India Flagged LPG Tankers | ఫలించిన దౌత్యం.. హర్మూజ్‌ను దాటిన రెండు భారత ఎల్పీజీ నౌకలు
India Flagged LPG Tankers | పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్‌కు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లు (India Flagged LPG Tankers) హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి.
India Flagged LPG Tankers | పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత్‌కు చెందిన రెండు ఎల్పీజీ ట్యాంకర్లు (India Flagged LPG Tankers) హర్మూజ్ జలసంధిని సురక్షితంగా దాటాయి. 'శివాలిక్' (Shivalik), 'నందా దేవి' (Nanda Devi) అనే ఈ రెండు నౌకలు ప్రస్తుతం సురక్షిత జలాల్లోకి ప్రవేశించాయని.. అవి భారత్‌వైపు వస్తున్నట్లు అధికారులు తాజాగా తెలిపారు. గత కొన్ని రోజులుగా భారత్-ఇరాన్ మధ్య జరిగిన దౌత్య చర్చల ఫలితంగానే ఈ రెండు నౌకల ప్రయాణం సాధ్యమైందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన సంక్షోభం తలెత్తింది. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) మూసివేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ మార్గం గుండా ప్రయాణించే చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వీటిలో 28 భారతీయ జెండా ఉన్న నౌకలు కూడా ఉన్నాయి. దీంతో ముడి చమురు ధర భారీగా పెరిగింది. అంతేకాదు మన దేశంలో ఎల్పీజీ సంక్షోభం తలెత్తింది. ఈ పరిస్థితులను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇరాన్‌తో విస్తృతంగా చర్చలు జరిపింది.
భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ (S Jaishankar).. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి (Abbas Araghchi)తో ఫిబ్రవరి 28, మార్చి 5, మార్చి 10, మార్చి 12 తేదీల్లో నాలుగు దఫాలుగా చర్చలు జరిపారు. ఇక ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సైతం స్వయంగా ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్‌తో చర్చలు జరిపారు. ఈ దౌత్య చర్చలు ఫలించాయి. కీలకమైన హర్మూజ్ జలసంధిలో భారత నౌకలకు సురక్షిత మార్గం కల్పిస్తామని ఇరాన్ హామీ ఇచ్చింది. ఈ హామీని టెహ్రాన్ ఇప్పుడు నిలబెట్టుకుంది.
షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SCI)కి చెందిన భారతీయ జెండాలతో ఉన్న రెండు ఎల్పీజీ (LPG) ట్యాంకర్లు సురక్షితంగా హర్మూజ్‌ను దాటాయి. శివాలిక్ నౌక సుమారు 40,000 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తుండగా.. నందా దేవి కూడా భారీ మొత్తంలో సరుకును మోసుకొస్తున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఒమన్ నుంచి ఆఫ్రికాకు గ్యాసోలిన్‌ను తీసుకెళ్తున్న మరో భారతీయ చమురు ట్యాంకర్ జగ్ ప్రకాష్ కూడా హర్మూజ్ జలసంధికి తూర్పు వైపు నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించిందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ కుమార్ సిన్హా తెలిపారు.

Also Read..
యూ-వీసా కోసం చోరీ డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్
దాడులను పెంచిన ఇరాన్.. బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై డ్రోన్ అటాక్
సంబంధిత వార్తలు

DGMA | హర్మూజ్ గుండా వెళ్లే నౌకల్లో భారతీయ నావికులను నియమించొద్దు.. షిప్పింగ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
జులై 16, 2026

Indian Seafarers | పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తతలు.. భారతీయ నావికుల భద్రతకు కేంద్రం కీలక నిర్ణయం
జులై 15, 2026

commercial shipping | వాణిజ్య నౌకలపై దాడులను తక్షణమే ఆపండి.. ఇరాన్ రాయబారికి భారత్ సమన్లు
జులై 14, 2026
తాజావార్తలు
- ●Religious clashes in Nepal | నేపాల్‌లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి
- ●Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
- ●KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్
- ●BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
- ●PM Modi | డ్రగ్స్‌కు దూరంగా ఉండండి..
- ●Vaishnavi Chaitanya | బోనమెత్తిన బేబీ హీరోయిన్ - ఉజ్జయినీ మహాంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు

Religious clashes in Nepal | నేపాల్‌లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..

KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్

BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి



