Terror Attack | జమ్ము కశ్మీర్‌లో వలస కార్మికులే లక్ష్యంగా ఉగ్రదాడి.. ఇద్దరు మృతి
Terror Attack | జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లోని కుల్గాం (Kulgam) జిల్లాలో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు వలస కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.
Terror Attack | త్రినేత్ర.న్యూస్ : జమ్ము కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదులు (Terror Attack) మరోసారి రెచ్చిపోయారు. కుల్గాం (Kulgam) జిల్లాలో వలస కార్మికులపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం సాయంత్రం కెల్లమ్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉగ్రవాదులు వలస కార్మికులను లక్ష్యంగా చేసుకుని విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈఘటనలో ఒకరు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మరణించారు. మృతులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దీపక్, భూపేందర్‌గా గుర్తించారు. ఈ దాడితో అప్రమత్తమైన పోలీసులు, భద్రతా దళాలు కాల్పులకు తెగబడిన టెర్రరిస్టుల కోసం గాలింపు చేపడుతున్నారు.
కాగా, పవిత్ర అమర్‌నాథ్ యాత్ర కొనసాగుతున్న వేళ జమ్ము కశ్మీర్‌లో ఉగ్రదాడులు ఆందోళన కలిగిస్తున్నాయి. పది రోజుల క్రితం అనంత్‌నాగ్ జిల్లాలో పోలీసు అధికారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. పవిత్ర అమర్‌నాథ్ యాత్ర నేపథ్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఇండియా రిజర్వ్ (IR) 3వ బెటాలియన్‌కు చెందిన కానిస్టేబుల్ ఆషిక్ హుస్సేన్ ఖురేషిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో అతను ప్రాణాలు కోల్పోయాడు. ఇలా వరుస ఉగ్రదాడులతో స్థానిక నివాసితులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. మరోవైపు వరుస దాడులతో అప్రమత్తమైన భద్రతా దళాలు కశ్మీర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సోదాలు చేపట్టారు. దాదాపు 3,000 మందికిపైగా అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
Also Read..
నేనూ పేపర్ లీక్ బాధితురాలినే.. విద్యార్థుల బాధ నాకు తెలుసు : బాలీవుడ్ నటి
ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. నన్ను క్షమించండి అంటూ వీడియో రిలీజ్ చేసిన 15 ఏళ్ల బాలిక
ఫ్లిప్‌కార్ట్ బంపర్ ఆఫర్.. ఇలా చేస్తే ప్రతి నెలా నెట్‌ఫ్లిక్స్ ఫ్రీ..
తాజావార్తలు
- ●DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..
- ●Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు
- ●HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక
- ●Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?
- ●High Court | సీనియర్ ఐఏఎస్ సందీప్ కుమార్ సుల్తానియాను అరెస్టు చేయండి.. హైదరాబాద్ సీపీకి హైకోర్టు ఆదేశం
- ●Horoscope | ఆగస్టు 7 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలం!

DRDO | డీఆర్డీఓలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు.. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక..

Hyderabad | గణేశుడి లడ్డూ పంచాడు.. అపార్ట్మెంట్ వాసులను రూ.కోట్లలో ముంచాడు

HYDRAA | హైడ్రాలో ఉద్యోగాలు.. రాతపరీక్ష లేకుండానే ఎంపిక

Vastu Tips | వంట గదిలో చీపురు పెట్టొచ్చా..? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది..?






