త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tamil Thai Vazthu | వందేమాత‌రం కాదు.. త‌మిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్‌.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం

Tamil Thai Vazthu | త‌మిళ‌నాడులోని విజ‌య్ స‌ర్కార్ అసెంబ్లీలో కీల‌క తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. అన్ని ప్ర‌భుత్వ, ప్రైవేటు కార్య‌క్ర‌మాల ప్రారంభంలో జాతీయ గేయం వందేమాత‌రానికి బ‌దులు రాష్ట్ర గీతం 'త‌మిళ్ తాయ్ వాళ్తు' (Tamil Thai Vazthu) ను ఆలపించేలా తీర్మానం చేసింది. రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చి ఈ తీర్మానానికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెలిపాయి.

D

National | Published On Aug 10, 2026, 3.45 pm IST

Tamil Thai Vazthu | వందేమాత‌రం కాదు.. త‌మిళ్ తాయ్ వాళ్తు ఫస్ట్‌.. త‌మిళ‌నాడు అసెంబ్లీ ఏక‌గ్రీవ తీర్మానం
Advertisement

Tamil Thai Vazthu | త‌మిళ‌నాడులోని విజ‌య్ స‌ర్కార్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. రాష్ట్ర గీతం త‌మిళ్ తాయ్ వాళ్తు (Tamil Thai Vazthu)కు తొలి ప్రాధాన్యం ఇస్తూ అసెంబ్లీలో (Tamil Nadu Assembly) కీల‌క తీర్మానం ప్ర‌వేశ‌పెట్టింది. తమిళనాడులోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలు, ఇతర అధికారిక కార్యక్రమాల ప్రారంభంలో జాతీయ గేయం వందేమాత‌రానికి బ‌దులు 'త‌మిళ్ తాయ్ వాళ్తు'ను ఆలపించేలా విజ‌య్ స‌ర్కార్ ఈ తీర్మానం చేసింది.

రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఏక‌తాటిపైకి వ‌చ్చి ఈ తీర్మానానికి ఏక‌గ్రీవంగా ఆమోదం తెల‌ప‌డం విశేషం. ఈ సంద‌ర్భంగా విజ‌య్ భావోద్వేగ‌భ‌రిత ప్ర‌సంగం చేశారు. రాష్ట్ర భాష‌, సాంస్కృతిక హ‌క్కుల పరిరక్షణ విష‌యంలో త‌మ ప్ర‌భుత్వం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ రాజీప‌డ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. "త‌మిళం కేవ‌లం ఒక భాష మాత్ర‌మే కాదు. అది మ‌న జీవ‌నాడి. మ‌న భావోద్వేగాలు" అని ఉద్ఘాటించారు. మాతృభాష మాతృత్వం వలే స్వచ్ఛమైనదని పేర్కొన్నారు.

'త‌మిళ్ తాయ్ వాళ్తు' విషయంలో తమిళనాడులో రాజకీయ వివాదం కొనసాగుతోంది (Tamil Nadu politics). మే 10న జ‌రిగిన ముఖ్యమంత్రి విజ‌య్ (CM Vijay) ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మంలో గీతాలాప‌న క్ర‌మంపై పెద్ద ఎత్తున రాజ‌కీయ వివాదం చెల‌రేగిన విష‌యం తెలిసిందే. కార్యక్రమం ప్రారంభానికి ముందు వేదికపై మొద‌ట వందేమాతరం గేయాన్ని ఆలపించగా, అనంతరం జనగణమనతో పాటు త‌మిళ్ తాయ్ వాళ్తు ఆల‌పించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం వందేమాతరం అన్ని ఆరు చరణాలనూ ప్రదర్శించాలనే సూచనలు ఇవ్వడంతో, తమిళనాడు కొత్త ప్రభుత్వం ఆ నిబంధనలను పాటించింది.

అయితే, ప్ర‌భుత్వ నిర్ణ‌యంపై తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. ప్ర‌తిప‌క్షాలు, టీవీకే పార్టీకి మ‌ద్ద‌తిచ్చిన మిత్ర‌ప‌క్షాల నుంచి తీవ్ర అభ్యంత‌రాలు వ్య‌క్త‌మ‌య్యాయి. తమిళనాడు రాష్ట్ర గీతం ఎప్పటికీ మొద‌టి స్థానంలోనే ఉండాలని ప్ర‌తిప‌క్ష నేత ఉద‌య‌నిధి స్టాలిన్ కూడా అసెంబ్లీ వేదిక‌గా డిమాండ్ చేశారు. ఈ వివాదాల వేళ రాష్ట్ర గీతానికి విజ‌య్ ప్ర‌భుత్వం తొలి ప్రాధాన్య‌త ఇస్తూ తీర్మానం ప్ర‌వేశ‌పెట్ట‌డం విశేషం.

Also Read..

నా ప్రాణాలు కాపాడిన చేతులే విగతజీవిగా.. ఆనాటి ఘటన తలచుకొని కన్నీరుమున్నీరైన హరీశ్ రావు

అయోధ్య విరాళాల చోరీ.. ప్రధాని నివాసానికి సాధువుల భారీ మార్చ్.. అడ్డుకున్న పోలీసులు

ఎస్‌ఐఆర్‌పై కాంగ్రెస్‌ అనుమానాలు

Advertisement
Advertisement