త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJP | జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అక్టోబ‌ర్ 2నుంచి దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు : సీజేపీ

CJP | రేప‌టిలోపు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయాల్సిందేన‌ని కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) స్ప‌ష్టం చేసింది. లేదంటే అక్టోబ‌ర్ 2న దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు చేప‌ట్టనున్న‌ట్లు హెచ్చ‌రించింది.

D

National | Published On Sep 25, 2026, 3.15 pm IST

CJP | జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాల్సిందే.. అక్టోబ‌ర్ 2నుంచి దేశ‌వ్యాప్త నిర‌స‌న‌లు : సీజేపీ
Advertisement

CJP | త్రినేత్ర న్యూస్ : కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. రేప‌టిలోపు ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (Gyanesh Kumar) రాజీనామా చేయ‌క‌పోతే దేశవ్యాప్త నిర‌స‌న‌లు చేప‌ట్టనున్న‌ట్లు ప్ర‌క‌టించింది. గాంధీ జయంతి అయిన అక్టోబర్ 2న ముంబైలో నిరసనలు ప్రారంభిస్తామ‌ని తెలిపింది. ఈ మేర‌కు సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఎక్స్ వేదిక‌గా కీల‌క‌ ప్ర‌క‌ట‌న చేశారు.

"రేపటిలోగా జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి. లేదంటే అక్టోబ‌ర్ 2న గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా ముంబై వేదిక‌గా దేశ‌వ్యాప్త ఆందోళ‌న‌ల‌ను ప్రారంభిస్తాం. ఈ నిరసనలను ముంబై నుంచి దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు విస్తరింపజేస్తాం" అని హెచ్చ‌రించారు. ఈ గాంధీ జయంతి నాడు ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ప్రతిజ్ఞ చేద్దాం అని దిప్కే పిలుపునిచ్చారు.

ప్ర‌తిప‌క్షాలు ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌కండి

మ‌రోవైపు ప్ర‌తిప‌క్షాల‌ను ఉద్దేశించి దిప్కే కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌తిప‌క్షాలు ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని ఆరోపిస్తూనే.. మ‌ళ్లీ అవే ఎన్నిక‌ల్లో ఎందుకు పోటీ చేస్తున్నాయ‌ని ప్ర‌శ్నించారు. ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌లో అవ‌క‌త‌వ‌క‌లు జ‌రుగుతున్నాయ‌ని భావిస్తే.. ఇక‌పై ఆ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం మానుకోవాల‌ని పిలుపునిచ్చారు. ఓట్ల చోరీ జ‌రుగుతోంద‌ని, పార్టీ ఫిరాయింపుల‌కు పాల్ప‌డుతున్నార‌ని ఆరోపిస్తూనే ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డం అంటే.. త‌మ‌ను బ‌లహీన‌ప‌రిచే వ్య‌వ‌స్థ‌లోనే మ‌నుగ‌డ సాగించ‌డానికి ప్ర‌య‌త్నించ‌డ‌మేన‌ని దిప్కే అభిప్రాయ‌ప‌డ్డారు. ఒకవేళ ఎన్నికలకు దూరంగా ఉంటే తమ రాజకీయ అస్తిత్వం కోల్పోతామనే భయంతోనే పార్టీలు పోటీ చేస్తున్నాయా..? అంటూ దిప్కే నిల‌దీశారు. ప్ర‌తిప‌క్షాలు త‌మ స్వార్థ రాజ‌కీయ ప్ర‌యోజ‌నాల కోసం కాకుండా ప్ర‌జాస్వామ్యానికి పెద్ద‌పీట వేయాల‌ని సూచించారు.

జంతర్ మంతర్ 2.0

కాగా, జ్ఞానేశ్ కుమార్‌కు కాక్రోచ్ పార్టీ ఇప్ప‌టికే అల్టిమేటం జారీ చేసిన విష‌యం తెలిసిందే. 48 గంటల్లో ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌క‌పోతే.. దేశ‌వ్యాప్తంగా భారీ ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తామ‌ని హెచ్చ‌రించింది. అంతేకాదు, జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద 2.0 ఉద్య‌మం చేప‌డ‌తామ‌ని సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు దిప్కే హెచ్చ‌రించారు."ఓట‌ర్ల హ‌క్కుల‌ను జ్ఞానేశ్ కుమార్ కాలరాస్తున్నారు. 48 గంట‌ల్లో ఆయ‌న‌ రాజీనామా చేయాలి. లేదంటే దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు చేప‌డ‌తాం. ఢిల్లీలోనూ పెద్ద ఎత్తున ఆందోళ‌న‌ల‌ను నిర్వ‌హిస్తాం. అప్ప‌టికీ సీఈసీ స్పందించ‌క‌పోతే జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద 2.0 ఖాయం" అని దిప్కే స్ప‌ష్టం చేశారు. సీజేపీ విధించిన గ‌డువు రేప‌టితో ముగియ‌నుంది. ఈ నేప‌థ్యంలోనే తాజా హెచ్చ‌రిక‌లు చేసింది.

Also Read..

ఆల్కహాల్ టెస్ట్‌లో విఫ‌లం.. కోపైల‌ట్ స‌స్పెన్ష‌న్‌

రాష్ట్ర హోదాను పున‌రుద్ద‌రించండి.. జమ్ము కశ్మీర్‌ అసెంబ్లీలో తీర్మానం

ప్యార‌డైజ్ ఫ‌స్ట్ డే క‌లెక్ష‌న్స్ - రికార్డులు తిర‌గ‌రాసిన నాచుర‌ల్ స్టార్ - నైజాంలో హ‌య్యెస్ట్‌

Advertisement
Advertisement