త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Amit Shah | వీధుల్లో కాదు.. పార్లమెంట్‌లో చర్చకు రండి : రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్

Amit Shah | స‌ర్ ప్ర‌క్రియ‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించేందుకు త‌మ‌ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) స్ప‌ష్టం చేశారు. నిజంగానే రాహుల్ (Rahul Gandhi)కు చర్చించాలనే చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని సూచించారు.

D

National | Published On Nov 5, 2026, 3.41 pm IST

Amit Shah | వీధుల్లో కాదు.. పార్లమెంట్‌లో చర్చకు రండి : రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్
Advertisement

Amit Shah | త్రినేత్ర న్యూస్ : ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi)తో చ‌ర్చ‌కు సిద్ధ‌మంటూ కాంగ్రెస్ అగ్ర‌నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) విసిరిన స‌వాల్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amit Shah) తీవ్రంగా స్పందించారు. వీధుల్లో కాద‌ని.. ద‌మ్ముంటే పార్ల‌మెంట్‌లో చ‌ర్చ‌కు రావాలంటూ ప్ర‌తి స‌వాల్ విసిరారు. స‌ర్‌పై పార్ల‌మెంట్‌లో చ‌ర్చించేందుకు త‌మ‌ ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని షా ఈ సంద‌ర్భంగా స్ప‌ష్టం చేశారు.

హ‌ర్యానాలోని క‌ర్నాల్‌లో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో అమిత్ షా పాల్గొని ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా రాహుల్‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. నిజంగానే రాహుల్‌కు చర్చించాలనే చిత్తశుద్ధి, ధైర్యం ఉంటే ప్రధానికి అధికారికంగా లేఖ రాయాలని సూచించారు. ప్ర‌త్యేక స‌మ‌గ్ర స‌వ‌ర‌ణ ప్ర‌క్రియ (SIR)పై చ‌ర్చించేందుకు పార్లమెంటు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి ప్ర‌భుత్వం సిద్ధంగా ఉంద‌ని చెప్పారు. అయితే, తాము ఇచ్చే స‌మాధానాలు విని రాహుల్ త‌ట్టుకోలేర‌ని.. ఎప్ప‌టి లానే పారిపోతార‌ని వ్యాఖ్యానించారు.

అదేవిధంగా ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌న‌ర్ జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా చేయాలంటూ ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న డిమాండ్ల‌పై షా తీవ్ర‌స్థాయిలో మండిప‌డ్డారు. 2014, 2019, 2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో స‌ర్ లేక‌పోయినా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన విష‌యాన్ని గుర్తు చేశారు. "2014లో స‌ర్‌ ఎక్కడ ఉంది..? అప్పుడే మీరు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయారు. 2019లో స‌ర్‌ ఉందా? అప్పుడూ ఓడిపోయారు. 2024లోనూ అదే ప‌రిస్థితి. హర్యానా, మహారాష్ట్రలోనూ స‌ర్‌ లేదు.. మీరు అన్ని చోట్లా ఓడిపోయారు. పార్లమెంట్‌లో చర్చను అనుమతించకుండా అరాచకం సృష్టించేందుకు వీధుల్లో గుంపులను పోగేస్తున్నారు. పార్లమెంట్‌లో కేవలం గందరగోళం సృష్టిస్తూ బాయ్‌కాట్ రాజ‌కీయాల‌కు పాల్పడుతున్నారు" అని షా విమర్శించారు.

మృతుల పేర్లు, చొర‌బాటుదారులు, బోగ‌స్ ఓట్ల‌ను ఎన్నిక‌ల సంఘం తొల‌గిస్తుంటే రాహుల్‌కు ఎందుకు అంత క‌డుపు మంట అని షా ప్ర‌శ్నించారు. రాహుల్ గాంధీ ఇలాగే వీధుల్లో జ‌నాల‌ను పోగేయాల‌ని చూస్తే బీజేపీ కార్య‌క‌ర్త‌లు త‌గిన స‌మాధానం ఇస్తార‌ని హెచ్చ‌రించారు. కాంగ్రెస్ పార్టీని ప్ర‌జ‌లు నిరంత‌రం తిర‌స్క‌రిస్తూనే ఉన్నార‌ని పేర్కొన్నారు. ఇటీవ‌లే రామ్‌లీలా మైదాన్‌లో జ‌రిగిన స‌భకు 10 ల‌క్ష‌ల మంది వ‌స్తార‌ని ప్ర‌చారం చేశార‌ని షా మండిప‌డ్డారు. అస‌లు ఆ మైదానం సామ‌ర్థ‌మే 70 వేలు అని స్ప‌ష్టం చేశారు. అందులోనూ స‌గం ఖాళీగానే ఉంద‌ని ఎద్దేవా చేశారు.

Also Read..

వివాహేత‌ర సంబంధం.. భార్య‌ను కుర్చీకి క‌ట్టేసి స‌జీవ ద‌హ‌నం చేసిన భ‌ర్త‌

విచార‌ణ పేరుతో అక్ర‌మ నిర్బంధాల‌కు అడ్డుక‌ట్ట.. సుప్రీంకోర్టు చారిత్రాత్మ‌క తీర్పు

ద‌క్షిణాది న‌టులంటే బాలీవుడ్‌లో చుల‌క‌నే - జాన్వీక‌పూర్‌కు రెజీనా కౌంట‌ర్‌

Advertisement
Advertisement