PM Modi | ప్రధాని మోదీ 76వ పుట్టినరోజు స్పెషల్.. రక్తదానం చేసిన సీఎం
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా పలువురు నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా రక్తదానం చేశారు.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రధానికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎన్డీయే పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఎమ్మెల్యేలు ప్రధానికి సోషల్ మీడియా వేదికగా బర్త్‌డే విషెస్ తెలియజేస్తున్నారు. అదే సమయంలో పలువురు నేతలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆలయాల్లో పూజలు, దీపోత్సవాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు.
ప్రధాని బర్త్‌డేని పురస్కరించుకొని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీ ఖాతు శ్యామ్ విశాల్ ఆలయంలో 108 కుండీయ యజ్ఞాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వయంగా సీఎం రక్తదానం చేశారు.
పుట్టినరోజుతోపాటూ ప్రధాని మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న (PM Modis 25 years in public service) సందర్భంగా బీజేపీ సేవా సంకల్ప అభియాన్ (Seva Sankalp Abhiyan)ను ప్రారంభించింది. పవిత్ర కాశీ నగరంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బీజేపీ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరితో కలిసి ఈ కార్యక్రమాన్ని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శనను వారంతా తిలకించారు. అనంతరం కాశీ నుంచి వద్‌నగర్ వరకూ బైక్ యాత్రను ప్రారంభించారు. అంతకుముందు కాశీ విశ్వనాథ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గుజరాత్‌లోని వద్‌నగర్‌లో గల చారిత్రక శర్మిష్ఠ సరస్సు వద్ద హారతి కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్,మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే. ప్రసిద్ధ హాటకేశ్వర్ మహాదేశ్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శ్రీనగర్‌లో చిన్నారులతో కలిసి ప్రధాని బర్త్‌డేని సెలబ్రేట్ చేసుకున్న జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రధాని మోదీ జీవిత ప్రస్థానంపై రూపొందించిన పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి
‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా అగర్తలాలోని ప్రజ్ఞా భవన్‌లో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరైన త్రిపుర ముఖ్యమంత్రి మానిక్ సాహా
మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో గల ప్రభుత్వ జై ప్రకాష్ ఆసుపత్రిలో ‘సేవా సంకల్ప అభియాన్’లో భాగంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్. రాష్ట్ర వ్యాప్తంగా 290కిపైగా ప్రాంతాల్లో రక్తదాన శిబరాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
లెహ్‌లో డ్రగ్స్‌పై అవగాహన కల్పిస్తూ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న లఢఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా
ప్రధాని బర్త్‌డే సందర్భంగా దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్, గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్

వారణాసిలోని అహల్యాబాయి ఘాట్ వద్ద ప్రత్యేక పూజలు

లిటిల్ మోదీస్.. ప్రధాని పుట్టిన రోజు సందర్భంగా పశ్చిమ బెంగాల్ రాష్ట్రం సిలిగూరులోని పాఠశాల విద్యార్థులు మోదీ గెటప్‌లో ఆకట్టుకున్నారు.

ఒడిశా పూరీ తీరంలో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం ఆకట్టుకుంటోంది
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Gajjela Kantham | వందల ఎకరాలే ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోయేటోళ్లా?
- ●Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్రబెల్లి దయాకర్‌రావు
- ●Malka Komaraiah - AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి
- ●Payal Rajput | బోల్డ్ ఫొటోలతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రచ్చ - అవకాశాల కోసమేనా?
- ●నిజాం కోటను కాపాడేందుకు ఆఖరి ప్రయత్నం.. కరాచీ టూ హైదరాబాద్ సీక్రెట్ ఫ్లైట్ కథ!
- ●Anthropic | మైక్రోసాఫ్ట్ ఆఫీస్‌కు ఆంథ్రోపిక్ పోటీ.. క్లాడ్లోనే డాక్యుమెంట్లు..

Gajjela Kantham | వందల ఎకరాలే ఉంటే నువ్వు, నీ చెల్లె అమెరికా పోయేటోళ్లా?

Errabelli Dayakar Rao | అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలకు తెరలేపిండు : ఎర్రబెల్లి దయాకర్‌రావు

Malka Komaraiah - AVN Reddy | ప్రమోషన్లు ఎప్పుడిస్తారు? స్కూల్ అసిస్టెంట్లకు న్యాయం చేయండి

Payal Rajput | బోల్డ్ ఫొటోలతో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ రచ్చ - అవకాశాల కోసమేనా?






