త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IAF | లడఖ్‌లో చరిత్ర సృష్టించిన ఐఏఎఫ్‌..

IAF | భారత వైమానిక దళం (IAF) మరో కీలక ఘనత సాధించింది. రష్యా తయారీ భారీ రవాణా విమానం ఐఎల్‌-76ఎండీ లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌బేస్‌పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా విమానం ఇంత ఎత్తులో ల్యాండ్‌ కావడం ఇదే తొలిసారి అని వైమానిక దళం వెల్లడించింది.

P

National | Published On Nov 7, 2026, 3.38 pm IST

IAF | లడఖ్‌లో చరిత్ర సృష్టించిన ఐఏఎఫ్‌..
Advertisement
  • అత్యంత ఎత్తులో ఐఎల్‌-76ఎండీ విమానం ల్యాండింగ్‌

IAF | భారత వైమానిక దళం (IAF) మరో కీలక ఘనత సాధించింది. రష్యా తయారీ భారీ రవాణా విమానం ఐఎల్‌-76ఎండీ లడఖ్‌లోని న్యోమా ఎయిర్‌బేస్‌పై విజయవంతంగా ల్యాండ్ అయ్యింది. ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా విమానం ఇంత ఎత్తులో ల్యాండ్‌ కావడం ఇదే తొలిసారి అని వైమానిక దళం వెల్లడించింది. ఈ ఘనతతో భారత రక్షణ రంగంలో మరో మైలురాయిగా నిలిచింది. సముద్ర మట్టానికి సుమారు 13 వేల అడుగుల ఎత్తులో న్యోమా ఎయిర్‌బేస్‌ ఉంది. చైనాతో వాస్తవాధీన రేఖ (LAC)కి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఈ స్థావరం ఉండటం వ్యూహాత్మకంగా ఎంతో కీలకం. ఇలాంటి అత్యంత ఎత్తైన ప్రాంతంలో భారీ రవాణా విమానాన్ని సురక్షితంగా దించడం భారత వైమానిక దళం సామర్థ్యానికి నిదర్శనంగా నిలిచింది.

వ్యూహాత్య‌క వైమానిక ర‌వాణా సామ‌ర్థ్యం బ‌లోపేతం

ఈ చారిత్రక విజయంపై ఐఏఎఫ్‌ సోషల్‌ మీడియా వేదికగా స్పందించింది. 'ఐఏఎఫ్‌కు చెందిన ఐఎల్‌-76ఎండీ విమానం న్యోమాలో విజయవంతంగా ల్యాండై చరిత్ర సృష్టించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ విమానం చేసిన అత్యంత ఎత్తైన ల్యాండింగ్‌ ఇదే' అని పేర్కొంది. విమానం అత్యుత్తమ సామర్థ్యాలతోపాటు సిబ్బంది అసాధారణ నైపుణ్యం, కచ్చితత్వం, వృత్తి నైపుణ్యానికి ఈ ఘనత నిదర్శనమని అభివర్ణించింది. దేశ వ్యూహాత్మక వైమానిక రవాణా సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే కీలక పరిణామమని తెలిపింది.

భారీ రవాణా విమానం.. ఎన్నో ప్రత్యేకతలు

ఐఎల్‌-76ఎండీ నాలుగు ఇంజిన్లతో పనిచేసే భారీ వ్యూహాత్మక రవాణా విమానం. సోవియట్‌ యూనియన్‌లో రూపొందించిన ఈ విమానం సుమారు 40 నుంచి 50 టన్నుల వరకు సరుకులను మోసుకెళ్లగలదు. యుద్ధ ట్యాంకులు, ఫిరంగులు, సాయుధ వాహనాలతోపాటు పూర్తి స్థాయి తాత్కాలిక వైద్యశాలలను సైతం తరలించే సామర్థ్యం దీనికి ఉంది. భారీ స్థాయిలో సైనిక, రక్షణ సామగ్రిని వేగంగా తరలించేందుకు ఈ విమానాలను వినియోగిస్తారు. కఠినమైన భౌగోళిక పరిస్థితులు, అత్యంత ఎత్తైన ప్రాంతాల్లోనూ విమాన కార్యకలాపాలు నిర్వహించగల సామర్థ్యం భారత వైమానిక దళానికి కీలక బలంగా మారనుంది. ముఖ్యంగా చైనా సరిహద్దుకు సమీపంలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో సైనిక బలగాలు, ఆయుధ సామగ్రి, ఇతర అవసరాలను వేగంగా చేరవేసేందుకు న్యోమా ఎయిర్‌బేస్‌ మరింత ఉపయోగపడనుంది.

Advertisement
Advertisement