Gellu Srinivas Yadav | పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు: గెల్లు శ్రీనివాస్ యాదవ్
Gellu Srinivas Yadav | బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు (Paper Leak) చిరునామాగా మారాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) అన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యాను వ్యాపారంగా మార్చి విద్యార్థులను లాభం కోసం వినియోగించే పరిస్థితి ని తీసుకువచ్చిందని విమర్శించారు.
Gellu Srinivas Yadav | త్రినేత్ర.న్యూస్: బీజేపీ (BJP) పాలిత రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు (Paper Leak) చిరునామాగా మారాయని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ (Gellu Srinivas Yadav) అన్నారు. బీజేపీ ప్రభుత్వం విద్యాను వ్యాపారంగా మార్చి విద్యార్థులను లాభం కోసం వినియోగించే పరిస్థితి ని తీసుకువచ్చిందని విమర్శించారు. పేపర్ లీక్‌కు సంబంధించి నైతిక బాధ్యతవహిస్తూ ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నీట్ యూజీ పరీక్ష రద్దు నేపథ్యంలో లోక్‌భవన్ వద్ద బీఆర్ఎస్వీ నేతలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. `నీట్ పరీక్ష ప్రశ్న పత్రం లీకేజీ కేంద్ర ప్రభుత్వ వైఫల్యమే. దీంతో దేశ వ్యాప్తంగా 22లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. పరీక్షను నిర్వహించడంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విఫలమయింది. లక్షలాది మంది విద్యార్థులు రాత్రి పగలు కష్టపడి చదివితే వారికి దక్కింది పేపర్ లీక్‌లే.
బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయి. గతంలో 2021లో, 2024లో నీట్ పరీక్ష పత్రం లీక్ అయినా దాని నుంచి ఎన్‌టీఏ గుణపాఠం నేర్చుకొవడం లేదు. అందుకే మళ్లీ అలాంటి ఘటనలు పునరావృతం అవుతున్నాయి. 2024లో నీట్ లీకేజీ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కే రాధాకృష్ణన్ కమిటీని నియమించింది. అది నీట్ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని చెప్పింది. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ సిఫార్సులను అమలు చేయకపోతే ఆ కమిటీ ఎందుకు వేశారు?. రూ.వేలకోట్లు సొమ్ము చేసుకోవడానికే రాధాకృష్ణన్ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదు. పేపర్ లీక్ పై నైతికంగా బాధ్యత వహిస్తూ ఎన్టీఏ డీజీ అభిషేక్ సింగ్, కేంద్ర విద్యా శాఖ మంత్రి రాజీనామా చేయాలి.
బీజేపీ ప్రభుత్వం విద్యాను వ్యాపారంగా మార్చి విద్యార్థులను లాభం కోసం వినియోగించే పరిస్థితిని తీసుకువచ్చింది. ప్రశ్న పత్రం లీకు వెనుక ఉన్న సుత్రదారులను పట్టుకొని కఠినంగా శిక్షించాలి. మళ్లీ ఇలాంటి ఘటనలు జరగకుండా కేంద్రం చూడాలి. వెంటనే పరీక్ష తేదీలను ప్రకటించి అకడమిక్ క్యాలెండర్‌కు ఇబ్బంది లేకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించాలి` అని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
- ●POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!
- ●Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్
- ●Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!
- ●Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే
- ●SLBC tunnel project | 2028 జూన్ నాటికి ఎస్ఎల్బీసీ టన్నెల్ పూర్తి.. 4 లక్షల ఎకరాలకు సాగునీరు: మంత్రి ఉత్తమ్
- ●OTT | సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చిన సింగర్ సునీత కొడుకు మూవీ

POCSO Accused Escapes | మహబూబ్‌నగర్ జైలులో ఖైదీ సినిమాటిక్ ఎస్కేప్.. టవల్స్ సాయంతో 18 అడుగుల గోడ దూకేసి!

Telangana Assembly | తెలంగాణ అసెంబ్లీలో నయా రికార్డ్.. దేశంలోనే తొలిసారిగా మీడియాకు స్పెషల్ ఆఫీస్

Ayodhya Ram Mandir Trust | రామ జన్మభూమి ట్రస్ట్‌లో భారీ ప్రక్షాళన: చంపత్ రాయ్ రాజీనామా.. విరాళాల లెక్కలు పక్కా!

Bhagyashri Borse | లెనిన్ ప్రమోషన్స్‌లో చీరకట్టులో మెరిసిన భాగ్యశ్రీ బోర్సే






