China Ladakh Names Row | లడఖ్‌లోని 28 కీలక ప్రాంతాలకు భారత్ పేర్లు: తట్టుకోలేక విషం కక్కిన చైనా
లడఖ్‌లోని 28 కీలక వ్యూహాత్మక ప్రాంతాలకు అధికారిక పేర్లు ఖరారు చేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై చైనా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
International | Published On Oct 13, 2026, 6.07 pm IST
సంక్షిప్త సారాంశం
లడఖ్‌లోని ఎల్‌ఏసీ వెంబడి ఉన్న గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ సహా 28 వ్యూహాత్మక ప్రాంతాలకు భారత్ ప్రామాణిక పేర్లను నోటిఫై చేసింది. లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని తాము ఎన్నడూ గుర్తించలేదని, భారత్ చర్య చట్టవిరుద్ధమని చైనా విదేశాంగ శాఖ స్పందించింది. పశ్చిమ సెక్టార్‌లోని ఆ ప్రాంతాలు తమవేనంటూ చైనా యథావిధిగా పాత వాదనను తెరపైకి తెచ్చింది. అధికారిక మ్యాపింగ్‌ను మరింత సులభతరం చేసేందుకు, సరిహద్దు ప్రాంతాలపై స్పష్టత కోసం కేంద్ర హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.
- ఆ భూభాగం మాదేనంటూ డ్రాగన్ గగ్గోలు
China Ladakh Names Row | త్రినేత్ర న్యూస్ : వాస్తవాధీన రేఖ (LAC) వెంబడి లడఖ్‌లోని 28 కీలక వ్యూహాత్మక ప్రాంతాలు, భౌగోళిక ప్రాంతాలకు ప్రామాణిక పేర్లను ప్రకటిస్తూ భారతదేశం తీసుకున్న చారిత్రక నిర్ణయంపై చైనా తీవ్ర అక్కసు వెళ్లగక్కింది. ఆ ప్రాంతాలు తమవేనంటూ డ్రాగన్ దేశం యథావిధిగా అర్థంలేని వాదనను ముందుకు తెచ్చింది. మంగళవారం బీజింగ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్ మాట్లాడుతూ.. భారత్ నిర్ణయాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు ప్రకటించారు.
లడఖ్‌ను మేం గుర్తించం: చైనా వ్యాఖ్యలు
"భారత్ ఏకపక్షంగా, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన 'లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని' చైనా ఎన్నడూ గుర్తించలేదు" అని మావో నింగ్ అన్నారు. భారత్ చేపట్టిన ఈ నామకరణ ప్రక్రియ చెల్లదని, ఇది చట్టవిరుద్ధమని వ్యాఖ్యానించారు. భారత్–చైనా సరిహద్దులోని పశ్చిమ సెక్టార్ పరిధిలోని ప్రాంతాలు చైనాకు చెందినవనే వాస్తవాన్ని భారత్ నిర్ణయం మార్చలేదని ఆమె పేర్కొన్నారు.
భారత్ నిర్ణయం వెనుక కారణమేంటి?
అక్టోబర్ 2న కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, లడఖ్ స్థానిక యంత్రాంగంతో సంప్రదించి అధికారిక భారత మ్యాప్‌లో 28 కీలక పాయింట్లకు పేర్లను ఖరారు చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో అధికారిక కార్టోగ్రఫీ (మ్యాపింగ్)ను సరిదిద్దడం, సైనిక గస్తీలో కచ్చితమైన ప్రాంతాలను సులువుగా గుర్తించడం, సున్నితమైన సరిహద్దు ప్రాంతాలపై ప్రజల్లో స్పష్టమైన అవగాహన కల్పించడమే ఈ నిర్ణయం ముఖ్య ఉద్దేశం.
2020 ప్రతిష్టంభన ప్రాంతాలు సైతం జాబితాలో
ఈ 28 ప్రాంతాల్లో 2020 సరిహద్దు ప్రతిష్టంభన సమయంలో కీలకంగా మారిన గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ వంటి కీలక ఘర్షణ పాయింట్లు ఉన్నాయి. భారత్ పెట్రోలింగ్‌కు ఇవి వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యమైనవి.
వీటితో పాటు అలిషా గిరి (ఎత్తైన శిఖరం), బ్రాంగ్సా, చాప్‌చింగల్ పాస్, కనిష్క పీక్, కరుణ్ పీర్ పర్వతం, కుక్సెల్, మార్తాండ్ గిరి, పర్పీక్ గ్లేసియర్, స్కమ్రీ గ్లేసియర్, షచ్మిరిక్ పాస్, ష్కోర్గా వ్యాలీ, జోరావర్ పీక్, దేహ్రా కంపాస్, డ్రాక్ కర్పోలకు భారత్ పేర్లను ఖరారు చేసింది. అంతేకాకుండా జోల్మోరి, కుమారాయణ పాయింట్, పాంగ్లంగ్, రిన్‌చెన్ జాంగ్పో, శాక్యశ్రీ గిరి, గురు రింపోచే, శమల్ లుంగ్పా, యాంగ్పా నది, మార్పా లోట్సావా రి, మిలారేపా కాంగ్రి, శివ రి, మహేశ్వర రి వంటి పేర్లను కూడా అధికారిక జాబితాలో చేర్చింది.
తాజావార్తలు
- ●Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి భరోసా!
- ●Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి - జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం
- ●Sridhar Babu | చినగవు, తడవవు.. ఇక మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త పేపర్
- ●NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష
- ●India Inflation | ద్రవ్యోల్బణం 23 నెలల గరిష్ఠానికి.. భారీగా పెరగనున్న వడ్డీ రేట్లు..?
- ●Aishwarya | నడుచుకుంటూ హాస్పిటల్‌కు వెళ్లిన అమ్మాయి.. చనిపోయింది

Sanjay Jaju | ఎల్‌నినో ఎఫెక్ట్.. హైదరాబాద్‌కు నీటి భరోసా!

Sai Pallavi | రామాయణ రిలీజ్ ముంగిట తెలుగు టాక్ షోకు గెస్ట్‌గా సాయిపల్లవి - జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2 ప్రారంభం

Sridhar Babu | చినగవు, తడవవు.. ఇక మీ సేవ సర్టిఫికెట్లకు కొత్త పేపర్

NMMS | నవంబర్ 1న ఎన్ఎంఎంఎస్ స్కాలర్షిప్ పరీక్ష






