకీయాలు మానుకోవాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి చనగాని దయాకర్ (Chanagani Dayakar) అన్నారు. కేటీఆర్ (KTR) కటౌట్లను పబ్బుల వద్ద, కేసీఆర్ (KCR) ఫొటోలను వైన్స్‌ల దగ్గర పెడతామని హెచ్చరించారు. రాహుల్ గాంధీని అవమానించేలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో హైదరాబాద్ ఆర్టీసీ ఎక్స్ రోడ్‌లోని బావర్చీ బిర్యానీ హోటల్‌లో యువతతో కలిసి బిర్యానీ తింటూ రాహుల్ గాంధీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లయిన ఉద్యోగాల భర్తీ ఊసే లేదంటూ బీఆర్ఎస్ (BRS) నేతలు గురువారం రాత్రి బావర్చీ హోటల్‌లో రాహుల్ బొమ్మకు బిర్యాని తినిపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు అక్కడి చేరుకోవడంతో.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో చనగాని దయాకర్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీకి తెలంగాణ యువత పట్ల ప్రేమ ఉండటతోనే కలిసి భోజనం చేశారన్నారు. పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఎప్పుడైనా అశోక్‌నగర్ వచ్చారా అని ప్రశ్నించారు.
ఇంకా ఎన్ని రోజులు నిరుద్యోగుల పేరు చెప్పు కొని పబ్బం గడుపుతారని, కొంచమైనా సిగ్గుండాలని బీఆర్ఎస్ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) అచ్చంపేట సభలో మాట్లాడుతూ ఏడాదిలో 25 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇవ్వడాన్ని స్వాగతించాలన్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో క్లబ్‌లు, పబ్బుల సంస్కృతి తీసుకొచ్చారని, టానిక్ లిక్కర్ షాప్‌లు పెట్టారని మండిపడ్డారు.
రేవంత్ ప్రజా పాలనలో ఉద్యోగాల భర్తీ, ఇంటిగ్రేడ్ స్కూల్స్, విద్యా, వైద్యంపై దృష్టి పెట్టి అమలు చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ పెరగడానికి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం తోడ్పడితే.. గంజాయి రహిత డ్రగ్స్ రహిత తెలంగాణ (Telangana) కోసం సీఎం రేవంత్ రెడ్డి ఉక్కుపాదం మోపుతున్నారని వెల్లడించారు. నిరుద్యోగులకు ముఖ్యమంత్రి అండగా నిలిచారని, రానున్న రోజుల్లో ఉద్యోగాల భర్తీ ఉంటుందని తెలిపారు.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం






