PM Modi | మోదీ బర్త్‌డే.. 25 లక్షల దీపాలతో వెలుగులీననున్న ఉజ్జయిని
PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పుట్టినరోజు సందర్భంగా ఉజ్జయిని (Ujjain)లో దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క్షిప్రా నది (Shipra River) ఘాట్ల వద్ద 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను (25 lakh diyas) వెలిగించనున్నారు. ఇవాళ సాయంత్రం ఉజ్జయిని పవిత్ర నగరం దేదీప్యమానంగా వెలుగులీననుంది.
PM Modi | త్రినేత్ర.న్యూస్ : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) 76వ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా బీజేపీ దేశవ్యాప్తంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని పవిత్ర నగరమైన ఉజ్జయిని (Ujjain)లో దీపోత్సవ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. క్షిప్రా నది (Shipra River) ఘాట్లు దేదీప్యమానంగా వెలుగులీననున్నాయి. ఇందుకోసం స్థానిక యంత్రాంగం భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తోంది.
వేడుకల్లో భాగంగా ఇవాళ సాయంత్రం 7 గంటలకు క్షిప్రా నది ఘాట్లు, మహాకాల్ కారిడార్ ప్రాంతంలో ఈ మహా దీపోత్సవం ప్రారంభమవుతుందని ఉజ్జయిని కలెక్టర్ రోషన్ కుమార్ సింగ్ (Ujjain Collector Roshan Kumar Singh) మీడియాకు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా దాదాపు 25 లక్షలకు పైగా మట్టి ప్రమిదలను (25 lakh diyas) వెలిగించనున్నట్లు చెప్పారు. దాదాపు 30,000 మందికిపైగా వాలంటీర్లు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని కలెక్టర్ తెలిపారు. మరోవైపు ఇంత భారీ స్థాయి కార్యక్రమం కోసం అధికారులు భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. భారీ భద్రతా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ వివరించారు.
మరోవైపు పుట్టినరోజుతోపాటూ ప్రధాని మోదీ (PM Modi) ప్రజా జీవితంలోకి (public office) అడుగుపెట్టి 25 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న (PM Modis 25 years in public service) సందర్భంగా బీజేపీ సేవా సంకల్ప అభియాన్ (Seva Sankalp Abhiyan) పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. దేశ వ్యాప్తంగా రక్తదానం, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఆరోగ్య శిబిరాలతోపాటూ సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రదర్శనలు, సదస్సులు వంటి ప్రజా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించనుంది. మోదీ 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానాన్ని, ఆయన పాలనా తీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రతిబింబించేలా ఫొటో, డిజిటల్ ప్రదర్శనలను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. నేటి నుంచి అక్టోబర్ 17 వరకూ దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి.
కాగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అక్టోబర్ 7, 2001న తొలిసారి గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. 2014 వరకూ గుజరాత్ సీఎంగానే కొనసాగారు. అనంతరం 2014 మే 26న భారత ప్రధాన మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి వరుసగా మూడో పర్యాయం ఆయన ప్రధానిగా కొనసాగుతూ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారు. ఈ ఏడాది అక్టోబర్ 7 నాటికి మోదీ రాజ్యాంగబద్ధమైన ప్రజా జీవితంలోకి వచ్చి 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో బీజేపీ సేవా కార్యక్రమాలు నిర్వహించ తలపెట్టింది.
Also Read..
40 ఏళ్ల వయస్సు వరకు ఎస్ఐపీలో రూ.1 కోటి సంపాదిస్తే.. 50 ఏళ్లకు ఎంతవుతుంది?
బోల్డ్ పాత్రలో శృతి హాసన్ - థియేటర్లలోకి టాలీవుడ్ కాంట్రవర్షియల్ మూవీ
ఎన్నికల అఫిడవిట్‌లో ఎకరం కూడా లేదన్నడు.. ఇప్పుడు వేల కోట్ల భూములెలా వచ్చాయ్?
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●1 Crore Corpus | 40 ఏళ్ల వయస్సు వరకు ఎస్ఐపీలో రూ.1 కోటి సంపాదిస్తే.. 50 ఏళ్లకు ఎంతవుతుంది?
- ●Shruti Haasan | బోల్డ్ పాత్రలో శృతి హాసన్ - థియేటర్లలోకి టాలీవుడ్ కాంట్రవర్షియల్ మూవీ
- ●Arup Chakraborty Lokpal Case | ఆ పార్టీ మారగానే అదృష్టమొచ్చిందా?.. ఎంపీపై కేసులన్నీ కొట్టివేసిన లోక్‌పాల్
- ●Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ షురూ
- ●PM Modi | భారత్‌పై ప్రపంచ దేశాల విశ్వాసం పెరుగుతోంది : ప్రధాని మోదీ
- ●Theenmar Mallanna | బీసీల రాజ్యాధికారం కోసం మల్లన్న తొలి అడుగు.. గోల్కొండ కోట నుంచి రాజ్యాధికార యాత్ర షురూ

1 Crore Corpus | 40 ఏళ్ల వయస్సు వరకు ఎస్ఐపీలో రూ.1 కోటి సంపాదిస్తే.. 50 ఏళ్లకు ఎంతవుతుంది?

Shruti Haasan | బోల్డ్ పాత్రలో శృతి హాసన్ - థియేటర్లలోకి టాలీవుడ్ కాంట్రవర్షియల్ మూవీ

Arup Chakraborty Lokpal Case | ఆ పార్టీ మారగానే అదృష్టమొచ్చిందా?.. ఎంపీపై కేసులన్నీ కొట్టివేసిన లోక్‌పాల్

Enquiry on KCR Lands | రేవంత్ ఆదేశం.. కేసీఆర్ ఫామ్‌హౌస్ భూములపై విచారణ షురూ





