Operation Sindoor | ఆపరేషన్ సిందూర్‌లో భారత్‌దే విజయం.. ఆస్ట్రియన్ సైనిక నిపుణుడి సంచలన వ్యాఖ్యలు..!
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఏడాదవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రియన్ చరిత్రకారుడు, యుద్ధ విశ్లేషకుడు టామ్ కూపర్ భారత చర్యలను స్పష్టమైన సైనిక విజయంగా పేర్కొన్నారు.
Operation Sindoor | పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ ఏడాదవుతోంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రియన్ చరిత్రకారుడు, యుద్ధ విశ్లేషకుడు టామ్ కూపర్ భారత చర్యలను స్పష్టమైన సైనిక విజయంగా పేర్కొన్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఉద్రికత్త పరిస్థితుల్లో భారత్ సైనికంగా ప్రత్యర్థిని మించిపోయిందని, సమతుల్యమైన చర్యలతో బలమైన వ్యూహాత్మక సందేశాన్ని పంపిందని పేర్కొన్నారు. కూపర్ విశ్లేషణ వివరాల ప్రకారం.. ఆపరేషన్ సిందూర్ కింద భారత్ చేపట్టిన దాడులు వ్యూహాత్మకంగా ప్రభావవంతంగా నిలిచాయన్నారు.
స్పష్టమైన సందేశం పంపింది..
పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ప్రధాన ఉగ్రవాద కేంద్రాలపై భారత్ విజయవంతమైన ప్రతిదాడులు జరిపింది. ఇంతకు ముందు భారత్ చేరుకోలేదని భావించిన స్థావరాలను కూడా లక్ష్యంగా చేసుకొని గణనీయమైన నష్టం కలిగించిందని చెప్పారు. దీంతో పాకిస్తాన్ రక్షణాత్మక ధోరణిలోకి వెళ్లాల్సి వచ్చిందన్నారు. భారత్ ఎక్కడికైనా వెళ్లి దాడి చేయగలదని, దాన్ని ఆపడం సాధ్యం కాదనే స్పష్టమైన సందేశాన్ని ఇచ్చిందని కూపర్ పేర్కొన్నారు. ఇది భారత్ వ్యూహాత్మక ఆలోచనలో భారీ మార్పులకు సంకేతమని విశ్లేషించారు. ఈ ఘర్షణలో ఎవరు గెలిచారు అన్న ప్రశ్నకు ఆయన స్పష్టంగా భారత్‌దే విజయమని సమాధానమిచ్చారు. భారత్ దాడుల అనంతరం పాకిస్తాన్ ప్రతీకార చర్యలు చేపట్టేందుకు ప్రయత్నించింది. అమృతసర్ సహా పలు ప్రాంతాల్లో భారత వైమానిక స్థావరాలు, సైనిక కేంద్రాలు, పౌర ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్నప్పటికీ, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయని కూపర్ తెలిపారు.
పాక్ అంతర్గత పరిస్థితులపై..
భారత్ వాయుసేన, రక్షణ వ్యవస్థలు పాకిస్తాన్ ప్రయోగించిన రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లలో 95-98 శాతం వరకు విజయవంతంగా తిప్పికొట్టాయని ఆయన చెప్పారు. పాకిస్తాన్ అంతర్గత పరిస్థితులపై సైతం కూపర్ స్పందించారు. అక్కడ సైన్యం తమ ప్రాధాన్యతను నిలబెట్టుకునేందుకు ప్రభుత్వానికి తాము కీలకమని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉందన్నారు. దేశీయ రాజకీయాల్లో సైనిక శక్తి ప్రతిష్ఠను నిలబెట్టుకోవడం ముఖ్యాంశంగా మారిందని అభిప్రాయపడ్డారు. ఇక చైనా పాత్రపై మాట్లాడుతూ పాక్ తన సైనిక సామర్థ్యాన్ని పెంచుకునేందుకు చైనా మేడ్ యుద్ధవిమానాలు, క్షిపణులపై ఆధారపడుతున్నప్పటికీ, అవి దీర్ఘకాలిక పరిష్కారం కాదన్నారు. ఆర్థిక ఒత్తిడిలో ఉన్న పాకిస్తాన్ భారీ రక్షణ కొనుగోళ్లను దీర్ఘకాలం కొనసాగించడం కష్టమని తెలిపారు. భారీ పెట్టుబడి ప్రాజెక్టులు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదని ఆయన వ్యాఖ్యానించారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు






