త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CM Vijay | త్రిష‌ను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు.. సీఎం విజ‌య్‌పై దాడికి న‌టి పేరును అస్త్రంగా వాడుకుంటున్న ప్ర‌తిప‌క్షాలు

CM Vijay | ఏఐఏడీఎంకే (AIADMK) నేత ఆర్‌బీ ఉదయకుమార్.. త్రిష పేరును ప్ర‌స్తావిస్తూ సీఎం విజ‌య్ (CM Vijay)పై రాజ‌కీయ దాడికి దిగారు. "ముఖ్య‌మంత్రి విజ‌య్‌కి ఇష్ట‌మైన న‌టి త్రిష (actor Trisha)కు ఎప్పుడు త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తారా అని రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది" అంటూ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు.

D

National | Published On Aug 11, 2026, 4.40 pm IST

CM Vijay | త్రిష‌ను డిప్యూటీ సీఎం ఎప్పుడు చేస్తారు.. సీఎం విజ‌య్‌పై దాడికి న‌టి పేరును అస్త్రంగా వాడుకుంటున్న ప్ర‌తిప‌క్షాలు
Advertisement

CM Vijay | త్రినేత్ర‌.న్యూస్ : త‌మిళ‌నాడు రాజకీయాలు ఆస‌క్తిక‌రంగా మారాయి. ప్ర‌భుత్వంపై దాడికి ప్ర‌తిప‌క్షాలు ప్ర‌ముఖ న‌టి త్రిష‌ను అస్త్రంగా వాడుకుంటున్నాయి. సీఎం విజ‌య్ (CM Vijay)పై విమ‌ర్శ‌లు చేసే క్ర‌మంలో త్రిష పేరును తెర‌పైకి లాగుతున్నాయి. మొన్న‌టికి మొన్న ముఖ్య‌మంత్రి విజ‌య్‌, త్రిష‌ను ఉద్దేశించి ప్ర‌తిప‌క్ష‌నేత ఉద‌య‌నిధి స్టాలిన్ చేసిన వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు పెద్ద ఎత్తున దుమారం రేపిన విష‌యం తెలిసిందే. తాజాగా ఏఐఏడీఎంకే (AIADMK) నేత ఆర్‌బీ ఉదయకుమార్ (RB Udhayakumar).. త్రిష పేరును ప్ర‌స్తావిస్తూ సీఎంపై రాజ‌కీయ దాడికి దిగారు.

న‌టి త్రిష‌ను త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రిగా ఎప్పుడు ప్ర‌క‌టిస్తారంటూ ఉదయకుమార్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ముఖ్య‌మంత్రి విజ‌య్‌కి ఇష్ట‌మైన న‌టి త్రిష‌కు ఎప్పుడు త‌మిళ‌నాడు ఉప ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇస్తారా అని రాష్ట్రం మొత్తం ఎదురుచూస్తోంది" అంటూ సంచ‌ల‌న‌ వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చనీయాంశంగా మారాయి. తూత్తుకుడిలో అన్నాడీఎంకే కార్య‌క‌ర్త‌ల స‌మ‌క్షంలో ఉద‌య‌కుమార్ ఈ వ్యాఖ్య‌లు చేశారు. కర్ణాటక నుండి కావేరీ జ‌లాల‌ను విడుదల చేయించడంలో సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ఆయన ఈ విమర్శలు గుప్పించారు.

కావేరీ జ‌లాల వివాదం త‌మిళ‌నాడులో హాట్ టాపిక్‌గా మారిన విష‌యం తెలిసిందే. ఈ అంశంపై (Cauvery protest) ఇటీవ‌లే తంజావూరులో జ‌రిగిన నిర‌స‌న‌ ర్యాలీలో ఉద‌య‌నిధి స్టాలిన్ పాల్గొని మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి విజ‌య్‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల ప్ర‌యోజ‌నాల‌ను కాపాడ‌టంలో టీవీకే ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తోందంటూ మండిప‌డ్డారు. ఆ స‌మ‌యంలో న‌టి త్రిష (actor Trisha)ను ఉద్దేశించి ద్వంద్వార్థం వ‌చ్చేలా వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డీఎంకే కార్య‌క‌ర్త‌లు త్రిష ప్ర‌స్తావ‌న తెచ్చారు. త్రిష‌, త్రిష అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వారిని నిలువ‌రించాల్సిన ఉద‌య‌నిధి న‌వ్వుతూ త‌న ప్రసంగాన్ని కొన‌సాగించారు. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై టీవీకే నేత‌లు ఫిర్యాదు మేర‌కు ఉద‌య‌నిధిని పోలీసులు అరెస్ట్ కూడా చేసిన విష‌యం తెలిసిందే. ఆ త‌ర్వాత విడుద‌ల చేశారు.

Also Read..

ట్రిబ్యున‌ల్స్ రిఫార్మ్స్ బిల్లు సంస్క‌ర‌ణ‌లు ఓకే.. కానీ స‌రిగా అమ‌లు చేస్తేనే ఫ‌లితం ఉంటుంది

ఐపీఎల్ క్రికెటర్‌ అభిషేక్‌ పోరెల్ అరెస్ట్‌.. పెళ్లి చేసుకుంటానని అత్యాచారం చేశాడ‌ని ఆరోప‌ణ‌లు..

కేర‌ళ పేరు మార్పు బిల్లుకు లోక్‌స‌భ ఆమోదం

Advertisement
Advertisement