Google Maps | గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్లు.. మీడియా షేరింగ్ ఈజీ..
Google Maps | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త అప్‌డేట్స్‌ను ప్రవేశపెట్టింది. యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు మూడు కొత్త అప్ డేట్స్‌ను అందించింది. వీటి సహాయంతో యూజర్లు ఫొటోలు, వీడియోలు, రివ్యూలను సులభంగా షేర్ చేసుకోవచ్చు.
Technology | Published On Apr 8, 2026, 12.38 pm IST
Google Maps | టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ తన గూగుల్ మ్యాప్స్ ప్లాట్‌ఫామ్‌లో సరికొత్త అప్‌డేట్స్‌ను ప్రవేశపెట్టింది. యూజర్ల అనుభవాన్ని మరింత మెరుగుపరిచేందుకు మూడు కొత్త అప్ డేట్స్‌ను అందించింది. వీటి సహాయంతో యూజర్లు ఫొటోలు, వీడియోలు, రివ్యూలను సులభంగా షేర్ చేసుకోవచ్చు. ప్లాట్‌ఫామ్‌లో కొనసాగించే కార్యకలాపాలను ట్రాక్ చేసే సదుపాయం కల్పించారు. ఈ అప్ డేట్స్ వల్ల మీడియా ఫైల్స్‌ను మరింత వేగంగా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ జెమిని ఏఐ ఆధారిత క్యాప్షన్ సూచనలు మ్యాప్స్‌లో కనిపిస్తాయి. యూజర్ల కంట్రిబ్యూషన్‌లను స్పష్టంగా చూపించే విధానాలకు ప్రాధాన్యత ఇచ్చారు.
మీడియా ఫైల్స్‌ను వేగంగా యాక్సెస్..
మొదటి అప్‌డేట్ విషయానికి వస్తే.. ఫోటోలు, వీడియోలను త్వరగా యాక్సెస్ చేసే సదుపాయాన్ని అందించారు. యూజర్లు తమ డివైస్‌లలో మీడియా యాక్సెస్‌ను అనుమతించినప్పుడు తాజా ఫోటోలు, వీడియోలు నేరుగా కంట్రిబ్యూట్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. దీంతో గ్యాలరీలో వెతకకుండా, ఇటీవల తీసిన ఫోటోలు లేదా వీడియోలను సులభంగా ఎంపిక చేసి అప్‌లోడ్ చేయవచ్చు. ఈ ఫీచర్ ప్లాట్‌ఫామ్‌లో విజువల్ కంటెంట్‌ను షేర్ చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయడానికి ఉపయోగపడుతుంది.
జెమిని ఆధారిత క్యాప్షన్స్..
రెండవ అప్‌డేట్‌గా.. జెమిని ఆధారిత క్యాప్షన్ సూచనలు ప్రవేశపెట్టారు. యూజర్లు ఫోటోలను ఎంపిక చేసిన తర్వాత, ఈ ఏఐ సిస్టమ్ ఆ చిత్రాలను విశ్లేషించి తాత్కాలిక క్యాప్షన్‌లను రూపొందిస్తుంది. యూజర్లు వాటిని ఎడిట్ చేయవచ్చు లేదా పూర్తిగా తొలగించవచ్చు. ఈ ఫీచర్ ద్వారా ఫోటోలకు తగిన వివరణను త్వరగా యాడ్ చేయవచ్చు. అయితే తుది క్యాప్షన్‌పై పూర్తి నియంత్రణ యూజర్లకే ఉంటుంది.
కంట్రిబ్యూటర్ల కోసం..
మూడవ అప్‌డేట్‌గా.. యూజర్ల కంట్రిబ్యూషన్‌లను ట్రాక్ చేసే విధానం, ప్రొఫైల్ విజిబిలిటీని మెరుగుపరిచే ప్రక్రియను మార్చారు. మొత్తం పాయింట్లు ఇప్పుడు నేరుగా కంట్రిబ్యూట్ ట్యాబ్‌లో కనిపిస్తాయి. అలాగే లోకల్ గైడ్ స్థాయిలు ప్రొఫైల్ పేజీల్లో మరింత స్పష్టంగా దర్శనమిస్తాయి. అలాగే అచీవ్‌మెంట్ బ్యాడ్జ్‌లను మళ్లీ డిజైన్ చేసి తరచూ రివ్యూలు చేసే వారు లేదా ఫోటోగ్రాఫర్లు వంటి వ్యక్తులను స్పష్టంగా సూచించేలా రూపొందించారు. కాగా గోల్డ్ కలర్ ప్రొఫైల్‌లు ఉన్నత స్థాయి కంట్రిబ్యూటర్లను హైలైట్ చేస్తాయి. దీంతో రివ్యూలను చూస్తున్నప్పుడు విశ్వసనీయ యూజర్లను సులభంగా గుర్తించవచ్చు.
ఏయే ప్లాట్‌ఫామ్‌లపై ఏయే అప్‌డేట్స్..?
ఇక గూగుల్ మ్యాప్స్ లో కొత్తగా వచ్చిన ఈ అప్‌డేట్స్‌లో ఫొటో, వీడియో ఫీచర్లు ప్రస్తుతం ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పై గూగుల్ యూజర్లకు అందుబాటులో ఉన్నాయి. యూజర్లు తమ గూగుల్ మ్యాప్స్ యాప్‌ను కొత్త వెర్షన్‌కు అప్ డేట్ చేసుకుంటే ఈ ఫీచర్లను పొందవచ్చు. ఇక ఫొటో, వీడియో ఫీచర్లను త్వరలోనే ఐఓఎస్ డివైస్‌లకు కూడా అందించనున్నారు. అలాగే జెమిని ఆధారిత క్యాప్షన్ సూచనలను ప్రస్తుతం అమెరికాలోని ఐఓఎస్ యూజర్లకు ఇంగ్లిష్‌లో అందిస్తున్నారు. త్వరలో దీన్ని ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాల యూజర్లకు కూడా అందించనున్నారు. అలాగే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్‌పైనా ఈ సేవ లభ్యం కానుంది. కాగా కంట్రిబ్యూషన్ ట్రాకింగ్‌కు సంబంధించిన అప్ డేట్స్, పాయింట్లు, బ్యాడ్జిలు, లోకల్ గైడ్ స్థాయిలు, గోల్డ్ ప్రొఫైల్స్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, వెబ్ వెర్షన్‌లలో ప్రపంచ వ్యాప్తంగా దశలవారీగా అందుబాటులోకి రానున్నాయి.
సంబంధిత వార్తలు

Adobe Premiere | ఆండ్రాయిడ్ ఫోన్లకు అడోబ్ ప్రీమియర్.. ఇక ఫోన్లోనే 4కె వీడియో ఎడిటింగ్..
సెప్టెంబర్ 23, 2026

Googleboook | కొత్త ల్యాప్‌టాప్‌లను లాంచ్ చేసిన గూగుల్.. ఏఐ ఫీచర్లతో అదిరిపోయాయి..
సెప్టెంబర్ 22, 2026

Android | పాస్‌వర్డ్‌ల బదిలీ ఇక మరింత ఈజీ.. ఆండ్రాయిడ్‌లో కొత్త ఫీచర్..
సెప్టెంబర్ 12, 2026
తాజావార్తలు
- ●Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్
- ●Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం
- ●Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా
- ●Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
- ●Adilabad | రిమ్స్ అగ్ని ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- ●The Paradise | ‘ది ప్యారడైజ్’కు అదిరిపోయే అడ్వాన్స్ బుకింగ్స్.. రిలీజ్‌కు ముందే రూ.50 కోట్ల దిశగా!

Ayodhya | రామ మందిర కానుకల చోరీ కేసులో 36,039 పేజీలతో చార్జ్‌షీట్

Seetharama Lift | సీతారామ మారేళ్లపాడు ఎత్తిపోతలు ప్రారంభం

Ganesh Immersion | గణేశ్ నిమజ్జనంలో ప్రమాదకర విన్యాసాలు.. ఇన్‌స్టాగ్రామ్‌పై సైబర్ క్రైమ్ పోలీసుల నిఘా

Aishwarya Lekshmi | ఆదాయం వద్దు.. ప్రశాంతతే ముద్దు అంటున్న ఐశ్వర్య లక్ష్మి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?



