త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి

Lord Uday Nagaraju | త్రినేత్ర‌.న్యూస్‌: బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రతిష్టత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు శాశ్వత సభ్యుడిగా ఎన్నికైనా లార్డ్ ఉదయ్ నాగరాజుది (Lord Uday Nagaraju) వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాద‌ని, ఇది ఒక పట్టుదల, ప్రపంచ వేదికపై తెలంగాణ (Telangana) ప్రతిభకు దక్కిన గౌరవమ‌ని వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) అన్నారు.

G

Telangana | Published On Aug 12, 2026, 12.06 pm IST

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
Advertisement

Lord Uday Nagaraju | త్రినేత్ర‌.న్యూస్‌: బ్రిటన్ పార్లమెంట్‌లో ప్రతిష్టత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు శాశ్వత సభ్యుడిగా ఎన్నికైనా లార్డ్ ఉదయ్ నాగరాజుది (Lord Uday Nagaraju) వ్యక్తి ఎదుగుదల మాత్రమే కాద‌ని, ఇది ఒక పట్టుదల, ప్రపంచ వేదికపై తెలంగాణ (Telangana) ప్రతిభకు దక్కిన గౌరవమ‌ని తెలంగాణ వికలాంగుల‌కు కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మ‌న్ వాసుదేవరెడ్డి (Vasudeva Reddy) అన్నారు. తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించిందన్నారు. హ‌నుమ‌కొండ‌లో తెలంగాణ వికాస సమితి ఆధ్వర్యంలో లార్డ్ ఉద‌య్‌ నాగ‌రాజును ఘ‌నంగా స‌న్మానించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్సీ దేశ‌ప‌తి శ్రీనివాస్‌, మాజీ ఎంపీ బోయినపల్లి వినోదకుమార్, మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ భాస్కర్, నరేందర్, సతీశ్‌, వాసుదేవ రెడ్డి పాల్గొన్నారు. ఈసంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రత్మక ఘట్ట‌మ‌న్నారు. తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో ఒక స్థానాన్ని సంపాదించిందని చెప్పారు.

వ‌రంగ‌ల్‌తో అనుబంధం..

సిద్ధిపేట జిల్లా శనిగరం గ్రామానికి చెందిన లార్డ్ ఉదయ్ కుమార్ నాగరాజుకు వరంగల్‌ (Warangal) జిల్లాతో విడదీయరాని అనుబంధం ఉంద‌ని తెలిపారు. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం హనుమ‌కొండలోని (Hanumakonda) నక్కలగుట్టలో జరిగింద‌ని వెల్ల‌డించారు. కేవలం 47 ఏండ్ల‌ వయస్సులోనే రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారిలో హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు (House of Lords) నియమితులైన తొలి వ్యక్తిగా ఆయన సాధించిన ఘనత తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా వరంగల్ జిల్లా ప్రజలకు గర్వకారణమ‌ని పేర్కొన్నారు. చదువు, సాంకేతిక రంగంలో అనుభవం, ప్రజా విధానాలపై ఆసక్తి ఇవన్నీ కలసి ప్రజాజీవితం వైపు అడుగులు వేసేలా చేశాయని చెప్పడంలో ఎలాంటి అతియోశక్తి లేద‌న్నారు.

మ‌రింత ఉన్న‌త స్థానాల‌కు..

ఏఐ లో నిష్ణాతులైన ఉదయ్ నాగరాజు సాంకేతికత ద్వారా ప్రజలకు చేసిన సేవకు సరైన గుర్తింపు దక్కింద‌ని చెప్పారు. ఆయ‌న బ్రిటన్ పార్లమెంట్‌లో ( Britain Parliament) ఒక గౌరవనీయ సభ్యులు. కానీ త‌మ‌ దృష్టిలో అంతకంటే ముందు మన తెలంగాణ బిడ్డ, భారతీయుడు. `మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని, మీ విజయం చూసి మన తెలంగాణలోని ప్రతి యువకుడు.. నేను కూడా సాధించగలను అని అనుకునేలా మీ ప్రయాణం ఉండాలి` చెప్పారు. ఎందుకంటే ఒక మనిషి ఎదిగితే అది అతని విజయం.. అతని ఎదుగుదల చూసి మరో వంద మంది ఎదిగితే అదే నిజమైన నాయకత్వమ‌ని తెలిపారు.

Advertisement
Advertisement