త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chennai road caves | కుంగిన రోడ్డు.. గుంత‌లో ప‌డిపోయిన‌ కారు

Chennai road caves | చెన్నై (Chennai) టైడల్ పార్క్ (Tidel Park) సమీపంలో రోడ్డు అక‌స్మాత్తుగా కుంగిపోయింది. దాదాపు 10 అడుగుల మేర భారీ గుంత ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న కారు ఒక్క‌సారిగా గుంత‌లోకి బోల్తాప‌డింది.

D

National | Published On Oct 8, 2026, 3.28 pm IST

Chennai road caves | కుంగిన రోడ్డు.. గుంత‌లో ప‌డిపోయిన‌ కారు
Advertisement

Chennai road caves | త్రినేత్ర న్యూస్ : చెన్నై (Chennai)లో షాకింగ్ ఘ‌ట‌న చోటు చేసుకుంది. టైడల్ పార్క్ (Tidel Park) సమీపంలో తిరువణ్మియూర్ రోడ్డులో రోడ్డు అక‌స్మాత్తుగా కుంగిపోయింది. అక్క‌డ భారీ గుంత (sinkhole) ఏర్ప‌డింది. ఆ స‌మ‌యంలో అటుగా వెళ్తున్న కారు ఒక్క‌సారిగా గుంత‌లో ఇరుక్కుపోయింది.

ప్ర‌మాదానికి స‌మీపంలోనే మెట్రో రైలు నిర్మాణ ప‌నులు జ‌రుగుతున్నాయి. రోడ్డు ఒక్క‌సారిగా కుంగిపోయి అక్క‌డ దాదాపు 10 అడుగుల మేర భారీ గుంత ఏర్ప‌డింది. అదే స‌మ‌యంలో అటుగా వ‌చ్చిన కారు గుంతలోకి దూసుకెళ్లింది. ఆ త‌ర్వాత కాసేప‌టికే అది బోల్తాప‌డింది. ప్ర‌మాద స‌మ‌యంలో కారులో ఇద్ద‌రు వ్య‌క్తులు ఉన్నార‌ని వారు సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డిన‌ట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘ‌ట‌న‌తో అటుగా వెళ్తున్న ప్ర‌యాణికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని రోడ్డు మ‌ర‌మ్మ‌తు ప‌నులు చేప‌ట్టారు. ఈ ఘ‌ట‌న‌తో ఆ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది.

Also Read..

వైద్యుల‌కు గిఫ్ట్‌లు.. ఫార్మా కంపెనీల అనైతిక మార్కెటింగ్‌పై కేంద్రానికి సుప్రీం కీల‌క ఆదేశాలు

సీఈసీ, ఈసీల నియామ‌కాల‌పై సుప్రీంకోర్టులో స‌వాల్‌

మండుతున్న ఎండ‌లు.. ఆదిలాబాద్‌లో అత్య‌ధిక ఉష్ణోగ్ర‌త‌లు న‌మోదు..!

Advertisement
Advertisement