Laptops | భారీగా పెరగనున్న ల్యాప్ టాప్‌ల ధరలు.. కారణాలేంటి..?
Laptops | రానున్న రోజుల్లో ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన కంపోనెంట్‌ల ఖర్చులు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా తయారీదారులపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ర్యామ్, జీపీయూ వంటి కీలక భాగాలు ధరలు పెరగడం వల్ల ల్యాప్ టాప్‌ల ధరలు రానున్న రోజుల్లో 35 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
Laptops | రానున్న రోజుల్లో ల్యాప్‌టాప్‌ల ధరలు భారీగా పెరగనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమైన కంపోనెంట్‌ల ఖర్చులు పెరగడంతో ప్రపంచ వ్యాప్తంగా తయారీదారులపై ఒత్తిడి పెరుగుతోంది. ముఖ్యంగా ర్యామ్, జీపీయూ వంటి కీలక భాగాలు ధరలు పెరగడం వల్ల ల్యాప్ టాప్‌ల ధరలు రానున్న రోజుల్లో 35 శాతం మేర పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు మనీ కంట్రోల్ తన నివేదికలో పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న ఏఐ బూమ్ కారణంగా టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున డేటా సెంటర్లను ఏర్పాటు చేస్తున్నాయి. దీంతో ఆయా భాగాలకు డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలోనే దాని ప్రభావం ల్యాప్ టాప్‌లపై కూడా పడుతుందని అంటున్నారు.
20 నుంచి 35 శాతం మేర పెరిగే చాన్స్..
ల్యాప్ టాప్ ధరలు సెగ్మెంట్, కాన్ఫిగరేషన్‌ను బట్టి 20 నుంచి 35 శాతం మేర పెరిగే అవకాశం ఉందని మనీ కంట్రోల్ తన నివేదికలో తెలియజేసింది. ఎక్కువ ర్యామ్ లేదా హైఎండ్ జీపీయూ ఉన్న ల్యాప్ టాప్ మోడల్స్‌పై ఈ ప్రభావం అధికంగా ఉంటుంది. ముఖ్యంగా భారత్ వంటి దేశాలకు చెందిన మార్కెట్లలో హై ఎండ్ ల్యాప్ టాప్‌ల వినియోగం అధికంగా ఉంటుంది కనుక భారత యూజర్లపై ఈ ప్రభావం పడుతుందని అంటున్నారు. అయితే ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫాక్చరర్లు (OEM) కొంత వరకు ధరల పెరుగుదలను తాము భరించే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. కానీ కంపోనెంట్‌ల ధరలపై ఒత్తిడి కొనసాగితే అన్ని ల్యాప్ టాప్ విభాగాల్లో ధరలను కచ్చితంగా పెంచాల్సి వస్తుంది. ఇది అంతిమంగా వినియోగదారులపైనే భారం మోపుతుంది.
హైఎండ్ డివైస్‌లు మరింత ప్రియం..
ప్రత్యేకంగా గేమింగ్ ల్యాప్ టాప్‌లు లేదా హై ఎండ్ పీసీల ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. వీటిల్లో ప్రత్యేకంగా ఉపయోగించే జీపీయూలు, ర్యామ్ లకు గత కొంతకాలంగా సరఫరా కొరతను ఎదుర్కొంటున్నారు. అందువల్లే ఈ సమస్య తలెత్తింది. కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అనే మార్కెట్ విశ్లేషణ సంస్థ తెలిపిన ప్రకారం ఈ సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా పీసీ మార్కెట్ సుమారు 8 శాతం వరకు పతనం కావచ్చని తేలింది. ఉత్పత్తుల అధిక రిటైల్ ధరలు, పరికరాల మార్పిడి సైకిల్ మందగించడం వినియోగదారుల డిమాండ్ తగ్గడానికి ప్రధాన కారణాలుగా పేర్కొంది. డీర్యామ్, ఎన్ఏఎన్‌డీ మెమొరీ చిప్‌ల ధరలు పెరగడం వల్ల ల్యాప్ టాప్, డెస్క్ టాప్‌లలో ఉపయోగించే జీపీయూల ధరలు కూడా పెరుగుతున్నాయి. అలాగే ర్యామ్ తయారీదారు ఇటీవల ఉత్పత్తిని తగ్గించారు. దీంతో సరఫరా తగ్గి మార్కెట్ ధరలు పెరిగాయి.
ఏఐ వర్క్ లోడ్స్, డేటా సెంటర్ అవసరాలే కారణాలు..
ఇక ఇటీవలి కాలంలో అధిక పనితీరు కలిగిన జీపీయూలకు డిమాండ్ కూడా బాగానే పెరిగింది. ఏఐ వర్క్ లోడ్స్, డేటా సెంటర్ అవసరాలు పెరగడంతో ఈ డిమాండ్ అధికంగా ఉందని, దీంతో ఆయా భాగాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ట్రెండ్ ఫోర్స్ అనే మార్కెట్ పరిశోధన సంస్థ తెలిపిన ప్రకారం రాబోయే త్రైమాసికాల్లోనూ ర్యామ్, జీపీయూల ధరలు పెరుగుతాయని వెల్లడైంది. 2026 రెండో త్రైమాసికంలో డీర్యామ్ కాంట్రాక్టు ధరలు 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉందని అంచనా వేసింది. సరఫరా తగ్గడం, ఆయా రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్ కారణంగా ధరలు కచ్చితంగా పెరుగుతాయని స్పష్టం చేసింది. ఇక ఎన్ఏఎన్‌డీ ఫ్లాష్ ధరలు కూడా 3 నుంచి 8 శాతం మేర పెరిగే అవకాశం ఉందని ఆ సంస్థ అంచనా వేసింది. మొత్తానికి ఆయా భాగాల ధరలు పెరుగుతుండడంతో రాబోయే కాలంలో ల్యాప్ టాప్‌లు, డెస్క్ టాప్‌ల కొనుగోలు ఖర్చు అధికంగా ఉంటుందని తెలుస్తోంది.
సంబంధిత వార్తలు

