Padi Kaushik Reddy | డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటడు.. బండి సంజయ్‌పై పాడి కౌశిక్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Padi Kaushik Reddy | డ్రగ్ టెస్టుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు.. మరి బండి సంజయ్, రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు.
Padi Kaushik Reddy | త్రినేత్ర.న్యూస్ : డ్రగ్ టెస్టుకు కేటీఆర్ సిద్ధంగా ఉన్నారు.. మరి బండి సంజయ్, రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారా..? అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
ఇవాళ సవాల్ విసురుతున్నా.. నువ్వు అన్నావ్ కదా డ్రగ్స్ కేటీఆర్ అని. రా.. కేటీఆర్ టెస్టుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. టైమ్, డేట్ ఫిక్స్ చేయ్. బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కేటీఆర్.. ముగ్గురు వెళ్లి డ్రగ్స్ టెస్టుకు నమూనాలు ఇవ్వండి. ఎవరు డ్రగ్స్ తీసుకున్నారో ప్రజలకు తెలిసిపోతది కదా..! ఇవాళ మేం కూడా అనొచ్చు బండి సంజయ్.. డ్రగ్స్ మిక్స్ చేసుకుని తంబాకు తింటేనే.. సైడ్ ఎఫెక్ట్ అయి వెంట్రుకలన్నీ ఊసిపోయి గుండు అయిందని అనుకుంటున్నా. మరి మీకు కూడా కచ్చితంగా డ్రగ్స్ టెస్టు చేయాలి. కచ్చితంగా మీకు డ్రగ్ టెస్టు చేయాలి. మీరు నోటికొచ్చినట్టు మాట్లాడితే మేం నోటికొచ్చినట్టు మాట్లాడలేమా..? మాకు మాటలు రావా.. చేత కాదా..? ఇవాళ డ్రగ్స్ టెస్టుకు రా.. మేం కూడా సిద్ధంగా ఉన్నాం అని పాడి కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు.
తెలంగాణ ఏమైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో ఉందా..?
ఇవాళ మీరు కరీంనగర్‌లో సిగ్గుపడాలి బండి సంజయ్. మొన్న ప్రెస్ మీట్ పెట్టి నాకేం సంబంధం అని బండి సంజయ్ మాట్లాడారు. కౌశిక్ రెడ్డి ఏదేదో మాట్లాడి పోతున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ బురదజల్లి పోతుందని అన్నారు.. మరి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో లేదా..? తెలంగాణ రాష్ట్రం ఏమైనా బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలో ఉందా..? ఈ దేశానికి బండి సంజయ్ హోం శాఖ సహాయ మంత్రి కాదా..? మీ ఆఫీసుకు కూతవేటు దూరంలో ఫైరింగ్ జరిగితే మీరు బాధ్యత తీసుకోరా..? నాకేం సంబంధం అంటవ్.. నీకు సంబంధం లేదా..? నీవు ఫెయిల్యూర్ అయిన హోం శాఖ సహాయ మంత్రివి అని కౌశిక్ రెడ్డి నిప్పులు చెరిగారు.
కేటీఆర్‌కు ఉన్న నైపుణ్యం మీకు ఉందా..?
కరీంనగర్‌లో ఫైరింగ్ జరిగి నాలుగు రోజులు అవుతుంది. మీరు ఒక్కరోజన్నా రివ్యూ మీటింగ్ పెట్టారా..? ఎంత వరకు వచ్చిందని సీసీని కానీ, పోలీసు యంత్రాంగాన్ని కానీ అడిగారా..? రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం.. నాకు లేదంటే అది మీ డ్యూటీ కాదు.. రేవంత్ రెడ్డిని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ఎందుకు తిట్టడం లేదు.. కారణం ఏంటి.. చాలాచాలా బాధాకరం.. ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సింది పోయి పర్సనల్‌గా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. మేం మాట్లాడదలచుకుంటే మీ కంటే డబుల్, ట్రిపుల్ మాట్లాడుతాం.. కానీ ఓపికగా ఉన్నాం.. నిన్న మీరు మాట్లాడిన మాటలు చూస్తే చాలా బాధ అనిపించింది. కేటీఆర్‌కు ఉన్న నైపుణ్యం మీకు ఉందా..? మీరు ఏ సబ్జెక్ట్ కోరితే దానిపై చర్చకు సిద్ధం. ఖర్చంతా నేనే భరిస్తా అని కౌశిక్ రెడ్డి తేల్చిచెప్పారు.
సంబంధిత వార్తలు

KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
మే 21, 2026

RS Praveen Kumar | బండి భగీరథ్‌ను అరెస్టు చేయలేదు.. లొంగిపోయాడు : ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
మే 21, 2026

K Srinivas Reddy | 21 మంది జర్నలిస్టు కుటుంబాలకు ఆర్థిక సాయం: మీడియా అకాడమీ చైర్మన్ కే శ్రీనివాస్‌రెడ్డి
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



