త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Srinivas Yadav | ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకునేదిలేదు: తలసాని శ్రీనివాస్ యాదవ్

Srinivas Yadav | ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకునేది లేద‌ని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) స్ప‌ష్టం చేశారు.

G

Hyderabad | Published On May 7, 2026, 3.15 pm IST

Srinivas Yadav | ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకునేదిలేదు: తలసాని శ్రీనివాస్ యాదవ్
Advertisement

Srinivas Yadav | త్రినేత్ర‌.న్యూస్‌: ఓటరు సవరణలో తప్పిదాలు జరిగితే ఊరుకునేది లేద‌ని మాజీమంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Srinivas Yadav) స్ప‌ష్టం చేశారు. సికింద్రాబాద్‌ పద్మారావునగర్‌లోని SP కాలేజీలో ప్ర‌త్యేక ఓట‌రు స‌వ‌ర‌ణ కార్య‌క్ర‌మం (SIR) కేంద్రాన్ని సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఓటరు మ్యాపింగ్ విధానం, ప్రత్యేక ఓటరు సవరణ కార్యక్రమం తీరును అధికారుల‌ను అడిగి తెలుకున్నారు.

ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాల‌న్నారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో సాంకేతికతపై అనుభవం ఉన్న వారిని నియమించాల‌ని చెప్పారు. ఈ కార్యక్రమంపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయ‌ని వెల్ల‌డించారు. ప్రజలు తప్పనిసరిగా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ పేరు ఓటరు జాబితాలో ఉండేలా జాగ్రత్త పడాల‌న్నారు. పార్టీ పరంగా తమ నాయకులు, కార్యకర్తలు ఓటర్లకు అందుబాటులో ఉంటార‌ని చెప్పారు.

Advertisement
Advertisement