Paradise Collections | ప్యారడైజ్ ఫస్ట్ డే కలెక్షన్స్ – రికార్డులు తిరగరాసిన నాచురల్ స్టార్ – నైజాంలో హయ్యెస్ట్
నాని ది ప్యారడైజ్ మూవీ కలెక్షన్స్ పరంగా బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసింది. తొలి రోజు ఈ సినిమా 80 కోట్లకుపైగా వసూళ్లను దక్కించుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన మూవీగా ప్యారడైజ్ నిలిచింది.
Entertainment | Published On Sep 25, 2026, 3.08 pm IST
Paradise Collections | ప్యారడైజ్ మూవీ ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద రికార్డ్ కలెక్షన్స్‌తో అదరగొట్టింది. నాచురల్ స్టార్ నాని కెరీర్‌లో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా నిలిచింది. మొదటి రోజు ప్యారడైజ్ మూవీ ఎనభై కోట్లకుపైగా వసూళ్లను సొంతం చేసుకున్నట్లు చెబుతూ మేకర్స్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. నెగెటివ్ టాక్‌తో భారీగా వసూళ్లను రాబట్టడం ట్రేడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నైజాం ఏరియాలో...
నైజాం ఏరియాలో గురువారం ఈ సినిమాకు 15 కోట్ల వరకు కలెక్షన్స్ వచ్చాయి. టైర్ 2 హీరోల్లో మొదటిరోజు నైజాం ఏరియాలో హయ్యెస్ట్ కలెక్షన్స్ దక్కించుకున్న హీరోగా నాని ఈ సినిమాతో నంబర్ వన్ ప్లేస్‌లో నిలిచాడు. ఓవరాల్‌గా టాలీవుడ్ హిస్టరీలో తెలంగాణ ఏరియాలో అత్యధిక వసూళ్లను సాధించిన టాప్ టెన్ సినిమాల్లో ఒకటిగా ప్యారడైజ్ నిలిచింది. ఓవర్‌సీస్, ఆంధ్రా, సీడెడ్ ఏరియాలోనూ భారీగానే ప్యారడైజ్ కలెక్షన్స్‌ను రాబట్టింది. రెండో రోజు కూడా యాభై కోట్లకుపైనే కలెక్షన్స్ రావచ్చునని అంచనా వేస్తున్నారు.
మోహన్‌బాబు విలన్...
ప్యారడైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్వకత్వం వహించారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాలో సోనాలి కులకర్ణి, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో నటించారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు విలన్‌గా నటించారు. కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో కనిపించింది.
రా అండ్ రస్టిక్...
అణిచివేతకు గురైన ఓ నిమ్న జాతికి గుర్తింపు తీసుకొచ్చేందుకు ఓ నాయకుడు చేసిన పోరాటానికి తల్లికొడుకుల సెంటిమెంట్, యాక్షన్ అంశాలను జోడించి దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించారు. ఔట్ అండ్ ఔట్ మాస్ రోల్‌లో నాని నటించిన మొదటి సినిమా ఇది. డైరెక్టర్ రా అండ్ రస్టిక్ టేకింగ్, నాని యాక్టింగ్, అతడిపై తెరకెక్కించిన యాక్షన్ అంశాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. అనిరుధ్ మ్యూజిక్ బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్‌గా నిలిచినట్లు చెబుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..





