Abhijeet Dipke | ప్రధాని రాజీనామా చేసి ఇన్‌ఫ్లూయెన్సర్‌గా మారాలి : అభిజీత్ దిప్కే
Abhijeet Dipke | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉద్దేశించి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని తనపదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ (social media influencer)గా మారాలని ఎద్దేవా చేశారు.
Abhijeet Dipke | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi)ని ఉద్దేశించి కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని తనపదవికి రాజీనామా చేసి సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ (social media influencer)గా మారాలని ఎద్దేవా చేశారు. దేశాన్ని పాలించడం కంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మోదీ బాగా పని చేస్తున్నారంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. "ప్రధాని మోదీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా బాగా సరిపోతారు. ఆయన దేశ అత్యన్నత పదవి నుంచి తప్పుకుని.. దేశాన్ని నడిపించే బాధ్యతను వేరే ఎవరికైనా అప్పగించాలి" అంటూ వ్యాఖ్యానించారు. నీట్ పేపర్ లీక్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థి నిరసనకారులతో సోషల్ మీడియా ద్వారా సంప్రదింపులు జరపడాన్ని ఉద్దేశిస్తూ దిప్కే ఈ వ్యాఖ్యలు చేశారు.
అదేవిధంగా ఆందోళన విరమించినప్పటికీ విద్యార్థి నిరసనకారులు వేధింపులను ఎదుర్కొంటున్నారని దిప్కే ఆరోపించారు. నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష్యంగా చేసుకుంటున్నాయని విమర్శించారు. ప్రభుత్వం విద్యార్థులను వేధించడం మానుకోవాలన్నారు. లేదంటే రాబోయే ఎన్నికల్లో నిరసనకారులే ప్రభుత్వాలకు తగిన బుద్ది చెబుతారంటూ తీవ్రంగా హెచ్చరించారు.
కేంద్ర మంత్రి రాజీనామాతో అంతా అయిపోలేదు..
కేవలం కేంద్ర మంత్రి రాజీనామా చేసినంత మాత్రాన అంతా అయిపోలేదని దిప్కే వ్యాఖ్యానించారు. నిరసనకారుల కోపం చల్లారలేదన్నారు. యువత ఆగ్రహం ఒక్క మంత్రిపై కాదని.. కేంద్ర ప్రభుత్వంపైనే ఉందన్నారు.
బీజేపీ ప్రభుత్వం యువత ఆగ్రహాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోతోందంటూ ప్రశ్నించారు. విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటే ఆందోళన మళ్లీ పునఃప్రారంభిస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. నిరసన ముగియడాన్ని ఉద్యమం ముగిసినట్లుగా ప్రభుత్వం భావించకూడదన్నారు.
ప్రభుత్వాన్ని దించుతాం..
"విద్యార్థులు ఉగ్రవాదులు కాదు. దేశ భవిష్యత్తు. దేశ భవిష్యత్తును ఈ విధంగా ఇబ్బంది పెడితే.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసినట్లే అవసరమైతే ప్రభుత్వాన్ని మార్చే ఉద్యమం చేపడతాం. ఈసారి ఆందోళన మరింత భారీస్థాయిలో ఉంటుంది" అని దిప్కే హెచ్చరించారు.
విద్యార్థులపై పెల్లెట్ గన్స్ వినియోగంపై కూడా దిప్కే తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. "అమిత్ షా అయినా, మరెవరైనా సరే పెల్లెట్ గన్ కాల్పులకు ఆదేశాలు ఇచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని డిమాండ్ చేశారు.
Also Read..
నీట్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోన్న శ్రీలీల - సినిమాలకు బ్రేక్?
రాజ్యసభ ముందుకు పేపర్ లీక్ బిల్లు
తప్పు చేయకపోతే భయమెందుకు..? అమిత్ షాను టార్గెట్ చేసిన రాహుల్
తాజావార్తలు
- ●Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు
- ●Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..
- ●Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..
- ●KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?
- ●టెసరాక్ట్ వర్సెస్ ఫామ్‌హౌస్‌లు.. ఒకరి ఆరోపణకు మరొకరి ఆస్తులే సమాధానమా?
- ●Stock Markets | స్టాక్ మార్కెట్లో జోరు.. 564 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్..

Dharmasthala Case | మరోసారి తెరపైకి ధర్మస్థల హత్యాచార కేసు.. సుప్రీం కీలక ఆదేశాలు

Amazon Great Indian Festival | అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు డేట్ ఫిక్స్.. భారీ ఆఫర్లు..

Kerala Film Festival | కేరళ ఫిల్మ్ ఫెస్టివల్.. 31 సినిమాలపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం..

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగల్‌లో చేసేందుకు వస్తున్నరేమో?






