Sreeleela | నీట్ ఎగ్జామ్స్‌కు ప్రిపేర్ అవుతోన్న శ్రీలీల – సినిమాలకు బ్రేక్?
నీట్ ఎగ్జామ్స్ కోసం ధమాకా బ్యూటీ శ్రీలీల సినిమాలకు స్మాల్ బ్రేక్ తీసుకోనున్నట్లు సమాచారం. ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసింది శ్రీలీల. ఇక్కడితోనే చదువును ఆపకుండా ఎండీ కూడా చేయాలని అనుకుంటున్నట్లు తెలిసింది. ప్రస్తుతం నీట్ పీజీ ఎగ్జామ్స్‌కు ప్రిపెర్ అవుతోన్న శ్రీలీల నెల రోజుల పాటు సినిమా షూటింగ్‌లకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Jul 30, 2026, 3.21 pm IST
Sreeleela | ఇదివరకు హీరోయిన్లు సినిమాల కోసం చదువును పక్కనపెట్టేవారు. ప్రేమ, పెళ్లి లాంటి విషయాల్లో గోప్యతను పాటించేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఓ వైపు తమకు ఇష్టమైన చదువును కొనసాగిస్తూనే సినిమాలు చేస్తోన్నారు. పెళ్లి చేసుకొని కూడా హీరోయిన్లుగా దూసుకుపోతున్నారు.
ఎంబీబీఎస్....
ధమాకా బ్యూటీ శ్రీలీల ఇటీవలే ఎంబీబీఎస్ పూర్తిచేసింది. డాక్టర్ పట్టా కూడా అందుకుంది. సినిమాలతో తీరిక లేకుండా బిజీగా ఉంటూ కూడా సక్సెస్‌ఫుల్‌గా వైద్య విద్యను అభ్యసించింది. సెట్స్‌లో షూటింగ్ బ్రేక్‌లలో ఎగ్జామ్స్ కోసం శ్రీలీల ప్రిపేర్ అయిన ఫొటోలు చాలా సార్లు వైరల్ అయ్యాయి.
ఎంబీబీఎస్‌తోనే చదువును ఆపేయడం లేదట శ్రీలీల. ఎండీ కూడా పూర్తిచేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం నీట్ పీజీ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతోన్నట్లు ఆమె సన్నిహితులు చెబుతోన్నారు. ఉన్నత విద్య కోసమే సినిమాలకు స్మాల్ గ్యాప్ ఇచ్చినట్లు తెలిసింది.
ట్రిపుల్ హ్యాట్రిక్...
డిజాస్టర్లలో ట్రిపుల్ హ్యాట్రిక్ కొట్టినా శ్రీలీలకు అవకాశాలకు ఢోకా లేదు. ఇదివరకు చేతిలో ఐదారు సినిమాలతో ఫుల్ బిజీగా ఉండేది. ఇప్పుడు కాస్త జోరు తగ్గించింది. ప్రస్తుతం తమిళంలో ధనుష్‌తో ఓం సినిమా మాత్రమే చేస్తోంది. నీట్ పీజీ ఎగ్జామ్స్‌కు ఇబ్బంది కలగకూడదనే ఆఫర్లు వస్తోన్నా కూడా వాటిని శ్రీలీల రిజెక్ట్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆగస్ట్‌లో శ్రీలీల నీట్ పీజీ ఎగ్జామ్స్‌కు అటెండ్ కానున్నట్లు సమాచారం. నెల రోజుల వరకు సినిమా షూటింగ్‌లకు ఈ ధమాకా బ్యూటీ బ్రేక్ ఇవ్వబోతున్నట్లు సమాచారం.
బాలీవుడ్‌లో...
ధనుష్ ఓంలో శ్రీలీలతో పాటు సాయిపల్లవి మరో హీరోయిన్‌గా నటిస్తోంది. పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ మూవీ ఈ ఏడాది అక్టోబర్ 16న థియేటర్లలోకి రాబోతుంది. పరాశక్తి తర్వాత తమిళంలో శ్రీలీల చేస్తోన్న సెకండ్ మూవీ ఇది. ఆషికీ 3 మూవీతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయబోతుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు అనురాగ్ బసు దర్శకత్వం వహిస్తున్నారు.
సంబంధిత వార్తలు

Vaishnavi Chaitanya | వయసుపై తప్పుడు ప్రచారం – ఆధార్ కార్డ్‌తో క్లారిటీ ఇచ్చిన బేబీ హీరోయిన్
సెప్టెంబర్ 21, 2026

Krithi Shetty | బేబమ్మ బర్త్‌డే ట్రీట్ – లంగా ఓణీలో కృతిశెట్టి – జనవరి 12 విడుదల ఫస్ట్ లుక్ రిలీజ్
సెప్టెంబర్ 21, 2026

Toxic OTT | ట్రిమ్ వెర్షన్‌తో ఓటీటీలోకి యశ్ ‘టాక్సిక్’ – బోల్డ్ సీన్లు కట్!
సెప్టెంబర్ 21, 2026
తాజావార్తలు
- ●Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా
- ●Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..
- ●V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి
- ●Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు
- ●Indian Railways | యూపీఐ ద్వారా రైలు టిక్కెట్లను కొంటే ఛార్జీలు ఉంటాయా.. రైల్వే శాఖ స్పష్టత..
- ●Ponguleti Srinivas Reddy | ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు అలర్ట్.. మంత్రి పొంగులేటి కీలక నిర్ణయం

Sanjay Kalvakuntla vs Kishan Reddy | కేంద్రం ఒక్క మెడికల్ సీటు ఇచ్చిందని నిరూపిస్తే రాజీనామా చేస్తా

Lava Virat Curve | లావా విరాట్ కర్వ్ వచ్చేసింది.. వెనుక మరో డిస్ప్లే..

V Hanumantha Rao | కాంగ్రెస్ ఇచ్చిన భూములను కాంగ్రెస్సే కాపాడాలి

Sonia Gandhi | పౌరసత్వం అంశం.. సోనియా గాంధీకి చుక్కెదురు



