Chicken Prices | కొండెక్కిన కోడి ధర.. కిలో చికెన్ @ 400
Chicken Prices | కోడి ధరలు (Chicken Prices) కొండెక్కి కూర్చున్నాయి. గత నెల రూ.250గా ఉన్న కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.400కి చేరింది. ఈ నెల 1న కిలో రూ.259గా ఉన్న ధర ఆదివారం ఏకంగా రూ.360కి పెరిగింది.
Chicken Prices | కోడి ధరలు (Chicken Prices) కొండెక్కి కూర్చున్నాయి. గత నెల రూ.250గా ఉన్న కిలో చికెన్ ధర.. ఇప్పుడు రూ.400కి చేరింది. ఈ నెల 1న కిలో రూ.259గా ఉన్న ధర ఆదివారం ఏకంగా రూ.360కి పెరిగింది. పది రోజుల్లోనే కిలోపై రూ.100 పెరగడం గమనార్హం. దీంతో నాన్‌వెజ్ లవర్స్ షాక్ అవుతున్నారు. కోడి మాంసం కొనాలంటేనే బెంబేలెత్తుతున్నారు. అరాకొరా కూరతో సరిపెట్టుకుంటున్నారు. మరికొందరైతే అదే ధరకు మటన్ కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరు సీ ఫుడ్స్‌ను ప్రిఫర్ చేస్తున్నారు.
ఎండల తీవ్రతకు బాయిలర్ కోళ్లు వేడికి తట్టుకోలేక చనిపోతాయి. అందుకే ఎండాకాలం సాధారణంగానే కోడి మాంసం ధరలు కొండెక్కుతుంటాయి. ఒక ఫాంలో 20 వేల కోడి పిల్లలను పెంచాల్సిన రైతులు వేసవి కాలంలో కేవలం 5-10 వేల వరకు మాత్రమే పెంచుతారు. వేసవిలో కోడి పిల్లల ధరలు కూడా అధికంగా ఉంటాయి. ఒక్కో కోడి పిల్ల రూ.50 నుంచి రూ.60 వరకు ఉంది. ఈ సీజన్‌లో అవి వేడికి చనిపోతుంటాయి. దీంతో సహజంగానే బాయిలర్ కోళ్ల కొరత ఏర్పడి.. తద్వారా చికెన్ ధరలు పెరుగుతుంటాయి. దీనికి తోడు ఎండ తీవ్రతకు కోళ్లు మృత్యువాత పడుతుండటంతో పౌల్ట్రీ రైతులు కోళ్ల పెంపకంపై ఆసక్తి చూపరు. ఇది కూడా ధరల పెరుగుదల కారణంగా తెలుస్తోంది.
వేసవి కావడంతో ఎండలకు కోళ్లు చనిపోతున్నాయని, వాటి బరువు కూడా తగ్గిపోవడం వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో ప్రస్తుతం కిలో చికెన్ ధర రూ.390గా ఉంది. మరో 15 రోజుల వరకూ ధరలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఎండ తీవ్రతకు తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా ధరల పెరుగదలకు కారణంగా తెలుస్తోంది.
Also Read..
బారామతిలో కూలిన శిక్షణ విమానం.. గతంలో అజిత్ పవార్ మరణించింది కూడా ఇక్కడే
బలపరీక్షలో నెగ్గిన విజయ్ ప్రభుత్వం
ప్రధాని బాటలోనే కేంద్ర మంత్రులు.. కాన్వాయ్ సైజు కుదించుకున్న అమిత్ షా, జేపీ నడ్డా
సంబంధిత వార్తలు

Telangana SIR Process | “ఒక వ్యక్తికి ఒకే ఓటు” కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
జులై 6, 2026

Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
జులై 6, 2026

Corporation chairmens tenure | రేపటితో 34 కార్పొరేషన్ల ఛైర్మన్ల పదవీ కాలం పూర్తి..
జులై 6, 2026
తాజావార్తలు
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ
- ●Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్
- ●Divyabharathi | హాట్ ఫొటోలతో రచ్చ చేసిన సుడిగాలి సుధీర్ హీరోయిన్
- ●Uttam Kumar Reddy | 2028 జూన్ కల్లా ఎస్ ఎల్ బీసీని పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే

SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్

OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

Telangana SIR Process | "ఒక వ్యక్తికి ఒకే ఓటు" కచ్చితంగా అమలు కావాలి.. SIR గడువు పొడిగించండి: కేటీఆర్