Microsoft Layoffs | మైక్రోసాఫ్ట్‌లో భారీ లేఆఫ్స్.. వ్యాపారం బాలేదంటూ ఉద్యోగులకు లేఖ రాసిన ఎక్స్‌బాక్స్ సీఈవో
జులై 7, 2026

HP | వాలొరెంట్ అభిమానులకు సర్ప్రైజ్.. హైపర్‌ఎక్స్ ఒమెన్ 16 లిమిటెడ్ ఎడిషన్ ల్యాప్‌టాప్ విడుదల..
జులై 7, 2026

Apple | మళ్లీ కార్డ్ పేమెంట్స్.. యాపిల్ యూజర్లకు గుడ్ న్యూస్..
జులై 6, 2026
తాజావార్తలు
- ●KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే
- ●Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు
- ●PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..
- ●PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ
- ●Revanth Reddy | రేవంత్ కీలక నిర్ణయం.. సీఎంవో అధికారులకు శాఖల కేటాయింపు
- ●Concrete mixer operators protest | కాంక్రీట్ మిక్సర్స్ ఆపరేటర్ల ఆందోళన.. ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయం వద్ద ఉద్రిక్తత

KUDA | 'కుడా'లో రూ. 70 కోట్ల అవినీతి.. టెండర్లు రద్దు చేయాల్సిందే

Kommidi Narasimha Reddy | భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నరసింహారెడ్డి ఇకలేరు

PMAY Urban 2.0 | ఇంటి రుణంపై రూ.1.80 లక్షల సబ్సిడీ.. కేంద్ర పథకం పూర్తి వివరాలు..

PM Modi | ప్రధాని మోదీకి ఇండోనేషియా అత్యున్నత పౌర పురస్కారం బింటాంగ్ ఆదిపుర్ణ



