Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
Students Protest Against Dipke | కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు (Students Protest Against Dipke).
Students Protest Against Dipke | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జనతా పార్టీ (Cockroach Janta Party) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)కు వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు దిగారు (Students Protest Against Dipke). నీట్ పేపర్ లీక్ అంశాన్ని (NEET paper leak) పక్కన పెట్టి ఇతర సమస్యలపై దిప్కే తన దృష్టి మరల్చారని ఆరోపిస్తూ మహారాష్ట్ర లాతూర్‌లో విద్యార్థులు (Latur students) శుక్రవారం నిరసన తెలిపారు. జంతర్ మంతర్ ఆందోళనల అనంతరం ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దిప్కేని ప్రశ్నించారు.
గాంధీ చౌక్ వద్ద నిరసనకారులు దిప్కేకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. జంతర్ మంతర్ వద్ద CJP ఆందోళన తర్వాత ప్రభుత్వం ఇచ్చిన హామీలపై దిప్కే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. "NEET అంశంపై దిప్కే ఇప్పుడు ఎందుకు మౌనం వహిస్తున్నారు..? నీట్ కేసు ఏమైంది..? పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు పరిహారం ఇప్పించే విషయంలో దిప్కే ఏం చేశారు..?" అంటూ నిలదీశారు. పేపర్ లీక్ తర్వాత ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నష్టపరిహారం ఇప్పించడంలో దీప్కే విఫలమయ్యారని విద్యార్థి సంఘం నాయకుడు సతీష్ కరాండే ఆరోపించారు.
భవిష్యత్తులో ఇలాంటి లీకులు జరగకుండా చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. గత నెలన్నరగా ఇతర సమస్యలపై దృష్టి సారిస్తూ.. దిప్కే దాటవేత ధోరణిలో సమాధానాలు ఇస్తున్నారని ఆరోపించారు. "NEET సమస్యపై ఎలాంటి నిర్ణయాత్మక చర్యలూ తీసుకోవడం లేదు. అంతకుముందు జరిగిన NEET ఆందోళనతో దిప్కే విద్యార్థుల కోసం తన పోరాటాన్ని కొనసాగిస్తారని మేము ఆశించాము. కానీ ఆయన ఇతర సమస్యలపై దృష్టి పెట్టారు. ప్రభుత్వ పాఠశాలలపై ఫోకస్ పెట్టారు. దాన్ని కూడా మధ్యలోనే వదిలేసి ఇప్పుడు ఎన్నికల సంఘంపై పోరాటం అంటూ ముంబై వెళ్లిపోయారు" అని కరాండే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నిరసనకారులు దిప్కే పోస్టర్‌ను చెప్పులతో కొట్టారు.
Also Read..
భారత ఆధ్యాత్మిక జ్ఞానం ప్రపంచానికి మార్గదర్శకం : మోహన్ భగవత్
ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Jantar Mantar | సీఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టిన ఆప్ లీడర్లు అరెస్ట్.. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్తత
అక్టోబర్ 2, 2026

Jail Bharo Andolan | అక్టోబర్ 2న సీజేపీ జైల్ భరో ఆందోళన.. కీలక అప్డేట్ ఇచ్చిన దిప్కే
సెప్టెంబర్ 28, 2026

Cockroach Janta Party | అస్సాంలో తీవ్ర ఉద్రిక్తత: మీటింగ్‌కు ముందే సీజేపీ నేతల అరెస్ట్.. సీఎం హిమంతపై తీవ్ర ఆరోపణలు
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్
- ●Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
- ●Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
- ●Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
- ●Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో - కొత్త హీరోయిన్‌తో రొమాన్స్
- ●India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..

Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!



