CM Mamata Banerjee | నామినేషన్ దాఖలు చేసిన మమతా బెనర్జీ.. సువేందు అధికారిని దీదీ ఓడించనుందా..?
CM Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) నామినేషన్ దాఖలు చేశారు.
CM Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (CM Mamata Banerjee) నామినేషన్ దాఖలు చేశారు. కోల్‌కతాలోని భవానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గం (Bhabanipur seat) నుంచి దీదీ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ స్థానానికి ఇవాళ నామినేషన్ వేశారు. ఈ స్థానం నుంచి బీజేపీ (BJP) సీనియర్ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) పోటీకి దిగిన విషయం తెలిసిందే. గత వారం ఆయన ఈ స్థానానికి నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఈ ఎన్నికల్లో "బై బై మమతా" నినాదంతో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది.
కాగా, 2021 ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి మమత పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పుడు కూడా సువేందు అధికారినే మమత ఢీ కొన్నారు. అయితే, ఆ ఎన్నికల్లో 1,956 ఓట్ల తేడాతో దీదీపై సువేందు అధికారి విజయం సాధించారు. ఇక ఆ ఓటమి తర్వాత భవానీపూర్ ఉప ఎన్నికల్లో మమతా బెనర్జీ పోటీ చేసి గెలుపొందారు. అప్పుడు భవానీపూర్ ఎమ్మెల్యే శోభందేబ్ చటోపాధ్యాయ రాజీనామా చేయడంతో దీదీ అక్కడి నుంచి పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి సువేందుకు అధికారిపై పోటీకి దీదీ సిద్ధమవడం ఆసక్తికరంగా మారింది. కాగా, 294 మంది సభ్యులున్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, 29 తేదీల్లో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడించనున్నారు.
Also Read..
మరోవివాదంలో డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. హిందూ సంఘాలు ఫైర్
గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మీడియా షేరింగ్ ఈజీ..
ఐఆర్ఎఫ్‌సీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు.. అర్హులు ఎవరంటే?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

BJP | నెక్స్ట్ తెలంగాణ.. 2028/29 ఎన్నికలపై గురి పెట్టిన బీజేపీ
సెప్టెంబర్ 23, 2026

ఫార్ములా పాతదే.. సౌత్ లెక్క కొత్తది! అరుణకు తమిళనాడు.. కాసంకు కర్ణాటక
సెప్టెంబర్ 23, 2026

BJP State In-Charges 2026 | బీజేపీ భారీ ప్రక్షాళన: తెలంగాణ ఇన్చార్జ్గా సునీల్ బన్సల్.. తమిళనాడు సహ ఇన్చార్జ్గా డీకే అరుణ
సెప్టెంబర్ 23, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



