త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగ‌ల్లో చేసేందుకు వ‌స్తున్న‌రేమో?

KTR | సిరిసిల్ల అభివృద్ధిని చూసి కొడంగ‌ల్‌లో అమ‌లు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వ‌స్తున్న‌రేమోన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల‌కొచ్చి నేతన్నల ఆత్మహత్యలు, రైతుబంధు ఎగ్గొట్టింది వివరిస్తారా? అని ప్ర‌శ్నించారు.

S

Telangana | Published On Sep 21, 2026, 4.23 pm IST

KTR | సిరిసిల్ల అభివృద్ధిని కొడంగ‌ల్లో చేసేందుకు వ‌స్తున్న‌రేమో?
Advertisement
  • 8000 ఎకరాలు ఎవ‌రు క‌బ్జా చేశారో తేల్చాలి.. లేదంటే క్ష‌మాప‌ణ‌లు చెప్పాలి
  • భూముల వద్దకు వెళ్లి ఏం చేస్తారు?
  • ఏపీకీ నీళ్లు తీసుకెళ్తుంటే పాల‌మూరు రైతుల పంట‌లు ఎండ‌వెడుతున్న‌రు
  • 248 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ కేవలం 28 టీఎంసీలే వాడింది
  • మీడియా స‌మావేశంలో కేటీఆర్

KTR | త్రినేత్ర‌.న్యూస్‌: సిరిసిల్ల అభివృద్ధిని చూసి కొడంగ‌ల్‌లో అమ‌లు చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి వ‌స్తున్న‌రేమోన‌ని బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సిరిసిల్ల‌కొచ్చి నేతన్నల ఆత్మహత్యలు, రైతుబంధు ఎగ్గొట్టింది వివరిస్తారా? అని ప్ర‌శ్నించారు. అసెంబ్లీలో సీఎం చెప్పినట్లు సిరిసిల్లలో 8000 ఎకరాలు ఎవరు కబ్జా చేశారో తేల్చాల‌ని, లేదంటే వాటిపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డి.. రాజన్న దర్శనం చేసుకొని పాప ప్రక్షాళన చేసుకోవాలని హిత‌వు ప‌లికారు. సోమ‌వారం తెలంగాణ భ‌వ‌న్‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ రేవంత్‌పై మండిప‌డ్డారు.

ఎల్ కాంగో వల్లే ఈ దుస్థితి..

జూరాలలో నీరు ఉన్నప్పటికీ నీరు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని రైతులు స్పష్టంగా చెప్తున్నారు. వరద జలాలపై కట్టిన ప్రాజెక్టులకు ఏపీ నీరు తీసుకెళ్తుంటే.. ఇక్కడ నికర జలాలపై నిర్మించిన ప్రాజెక్టుల కింద కూడా నీరు ఇవ్వడం లేదు. ఈ ఏడాది వచ్చిన 248 టీఎంసీల కృష్ణా జలాల్లో తెలంగాణ కేవలం 28 టీఎంసీలు మాత్రమే వాడింది. పాలమూరు బిడ్డ అని చెప్పుకునే రేవంత్ రెడ్డి పాలమూరు రైతులకు మొదటి శత్రువులా అయ్యారు. ఎల్ నినో తరహాలో.. ఎల్ కాంగో వల్లే ఈ దుస్థితి.

ఒక్క ఎక‌రం ఎండినా..

రైతుల కోసం వెళ్లిన మా నేతలను దుర్మార్గంగా అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాం. అరెస్టులతో భ‌యటపెట్టలేరు. జూరాల కింద ఒక్క ఎకరం పంట ఎండినా కాంగ్రెస్ ప్రభుత్వానిదే బాధ్యత. ప్రభుత్వ వైఖరి మార్చుకోకుంటే పెద్ద ఉద్యమానికి శ్రీకారం చూడతాం. ప్రభుత్వ కార్యాలయాలు దిగ్బంధం చేస్తాం. రాజకీయ ప్రయోజనాలు కాదు.. రైతుల ప్రయోజనాలు ముఖ్యం కావాలి.

క‌ర్ణాట‌క‌తో మాట్లాడండి..

రైతుల విషయంలో రాజకీయం చేయవద్దు. కన్నేపల్లి, నార్లపూర్ పంపులు ఆన్ చేయండి. క‌ర్నాటక ప్రభుత్వంతో మాట్లాడి 10 టీఎంసీల నీరు తీసుకొచ్చి పంటలు కాపాడండి. మేం ఏమైనా తప్పులు చేసి ఉంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి చర్యలు అయినా తీసుకోవచ్చు. డ్రామాలు తగవు.. భూముల వద్దకు వెళ్లి ఏం చేస్తారు? సరైన విషయంలో తగు రీతిన స్పందిస్తాం. ఆస్తులపై సిట్టింగ్ విచారణకు సిద్ధమని సవాల్ చేస్తే ఇప్పటి వరకు కనీసం స్పందన లేదు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

Advertisement
Advertisement