Congress | పెద్దపల్లి జిల్లా నేతల మధ్య విభేదాలు.. బీఎం సందీప్‌తో మంత్రి అడ్లూరి భేటీ
Congress | అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ (Congress) వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్ (BM Sandeep) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి (Peddapally) జిల్లాలో పార్టీ నాయకుల మధ్య విభేదాలపై ఆయన చర్చించనున్నారు.
Congress | త్రినేత్ర న్యూస్: అధికార పార్టీ నేతల మధ్య నెలకొన్న విభేదాల పరిష్కారంపై రాష్ట్ర కాంగ్రెస్ (Congress) వ్యవహారాల ఇన్‌చార్జ్ బీఎం సందీప్ (BM Sandeep) ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పెద్దపల్లి (Peddapally) జిల్లాలో పార్టీ నాయకుల మధ్య విభేదాలపై ఆయన చర్చించనున్నారు. దీంతో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ను (Adluri Laxman) గాంధీభవన్‌కు రావాలని పిలిచినట్లు సమాచారం.
పెద్దపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్‌బాబు (Sridhar Babu), ఎంపీ వంశీకృష్ణ (MP Vamshi Krishna) వర్గీయుల మధ్య గతకొద్ది కాలంగా అంతర్గత వివాదాలు చోటుచేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇరువర్గాలు క్రమశిక్షణ కమిటీకి పరస్పరం ఫిర్యాదులు కూడా చేసుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం తన తనయుడు, ఎంపీ వంశీకృష్ణతో కలిసి మంత్రి గడ్డం వివేక్ (Vivek Venkata Swamy) పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి సందీప్‌ను గురువారం కలిశారు. తాజాగా జిల్లాకు చెందిన మరో మంత్రికి గాంధీభవన్ నుంచి పిలుపు రావడంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది.
బీఎం సందీప్‌తో భేటీ అనంతరం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రొటోకాల్ వ్యవహారం అధికారులు చూసుకుంటారన్నారు. ఎంపీ వంశీ తమ్ముడి లాంటి వారు, కూర్చొని మాట్లాడితే అంతా సమసిపోతుందని చెప్పారు. ప్రొటోకాల్ పాటించని అధికారులపై ఫిర్యాదు చేసే హక్కు ఎంపీకి ఉంటుందని తెలిపారు. అయితే ప్రతీది మంత్రికి ఆపాదించడం సరైందికాదని వెల్లడించారు.
అయితే వంశీకృష్ణ , మంత్రి శ్రీధర్‌బాబు వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి వివేక్ ఇప్పటికే స్పష్టం చేశారు. వంశీకృష్ణ ఇండిపెండెంట్‌గా వ్యవహరిస్తున్నారని, ఆయన వ్యవహారాలను ఆయనే చూసుకుంటారన్నారు. తనకు ఎవరితోనూ ఎలాంటి విభేదాలు లేవని, తాను పార్టీ మారుతానని ప్రచారం చేయడానికి కొంతైనా విచక్షణ ఉండాలని వ్యాఖ్యానించారు. తాను ఎవరిపైనా ఫిర్యాదు చేయబోనని స్పష్టం చేశారు.
శిలాఫలకంలో సీఎం, మంత్రి పేరు లేకపోవడంతో..
అయితే పెద్దపల్లి జిల్లా మంథనిలో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ శిలాఫలకం విషయంలో ఎంపీ వంశీకృష్ణ సీఎస్‌కు లేఖ రాశారు. ‘‘ శిలాఫలకంపై సీఎం, సంబంధిత శాఖ మంత్రి పేరు లేదని.. సమస్య శిలాఫలకంపై కాదు.. ఆలోచనలోనే ఉందన్నారు. సీఎం పేరు విస్మరించడం.. కార్యనిర్వాహక పదవి గౌరవానికి భంగమే’’ అని వంశీకృష్ణ అన్నారు. ఈ పేర్ల విషయంలో విచారణ జరిపి వెంటనే మార్చేందుకు ఆదేశించాలని సీఎస్‌కు విజ్ఞప్తి చేశారు.
కాగా, రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం పెంచడంతో పాటు అంతర్గత విభేదాలకు పరిష్కారం చూపడంపై సందీప్ దృష్టి పెట్టారు. డిసెంబర్ 15 నుంచి అన్ని జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ పరిస్థితులు, నేతల మధ్య సమన్వయంపై చర్చించనున్నారు.
తాజావార్తలు
- ●Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు
- ●BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల
- ●AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..
- ●HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం
- ●Special Trains | సంక్రాంతికి స్పెషల్ రైళ్లు.. ప్రయాణికులకు ఊరట.. ప్రయాణ తేదీలు, ఆగే స్టేషన్ల వివరాలు ఇవే..!
- ●Siddharth Galla | కొరియన్ అమ్మాయి మెడలో మూడుముళ్లు వేసిన మహేష్‌బాబు మేనల్లుడు

Crime News | ఎల్బీనగర్లో భారీ దోపిడీ.. రూ.3.20 కోట్లు ఎత్తుకెళ్లిన దుండగులు

BRS NRI | డీలిమిటేషన్లో తెలంగాణ ప్రయోజనాలే ప్రథమ ప్రాధాన్యం: మహేశ్ బిగాల

AIIMS | పార్కిన్సన్ చికిత్సలో సరికొత్త ముందడుగు..

HMDA | మోకిల ప్లాట్ల ఈ-వేలానికి రంగం సిద్ధం.. డిసెంబర్లో 61 ఓపెన్ ప్లాట్ల విక్రయం



