Air India | ఆల్కహాల్ టెస్ట్‌లో విఫలం.. కోపైలట్ సస్పెన్షన్
Air India | ఎయిర్ ఇండియాకు చెందిన ఓ పైలట్ సస్పెండ్ అయ్యాడు. జురిచ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన (Zurich-Delhi Flight) ఎయిర్ ఇండియా (Air India) విమానం టేకాఫ్‌కు ముందు నిర్వహించిన ఆల్కహాల్ పరీక్షలో సదరు పైలట్ మద్యం సేవించినట్లు తేలింది.
Air India | త్రినేత్ర న్యూస్ : జురిచ్ నుంచి ఢిల్లీ వెళ్లాల్సిన (Zurich-Delhi Flight) ఎయిర్ ఇండియా (Air India) విమానానికి టేకాఫ్‌కు ముందే అనూహ్య పరిస్థితి ఎదురైంది. విమానం మరికాసేపట్లో టేకాఫ్ అవుతుందనంగా నిర్వహించిన ఆల్కహాల్ టెస్ట్‌లో పైలట్ మద్యం సేవించినట్లు తేలింది (Air India Pilot Found Drunk). దీంతో టేకాఫ్‌కు ముందే పైలట్‌ను విధుల నుంచి తొలగించారు (Pilot Suspended).
సెప్టెంబర్ 6న ఎయిర్ ఇండియా విమానం AI 151 జురిచ్ విమానాశ్రయం నుంచి ఢిల్లీకి రావాల్సి ఉంది. విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధంగా ఉండగా.. కో-పైలట్ వద్ద మద్యం వాసన వచ్చింది. దీంతో అధికారులు అతడికి ఆల్కహాల్ పరీక్షలు నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్షలో అతను ఫెయిల్ అయినట్లు అధికారులు చెప్పారు. జురిచ్‌లో నిర్వహించిన సెకండరీ పరీక్ష ఫలితాలు రావాల్సి ఉందని వెల్లడించారు. తుది ఫలితాలు వచ్చే వరకూ సదరు కో పైలట్‌ను విధుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ ఘటన కారణంగా AI 151 విమానం షెడ్యూల్ ప్రకారం నడపలేకపోయినట్లు అధికారులు వివరించారు. ఆ విమానాన్ని మరుసటి రోజు నడిపినట్లు పేర్కొన్నారు. భద్రత, నియంత్రణ, నిబంధనల ఉల్లంఘన విషయంలో ఎయిర్ ఇండియా జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంభిస్తుందని సంస్థ స్పష్టం చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన సిబ్బందిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.
Also Read..
ఈసీ నిర్ణయాలపై వివాదం.. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై సుప్రీంకోర్టులో పిటిషన్
సిక్కింలో వరదలు.. గ్రామంపై విరిగిపడ్డ కొండచరిలు
రాష్ట్ర హోదాను పునరుద్దరించండి.. జమ్ము కశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి
- ●Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..
- ●Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి
- ●Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..
- ●kaaka | జోరు మీదున్న కాకా - డబ్బింగ్ పనులు మొదలు - ఐదు నెలల్లోనే షూటింగ్ కంప్లీట్
- ●TG Weather | తెలంగాణలో రెండురోజులు భారీ వర్షాలు.. హెచ్చరించిన ఐఎండీ

Supreme Court | సుప్రీంకోర్టులో హిందీని అధికారిక భాషగా చేయండి

Tata Aeris | టాటా కొత్త సెడాన్ ఏరిస్.. ప్రారంభ ధర రూ.5.29 లక్షలు..

Chamala | జ్ఞానేశ్ కుమార్‌ను వెంటనే సీఈసీ పదవి నుంచి తొలగించాలి

Kohinoor Gated Community | కోహినూర్ గేటెడ్ కమ్యూనిటీలో రికార్డు ధర పలికిన వినాయక లడ్డూ.. ఎంతంటే..






