Sonam Wangchuk | లద్దాఖ్ ఉద్యమకారుడు వాంగ్‌చుక్‌ను విడుదల చేయనున్న కేంద్రం
Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh) ఉద్యమకారుడు, వాతావరణ హక్కుల కార్యకర్త (Climate Activist) సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)కు భారీ ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం (National Security Act) కింద అరెస్టై గత ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్‌ను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ( Ministry of Home Affairs) వెల్లడించింది.
Sonam Wangchuk | లద్దాఖ్ (Ladakh) ఉద్యమకారుడు, వాతావరణ హక్కుల కార్యకర్త (Climate Activist) సోనమ్ వాంగ్‌చుక్ (Sonam Wangchuk)కు భారీ ఊరట లభించింది. జాతీయ భద్రతా చట్టం (National Security Act) కింద అరెస్టై గత ఆరు నెలలుగా నిర్బంధంలో ఉన్న వాంగ్‌చుక్‌ను విడుదల చేయనున్నట్లు కేంద్ర హోంశాఖ ( Ministry of Home Affairs) వెల్లడించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. లద్దాఖ్‌లో శాంతి, స్థిరత్వం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపింది. అన్ని వర్గాలతో నిర్మాణాత్మక చర్చలు నిర్వహించే ఉద్దేశంతో ఉన్నట్లు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో వాంగ్‌చుక్‌పై ఉన్న నిర్బంధాన్ని తక్షణమే ఎత్తివేయనున్నట్లు వెల్లడించింది.
రాష్ట్రహోదా కల్పించాలని (Ladakh Statehood Clashes) డిమాండ్ చేస్తూ గతేడాది సెప్టెంబర్‌లో లద్దాఖ్‌లో ఆందోళనలు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఘర్షణల్లో నలుగురు మరణించగా,100 మందికిపైగా గాయపడ్డారు. లద్దాఖ్‌లో హింసను రెచ్చగొట్టినట్టు సోనమ్ వాంగ్‌చుక్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆయన పిలుపుతోనే ఈ ఆందోళనలు జరిగినట్లు అప్పట్లో హోం శాఖ కూడా తెలిపింది. దీంతో జాతీయ భద్రతా చట్టం కింద వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. లేహ్ జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల ప్రకారం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు దాదాపు ఆరు నెలల నిర్బంధం తర్వాత వాంగ్‌చుక్‌ను విడుదల చేసేందుకు కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకుంది.
Also Read..
ఫలించిన దౌత్యం.. హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
యూ-వీసా కోసం చోరీ డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు
- ●Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి
- ●DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ
- ●Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్
- ●Revanth Reddy | లష్కర్ బోనాలు.. మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్, టీపీసీసీ చీఫ్, మంత్రులు
- ●CWG 2026 | భారత్ మ్యాప్‌లో కనిపించని ఈశాన్య రాష్ట్రాలు.. అభ్యంతరం తెలిపిన లవ్లీనా

Komatireddy Rajagopal Reddy | 18 లక్షలు సాయమందించి.. 23 ఏళ్ల యువకుడి ప్రాణాలు నిలబెట్టాడు

Komatireddy Venkatreddy | ఆ హామీ ఇస్తేనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా : మంత్రి కోమటిరెడ్డి

DK Aruna | రేవంత్ అసమర్థుడు.. రాజీనామా చేయాల్సిందే : ఎంపీ డీకే అరుణ

Allu Arjun | బన్నీ , లోకేష్ మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్ - స్నేహితులను నిర్మాతలుగా పరిచయం చేస్తున్న ఐకాన్ స్టార్






