Ponnam Prabhakar | జ్ఞానేశ్, మోదీ గద్దె దిగేదాకా పోరాటం ఆపం: మంత్రి పొన్నం ప్రభాకర్
Ponnam Prabhakar | సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ గద్దె దిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. లక్షల ఓట్లను తొలగించే ప్రక్రియకు బీజేపీ నాయకత్వం వహిస్తోందని ఆరోపించారు.
Ponnam Prabhakar | త్రినేత్ర న్యూస్: సీఈసీ జ్ఞానేశ్‌కుమార్, ప్రధాని నరేంద్ర మోదీ గద్దె దిగే వరకు పోరాటం కొనసాగిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. లక్షల ఓట్లను తొలగించే ప్రక్రియకు బీజేపీ నాయకత్వం వహిస్తోందని ఆరోపించారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో చేసే ఈ దేశవ్యాప్త పోరాటంలో తెలంగాణ అగ్రభాగంలో నిలుస్తుందన్నారు. చలో లోక్‌భవన్ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు.
లక్షల ఓట్లను తొలగించే ప్రక్రియకు బీజేపీ నాయకత్వం వహిస్తోంది. దీని కోసం సహకరిస్తున్న ఎన్నికల కమిషనర్‌పై ఇద్దరు సభ్యులు విభేదిస్తే కూడా, సుప్రీంకోర్టు ఈ విధానాన్ని తప్పుబడితే కూడా, 200కు పైగా ఎంపీలు ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఢిల్లీ కేంద్రంగా ధర్నా చేస్తే కూడా వారిని కూడా అరెస్టు చేస్తున్నారు. అప్రజాస్వామికంగా పరిపాలించాలనే నరేంద్ర మోదీ గద్దె దిగే వరకు, బీజేపీ అనుబంధ సంస్థగా పని చేస్తున్న సీఈసీ జ్ఞానేశ్‌కుమార్ రాజీనామా చేసేంతవరకు పోరాటం చేస్తాం.
ఓటును, రాజ్యాంగాన్ని రక్షిస్తాం..
అరెస్టులకు వ్యతిరేకంగా ఈరోజు చలో లోక్‌భవన్ చేపట్టాం. మోదీ ఆదేశాల మేరకు ఇక్కడ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు చేస్తున్నారు. ఏదిఏమైనా పోరాడడం అనేది కాంగ్రెస్ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య. ఆనాడు స్వాతంత్య్రోద్యమంలో ఎలా పోరాడామో రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, సామాన్య, గిరిజనుల ఓట్లు కాపాడడానికి రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం చేయడానికి తెలంగాణ అగ్రభాగాన నిలుస్తుంటది. ఓటు బచావో, దేశ్ బచావో, జ్ఞానేశ్‌కుమార్ హఠావో అని నినదిస్తూనే ఉంటం అని పొన్నం హెచ్చరించారు.
తాజావార్తలు
- ●Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?
- ●Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం
- ●Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..
- ●AICWA | నానా పటేకర్ మృతిపై తనుశ్రీ దత్తా వ్యాఖ్యలు.. తీవ్రంగా ఖండించిన సినీ ఆర్టిస్ట్ అసోసియేషన్
- ●GO 59 | జీవో 59 దరఖాస్తుదారులకు శుభవార్త

Jim Jim Tara | జగిత్యాల మెడికోలు పాడిన 'జిమ్ జిమ్ తార'.. ఒరిజినల్ ట్యూన్/సాంగ్ ఎక్కడిదో తెలుసా?

Bathukamma | బతుకమ్మ విశిష్టతను విశ్వవ్యాప్తం చేస్తాం

Balmoor Venkat | వీక్లీ సీరియల్లా కేటీఆర్ బాగోతాలు బయటేస్తా

Stock Markets | స్టాక్ మార్కెట్లలో జోష్.. 879 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్..






