CM Vijay | కూటమి పార్టీల నుంచి వ్యతిరేకత.. ఓఎస్డీగా రిక్కి రాధన్ పండిట్ నియామకాన్ని రద్దు చేసిన విజయ్
CM Vijay | తన వ్యక్తిగత జ్యోతిష్యుడు (astrologer) రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ (Rickey Radhan Pandit Vettrivel) నియామకం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) వెనక్కి తగ్గారు. రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
CM Vijay | తన వ్యక్తిగత జ్యోతిష్యుడు (astrologer) రిక్కి రాధన్ పండిట్ వెట్రివేల్ (Rickey Radhan Pandit Vettrivel) నియామకం విషయంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay) వెనక్కి తగ్గారు. రిక్కి రాధన్‌ను ముఖ్యమంత్రి కార్యాలయంలో 'ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ' (OSD - పొలిటికల్)గా నియమిస్తూ ఇచ్చిన ఆదేశాలను వెనక్కి తీసుకున్నారు. తన వ్యక్తిగత జ్యోతిషుడిని ఓఎస్డీగా నియమించడంపై కూటమి భాగస్వామ్య పక్షాల నుంచి బహిరంగంగా విమర్శలు వచ్చాయి. ప్రతిపక్ష పార్టీలు సైతం విజయ్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టాయి. ఈ అంశం తమిళ రాజకీయ వర్గాల్లో వివాదానికి దారితీసింది. దీంతో ముఖ్యమంత్రి సీఎం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని రద్దు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
రిక్కీ రాధన్ పండిట్ వెట్రివేల్ తమిళనాడులో అత్యంత ప్రభావవంతమైన ఆస్ట్రాలజర్. ఆయనకు వేద జ్యోతిష్యం, సంఖ్యాశాస్త్రంలో 40 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. గతంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జె. జయలలితతో పాటు దేశంలోని పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలకు ఆయన వ్యక్తిగత జ్యోతిష్యుడిగా సలహాలు అందించారు. ఇక రెండేళ్ల క్రితం పార్టీ స్థాపించిన విజయ్ కూడా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రిక్కీ రాధన్ ముందే ఊహించారు. విజయ్ ప్రమాణ స్వీకారోత్సవానికి కూడా ఆయనే ముహూర్తం పెట్టారు. మే 10న ఉదయం 10 గంటలకే ప్రమాణస్వీకారం చేయాలని విజయ్‌కి సూచించారు. దీంతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం రిక్కి రాధన్‌ను ఓఎస్డీగా నియమిస్తూ విజయ్ నిర్ణయం తీసుకున్నారు.
Also Read..
పెట్రోల్, డీజిల్ ధరల పెంపు తప్పదు.. ఆర్బీఐ గవర్నర్ కీలక హెచ్చరికలు
కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ @ 400
పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు: గెల్లు శ్రీనివాస్ యాదవ్
సంబంధిత వార్తలు

Vijay TVK cabinet 2026 | సీఎం విజయ్ ‘క్యాబినెట్ ఆఫ్ ఫస్ట్స్’: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకం.. దళపతి మాస్టర్ మైండ్
మే 21, 2026

Vijay Cabinet | విజయ్ సర్కార్ కేబినెట్ విస్తరణ.. 23 మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
మే 21, 2026

CM Vijay | ప్రభుత్వ వాహనాన్ని స్వయంగా నడిపిన సీఎం విజయ్
మే 20, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



