Indians Stage Fake Robbery | యూ-వీసా కోసం చోరీ డ్రామా.. అమెరికాలో 11 మంది భారతీయులు అరెస్ట్
Indians Stage Fake Robbery | అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు (immigration benefits) పొందేందుకు కొత్త తరహా మోసానికి పాల్పడిన 11 మంది భారతీయ పౌరులను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు.
International | Published On Mar 14, 2026, 12.40 pm IST
Indians Stage Fake Robbery | అమెరికాలో ఇమ్మిగ్రేషన్ ప్రయోజనాలు (immigration benefits) పొందేందుకు కొత్త తరహా మోసానికి పాల్పడిన 11 మంది భారతీయ పౌరులను ఫెడరల్ అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులపై వీసా మోసానికి పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. సాయుధ దోపిడీలు సృష్టించి, తాము బాధితులుగా చిత్రీకరించుకోవడం ద్వారా ప్రత్యేక వీసాలు పొందడానికి వీరు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు.
అమెరికా వీసా నిబంధనల ప్రకారం.. హింసాత్మక నేరాల్లో బాధితులైన వారు అమెరికాలో చట్టబద్ధంగా ఉండేందుకు యూ-వీసా (నాన్ ఇమిగ్రేషన్ స్టేటస్)కు అర్హులు. దీంతో ఈ ప్రయోజనాన్ని పొందేందుకు కొందరు దోపిడీ బాధితులం అంటూ కట్టుకథలు అల్లారు. ఈ వీసాను పొందేందుకే నిందితులు నకిలీ దోపిడీల నాటకానికి తెరలేపినట్లు బోస్టన్‌లోని ఫెడరల్ దర్యాప్తు అధికారులు వెల్లడించారు. కన్వీనియన్స్ స్టోర్లు, మద్యం దుకాణాలు, ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఇలాంటి ఆరు నకిలీ దోపిడీలను వీరు పకడ్బందీగా నిర్వహించినట్లు గుర్తించారు. ఇదంతా పక్కా ప్రణాళికతో జరిగినట్లు మెసాచుసెట్స్‌లోని బోస్టన్ ఫెడరల్ అధికారులు తెలిపారు. ఈ కేసులకు సంబంధించి మెసాచుసెట్స్, కెంటకీ, ఒహాయో తదితర రాష్ట్రాల్లో 11 మంది భారతీయులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వీరిపై నేరం రుజువైతే, గరిష్ఠంగా ఐదేళ్ల జైలు శిక్ష, 250,000 డాలర్ల (రూ. 2.29కోట్లు) వరకు జరిమానా విధించే అవకాశం ఉంది.
Also Read..
వాహనదారులకు అలర్ట్.. ఫాస్టాగ్ వార్షిక పాస్ ధరలు పెంపు
దాడులను పెంచిన ఇరాన్.. బాగ్దాద్‌లోని యూఎస్ ఎంబసీపై డ్రోన్ అటాక్
సౌదీ ఎయిర్‌బేస్‌పై ఇరాన్ క్షిపణి దాడి.. దెబ్బతిన్న 5 అమెరికా రీఫ్యూయలింగ్ విమానాలు
తాజావార్తలు
- ●Religious clashes in Nepal | నేపాల్‌లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి
- ●Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..
- ●KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్
- ●BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి
- ●PM Modi | డ్రగ్స్‌కు దూరంగా ఉండండి..
- ●Vaishnavi Chaitanya | బోనమెత్తిన బేబీ హీరోయిన్ - ఉజ్జయినీ మహాంకాళి టెంపుల్లో ప్రత్యేక పూజలు

Religious clashes in Nepal | నేపాల్‌లో మత ఘర్షణలు.. ముగ్గురు మృతి

Karnataka | తమిళనాడు-కర్నాటక మధ్య కావేరీ జలాల వివాదం.. డీకే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం..

KTR | కాంగ్రెస్సే అసలైన క్రిమినల్ వేస్ట్

BRS NRIs USA | దేవాదులకు పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెట్టాలి.. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి




