IRFC | ఐఆర్ఎఫ్‌సీలో అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు..
IRFC | భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
IRFC | త్రినేత్ర.న్యూస్: భారతీయ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (IRFC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బీకాం, సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్) పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. మే 1లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్థారు. ఎంపికైనవారు న్యూఢిల్లీలో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు- 23
ఇందులో అసిస్టెంట్ (ఎన్ఈ-5)-16, అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)- 7 చొప్పున ఉన్నాయి.
అర్హతలు
అసిస్టెంట్ పోస్టుకు.. 60 శాతం మార్కులతో బీకామ్ పూర్తి చేయాలి. అలాగే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా లేదా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా నుంచి ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. ఎంపికైన తర్వాత నెలకు రూ.21,000 - 74,000 వరకు జీతం తీసుకోవచ్చు.
అసిస్టెంట్ మేనేజర్.. 60 శాతం మార్కులతో బీకామ్, సీఏ లేదా సీఎంఏ లేదా ఎంబీఏ (ఫైనాన్స్) లేదా పీజీ డిప్లొమా ఇన్ మేనేట్‌మెంట్ (ఫైనాన్స్)లో ఏదో ఒకటి చేసి ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.40,000 - రూ.1,40,000 వరకు వేతనం అందుకోవచ్చు.
వయస్సు: 18 నుంచి 30 ఏండ్ల మధ్య ఉండాలి. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం..
కంప్యూటర్ బేస్డ్ టెస్టు, ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ టెస్టులతో ఎంపిక చేస్తారు. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నకు ఒక మార్కు కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కుకి తగ్గిస్తారు. ప్రశ్నాపత్రంలో మొత్తం రెండు భాగాలు ఉంటాయి.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో
అప్లికేషన్ ఫీజు: రూ.500, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్, మాజీ సైనికోద్యోగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 1
సీబీటీ: జూన్‌లో
వెబ్సైట్: https://irfc.co.in
పూర్తి వివరాలకు..
సంబంధిత వార్తలు

CPRI Recruitment | సెంట్రల్ పవర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 112 ఉద్యోగాలు.. ఇంజినీరింగ్, డిప్లొమా అభ్యర్థులు అర్హులు
సెప్టెంబర్ 16, 2026

NICL Assistant Recruitment | నేషనల్ ఇన్సూరెన్స్‌లో 500 అసిస్టెంట్ ఉద్యోగాలు.. రేపటి నుంచి దరఖాస్తులు..
జులై 17, 2026

Revanth Reddy | ఎన్వోసీ ఇవ్వండి.. మెట్రో ఫేజ్-2 కట్టుకుంటాం
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



