త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

NEET | నీట్‌ను ర‌ద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన విజ‌య్ స‌ర్కార్‌

NEET | జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష అయిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులోని విజ‌య్ (CM Vijay) స‌ర్కార్ అసెంబ్లీలో (Tamil Nadu Assembly) కీల‌క తీర్మానాన్ని (resolution) ప్ర‌వేశ‌పెట్టింది. ఈ తీర్మానానికి డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మిత్ర‌ప‌క్షాలు మ‌ద్ద‌తు తెలిపాయి. అయితే బీజేపీ మాత్రం ఈ తీర్మానాన్ని వ్య‌తిరేకిస్తూ స‌భ నుంచి వాకౌట్ చేసింది.

D

National | Published On Aug 11, 2026, 2.47 pm IST

NEET | నీట్‌ను ర‌ద్దు చేయాలి.. అసెంబ్లీలో తీర్మానం ప్ర‌వేశ‌పెట్టిన విజ‌య్ స‌ర్కార్‌
Advertisement

NEET | త్రినేత్ర‌.న్యూస్ : జాతీయ స్థాయి వైద్య ప్రవేశ పరీక్ష అయిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET)కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడులోని విజ‌య్ (CM Vijay) స‌ర్కార్ అసెంబ్లీలో (Tamil Nadu Assembly) కీల‌క తీర్మానాన్ని (resolution) ప్ర‌వేశ‌పెట్టింది. నీట్ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేస్తూ ఆరోగ్య‌శాఖ మంత్రి అరుణ్ రాజ్ ఈ తీర్మానాన్ని స‌భ ముందుకు తీసుకెళ్లారు. ఈ తీర్మానానికి డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే మిత్ర‌ప‌క్షాలు మ‌ద్ద‌తు తెలిపాయి. అయితే బీజేపీ మాత్రం ఈ తీర్మానాన్ని వ్య‌తిరేకిస్తూ స‌భ నుంచి వాకౌట్ చేసింది.

ఈ సంద‌ర్భంగా మంత్రి అరుణ్‌రాజ్ మాట్లాడుతూ.. నీట్ సామాజిక న్యాయానికి, సమానత్వానికి, రాష్ట్ర హక్కులకు వ్యతిరేకం అని ఆయన అన్నారు. 12 ఏళ్ల పాఠశాల విద్య కాకుండా.. ఒక్క రోజు నీట్ పరీక్ష విద్యార్థుల ఉన్నత విద్యను నిర్ణయిస్తోందన్నారు. ఈ ప్రవేశ పరీక్షవల్ల విద్యార్థుల దృష్టి కోచింగ్ సెంటర్ల వైపు మళ్లింద‌ని చెప్పారు. ఫీజులు భారీగా వసూలు చేసే కోచింగ్ సెంటర్లు పెరిగిపోయాయ‌న్నారు. దీంతో గ్రామీణ ప్రాంతాల్లోని, సామాజికంగా-ఆర్థికంగా వెనకబడిన విద్యార్థుల అవకాశాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కాగా, నీట్ ప‌రీక్ష‌కు త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం తొలి నుంచీ వ్య‌తిరేకిస్తోన్న విష‌యం తెలిసిందే. ఈ ప‌రీక్ష‌ను ర‌ద్దు చేయాల‌ని గ‌త డీఎంకే ప్ర‌భుత్వం కూడా డిమాండ్ చేసింది. ఈ మేర‌కు అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ప్ర‌వేశ‌పెట్టింది.

Also Read..

రండి.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుప‌రుద్దాం : సీజేపీ పిలుపు

నా ఓటును తొల‌గించారు.. స‌ర్ ప్ర‌క్రియ‌పై ప్రకాష్ రాజ్ అసంతృప్తి

రివ‌ర్స్ ఎటాక్‌.. జార్ఖ్ండ్ నిర‌స‌న‌ల‌పై రాహుల్ స‌మాధానం చెప్పాలి.. ఎన్డీయే ఎంపీల నిర‌స‌న‌

Advertisement
Advertisement