త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kolkata | కోల్‌క‌తాలో అర్ధ‌రాత్రి హైడ్రామా.. టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్

Kolkata | ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌రి రోజే కోల్‌క‌తాలో (Kolkata) అర్ధ‌రాత్రి హైడ్రామా చోటుచేసుకున్న‌ది. కోల్‌క‌తాలోని చారిత్ర‌క హాగ్ మార్కెట్‌లో (Hogg Market) ఉన్న టీఎంసీ (TMC) పార్టీ కార్యాల‌యంపైకి బుల్డోజ‌ర్లు (Bulldozers) దూసుకెళ్లాయి.

G

National | Published On May 6, 2026, 9.24 am IST

Kolkata | కోల్‌క‌తాలో అర్ధ‌రాత్రి హైడ్రామా.. టీఎంసీ ఆఫీసుపైకి బుల్డోజర్
Advertisement

Kolkata | త్రినేత్ర‌.న్యూస్‌: ఎన్నిక‌ల ఫ‌లితాలు వెలువ‌డిన మ‌రుస‌రి రోజే కోల్‌క‌తాలో (Kolkata) అర్ధ‌రాత్రి హైడ్రామా చోటుచేసుకున్న‌ది. కోల్‌క‌తాలోని చారిత్ర‌క హాగ్ మార్కెట్‌లో (Hogg Market) ఉన్న టీఎంసీ (TMC) పార్టీ కార్యాల‌యంపైకి బుల్డోజ‌ర్లు (Bulldozers) దూసుకెళ్లాయి. దీంతో న‌గ‌రంలో తీవ్ర ఉద్రిక్త‌తకు దారితీసింది. అత్యంత ర‌ద్దీగా ఉండే హాగ్ మార్కెట్ ప్రాంతంలోని తృణ‌మూల్ కాంగ్రెస్ యూనియ‌న్ ఆఫీస్‌ను ప‌లువురు బుల్డోజ‌ర్‌తో కూల్చివేశారు. దీంతో పార్టీ కార్యాల‌యం పూర్తిగా నేల‌బ‌ట్ట‌మైంది. దీంతో భ‌యాందోళ‌న‌ల‌కు గురైన వ్యాపారులు త‌మ దుకాణాల‌ను మూసివేపి అక్క‌డి నుంచి పారిపోయారు.

బుల్డోజర్లు తీసుకొచ్చిన వారి చేతుల్లో బీజేపీ (BJP), ఆర్‌ఎస్‌ఎస్‌ (RSS) జెండాలు కన్పించడం గ‌మ‌నార్హం. సమాచారం అందుకున్న పోలీసులు అక్క‌డికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. కూల్చివేతకు దృశ్యాలను టీఎంసీ తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేసింది. `బీజేపీ పరివర్తన్‌ మొదలైంది. ఈ మార్పు బుల్డోజర్‌తో వచ్చింది. బీజేపీ కార్యకర్తలు వీధుల్లోకి వెళ్లి దాడులకు పాల్పడేలా ఆ పార్టీ అధిష్ఠానం వారికి లైసెన్స్‌ ఇచ్చినట్లు ఉంది. ఈ రోజు దుకాణాలు, ఆఫీసులను కూలుస్తున్నారు. రేపు రాజకీయ ప్రత్యర్థులనూ వదిలపెట్టరేమో..!` అని మండిపడింది.

మ‌రోవైపు ప‌రివ‌ర్త‌న్ అంటే ఇదేనా అని టీఎంసీ కార్య‌క‌ర్త‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. కోల్‌క‌తాలోని న్యూ మార్కెట్, బెంగాళీలు ఈ ప‌రివ‌ర్త‌నాన్ని ఆస్వాదిస్తున్నారు. పోలీసులు స‌మ‌క్షంలోనే ఈ కూల్చివేత‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. బెంగాల్‌లో ఈ బుల్డోజ‌ర్ రాజ‌కీయాల‌ను అడ్డుకుంటామ‌ని స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement