MLA Bindhu Krishna | మహిళా ఎమ్మెల్యే పట్ల కాంగ్రెస్ నేత అసభ్యకర ప్రవర్తన.. హగ్ చేసుకునేందుకు..
MLA Bindhu Krishna | కేరళంలో కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ పట్ల ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ఒకరు అసభ్యకరంగా ప్రవర్తించాడు. పబ్లిక్‌లోనే ఆమెను బలవంతంగా హగ్ చేసుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె అతడి చర్యను సున్నితంగా తిరస్కరించినా ఆయన వినలేదు. మళ్లీ మళ్లీ కౌగిలించుకోవాలని చూశాడు. అతడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
MLA Bindhu Krishna | కేరళంలో కాంగ్రెస్‌కు చెందిన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ (MLA Bindhu Krishna)కు చేదు అనుభవం ఎదురైంది. బిందు కృష్ణ పట్ల ఆ పార్టీ సీనియర్ నేత చెరియన్ ఫిలిప్ (Cherian Philip) అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఆమెను అందరి ముందు కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. ఆమె ఎంత తిరస్కరించినా అతను మాత్రం ఆమెను హగ్ చేసుకునేందుకు మళ్లీ మళ్లీ ప్రయత్నించాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
తిరువనంతపురంలోని కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యాలయంలో నేడు శాసనసభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు హాజరయ్యారు. కొల్లాం నుంచి ఎన్నికైన మహిళా ఎమ్మెల్యే బిందు కృష్ణ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గేటు వద్ద నుంచే మీడియా ప్రతినిధులకు, పార్టీ ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలను ఆమె పలకరించుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో అక్కడున్న చెరియన్ ఫిలిప్‌ను కూడా ఆమె కరచాలనం చేసి విష్ చేసేందుకు వెళ్లింది.
అయితే, అతను మాత్రం ఆమెను కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. అతడి చర్యను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా అతను ఆగలేదు. మళ్లీ, మళ్లీ ఆమెను పట్టుకుని కౌగిలించుకునేందుకు ప్రయత్నించాడు. బిందు కృష్ణ చేతులు జోడించి అక్కడి నుంచి ముందుకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడ మీడియా ప్రతినిధులు, పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు చాలా మంది ఉన్నారు. ఇలా అందరీ ముందు ఆమె పట్ల అతను ప్రవర్తించిన తీరు చర్చకు దారితీస్తోంది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. బహిరంగ, వృత్తిపరమైన ప్రదేశంలో ఇలాంటి పవర్తన ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతనిపై తగిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
A video from the Kerala Pradesh Congress Committee headquarters in Thiruvananthapuram has gone viral after Cherian Philip allegedly attempted to hug newly elected Kollam MLA Adv. Bindu Krishna despite her apparent reluctance during a legislative party meeting.
The viral video… pic.twitter.com/UhURpa80Qz
— Hate Detector 🔍 (@HateDetectors) May 7, 2026
Also Read..
టీఎంసీలో టెన్షన్.. మమతతో కీలక భేటీకి 10 మంది ఎమ్మెల్యేలు డుమ్మా..?
ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకునేదిలేదు: తలసాని శ్రీనివాస్ యాదవ్
డ్రగ్ టెస్టుకు కేటీఆర్ సిద్ధం.. మరి బండి సంజయ్ సిద్ధమా..? : పాడి కౌశిక్ రెడ్డి
సంబంధిత వార్తలు

Kerala | 10 గంటలకు కేరళ సీఎంగా వీడీ సతీశన్ ప్రమాణ స్వీకారం.. 20 మంది మంత్రులు కూడా..
మే 18, 2026

Longest Non-Stop Train | దేశంలో ఒక్కచోట కూడా ఆగకుండా అత్యధిక దూరం ప్రయాణించే రైలు ఏది?
మే 17, 2026

Rajdhani Express | షార్ట్ సర్క్యూట్‌తో.. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన ప్రాణనష్టం
మే 17, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



