E Visa Facility | శ్రీవారి దర్శనం కోసం తిరుమల వచ్చే విదేశీ భక్తులకు గుడ్ న్యూస్
E Visa Facility | కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికోసం తిరుపతి విమానాశ్రయంలోనే (Tirupati Airport) ఈ-వీసా (E Visa Facility) సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది.
E Visa Facility | త్రినేత్ర.న్యూస్: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల (Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం వచ్చే విదేశీ భక్తులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. వారికోసం తిరుపతి విమానాశ్రయంలోనే (Tirupati Airport) ఈ-వీసా (E Visa Facility) సేవలను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం విదేశీ భక్తులు చెన్నై, బెంగళూరు లేదా హైదరాబాద్ చేరుకొని.. అక్కడ ఈ-వీసా ప్రక్రియ పూర్తిచేసుకున్న తర్వాతే తిరుపతి చేరుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వ తాజా నిర్ణయంతో విదేశీ ప్రయాణికుల (Foreign Devotees) తిరుమల ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇకపై ప్రయాణికులు విదేశాల నుంచి నేరుగా తిరుపతి విమానాశ్రయం చేరుకొని ఈ - వీసా ప్రక్రియ ముగించుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి కనీసం పది రోజులు ముందే ఆన్‌లైన్‌లో ప్రయాణికులు ఈ- వీసా అందుకోవాలి.
కాగా, తిరుపతి విమానాశ్రయంలో అంతర్జాతీయ సర్వీసులు లేనప్పటికీ కేంద్ర పౌర విమానయాన శాఖ ముందస్తుగానే ఈ - వీసా కౌంటరు మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే అంతర్జాతీయ సర్వీస్ లు ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. 2007లోనే తిరుపతి విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. దీనికి సంబంధించి 2017లో నోటిఫికేషన్ విడుదల చేసింది.
తాజావార్తలు
- ●N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..
- ●CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
- ●Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి
- ●Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు.. జూలైలో భారీ మార్పులు..
- ●Prajwal Revanna | జైల్లో ఫోన్‌తో అడ్డంగా దొరికిపోయిన మాజీ ఎంపీ
- ●KTR | ఒక్క అనుముల కుటుంబానికే ఎందుకు.. తెలంగాణ యువతకు కూడా ఆ `మ్యాజిక్ ట్రిక్` నేర్పించండి: కేటీఆర్

N Chandrasekaran | టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్ సంచలన నిర్ణయం.. ఇక కొనసాగనని ప్రకటన..

CM Vijay | మహిళా బిల్లుకు ఓకే.. డీలిమిటేషన్‌కు ఒప్పుకునేదే లేదు.. తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం

Lord Uday Nagaraju | తెలంగాణ మట్టిలో మొదలైన ఒక ప్రయాణం.. బ్రిటన్ పార్లమెంట్ చరిత్రలో స్థానం సంపాదించింది: వాసుదేవరెడ్డి

Mutual Funds | మ్యుచువల్ ఫండ్స్‌లో జోరుగా పెట్టుబడులు.. జూలైలో భారీ మార్పులు..






