త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Abhijeet Dipke | జ్ఞానేశ్ ఇట్స్ డ‌న్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌

Abhijeet Dipke | ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) నిర‌స‌న‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల సంఘం తీరు మారాలంటూ సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) పేర్కొన్నారు. ఈ మేర‌కు జ్ఞానేశ్ ఇట్స్ డ‌న్ బ్రో (Gyanesh it's done bro) అంటూ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు.

D

National | Published On Sep 24, 2026, 10.12 am IST

Abhijeet Dipke | జ్ఞానేశ్ ఇట్స్ డ‌న్ బ్రో.. అభిజీత్ దిప్కే ఆస‌క్తిక‌ర పోస్ట్‌
Advertisement

Abhijeet Dipke | త్రినేత్ర న్యూస్ : దేశ రాజకీయాల్లో కేంద్ర ఎన్నికల సంఘం (ECI) వ్యవహారశైలిపై తీవ్ర దుమారం రేగుతోంది. కేంద్ర ఎన్నికల సంఘంలో అంతర్గత విభేదాలు బయటపడటం, ప్రత్యేకించి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ముగ్గురు కమిషనర్ల మధ్య భేదాభిప్రాయాలు రావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఎన్నిక‌ల సంఘం తీరుపై విప‌క్షాలు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఎన్నిక‌ల క‌మిష‌న్‌పై కాక్రోచ్ జ‌న‌తా పార్టీ (CJP) నిర‌స‌న‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఎన్నిక‌ల సంఘం తీరు మారాలంటూ సీజేపీ వ్య‌వ‌స్థాప‌కుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) పేర్కొన్నారు. ఈ మేర‌కు జ్ఞానేశ్ ఇట్స్ డ‌న్ బ్రో (Gyanesh it's done bro) అంటూ ఎక్స్ వేదిక‌గా ఆస‌క్తిక‌ర పోస్టు పెట్టారు. ఇవాళ ఢిల్లీలో ప్రెస్‌మీట్ నిర్వ‌హించ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్‌గా మారింది.

ఎన్నిక‌ల సంఘంలో నెల‌కొన్న వివాదాల‌పై దిప్కే ఇప్ప‌టికే స్పందించిన విష‌యం తెలిసిందే. జ్ఞానేశ్ కుమార్ (CEC Gyanesh Kumar) దేశ శత్రువు అని విమ‌ర్శించారు. స‌ర్‌ ప్రక్రియలో భాగంగా ముసాయిదా ఓటర్ల జాబితా నుంచి ఏకంగా 12 కోట్లకు పైగా పేర్లు గ‌ల్లంతైన‌ట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయని చెప్పారు. 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి దేశంలో ఉన్న సుమారు 97 కోట్ల మంది నమోదిత ఓటర్లతో పోలిస్తే, ఇది దాదాపు 12.4 శాతానికి సమానమ‌ని పేర్కొన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో అధికార బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి, ప్రతిపక్షాలకు మధ్య కేవలం 2 శాతం ఓట్ల వ్యత్యాసం మాత్ర‌మే ఉంద‌ని గుర్తు చేశారు. ఇప్పుడు ఇంత భారీ సంఖ్యలో ఓట్లను తొలగించడం ద్వారా ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేస్తున్నారనే అనుమానం వ్య‌క్తం చేశారు. జ్ఞానేశ్ కుమార్ స్వ‌తంత్రంగా ఎన్నిక‌ల‌ను నిర్వ‌హించ‌డం లేద‌ని.. వాటికి ముంద‌స్తు ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తున్నార‌ని విమ‌ర్శించారు.

ఈసీ దేశ‌వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా చేప‌డుతున్న 'స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్' (SIR) ప్ర‌క్రియ‌కు సంబంధించి ప‌లు కీల‌క నిర్ణ‌యాల‌పై ముగ్గురు సభ్యుల కమిషన్‌లో భిన్నాభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ప్ర‌ధాన ఎన్నిక‌ల క‌మిష‌నర్ జ్ఞానేశ్ కుమార్ ఏక‌ప‌క్షంగా నిర్ణ‌యాలు తీసుకుంటున్న‌ట్లు ఇద్ద‌రు క‌మిష‌న‌ర్లు ఆరోపించారు. ఈ విష‌యంపై వారు గత 10 నెలల్లోనే కనీసం 14 సార్లు అధికారికంగా అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు 'ది ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌' సంచ‌ల‌న‌ కథనం వెలువ‌రించింది. బీహార్‌లో జూన్ 2025లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైన ఈ SIR ప్రక్రియ.. దేశవ్యాప్తంగా 30 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించింది. అయితే ముసాయిదా ఓటర్ల జాబితాల నుంచి ఏకంగా 13 కోట్ల మందికిపైగా పేర్లు గ‌ల్లంతైన‌ట్లు స‌ద‌రు క‌థ‌నం పేర్కొంది. దీంతో ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌లో ఎన్నిక‌ల సంఘం పాత్ర‌పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read..

య‌మునా ఎక్స్‌ప్రెస్‌వేపై టూరిస్టు బస్సు ద‌గ్దం.. 9 మంది సజీవ దహనం

గ‌ణేశ్ నిమజ్జన విధులకు వచ్చి.. రోడ్డు ప్ర‌మాదంలో ఎస్‌ఐ మృతి

శ్రీశైలం వెళ్తుండ‌గా ట్రావెల్స్‌ బ‌స్సులో మంట‌లు.. క్షేమంగా బ‌య‌ట‌ప‌డ్డ ప్ర‌యాణికులు

Advertisement
Advertisement