PAC Meeting | 2027లో ఓబీసీ కుల గణన చేయాలి.. దీనిపై ప్రధానికి లేఖ రాస్తాం
PAC Meeting | 2027లో కేంద్రం చేపట్టబోయే జన గణనలో ఓబీసీ కుల గణన (OBC Caste Census) చేయాలని.. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.
- 100 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో ఓబీసీ కులగణన నిర్వహించాం
- ఎల్ నినోని ఎదుర్కోవడానికి 30 వేల కోట్లు అవసరం.. కేంద్రమే ఈ సాయం చేయాలి
- సర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశముంది
- పీఏసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి
PAC Meeting | త్రినేత్ర న్యూస్: 2027లో కేంద్రం చేపట్టబోయే జన గణనలో ఓబీసీ కుల గణన (OBC Caste Census) చేయాలని.. దీనిపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు సూచిస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు. 100 ఏళ్ల తర్వాత మొదటిసారి తెలంగాణలో ఓబీసీ కుల గణన నిర్వహించామని చెప్పారు. ఎల్‌నినోను ఎదుర్కోవడానికి 30 వేల కోట్లు అవసరమని.. కేంద్రమే ఈ సాయం చేయాలన్నారు. సర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశముందన్నారు. హైదరాబాద్ (Hyderabad) గాంధీభవన్‌లో ఆదివారం నిర్వహించిన పీఏసీ సమావేశం (PAC Meeting) లో సీఎం ప్రసంగించారు. కొత్త ఇన్‌చార్జ్ సందీప్‌కుమార్‌కు స్వాగతం పలుకుతున్నామన్నారు.
బీఎం సందీప్‌కుమార్‌కు స్వాగతం
నూతన ఇంచార్జ్ బీఎం సందీప్‌కుమార్‌కు తెలంగాణకు స్వాగతం. బీఎం సందీప్‌ను ఇంచార్జ్ గా నియమించినందుకు సోనియా గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీకి ధన్యవాదాలు. మీనాక్షి నటరాజన్ ఇంచార్జ్ గా ఉప ఎన్నికలు, పంచాయత్, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. 66 శాతం పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించాం. మున్సిపల్ ఎన్నికల్లో 85 శాతం విజయం సాధించాం. మీనాక్షి నటరాజన్ సమయంలో మంచి విజయాలు సాధించాం. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం.
మొదటి ప్రధాని నెహ్రూ చొరవ వల్ల దేశంలో విద్య ప్రతి ఒక్కరికి అందుతోంది. నెహ్రూ ప్రణాళికల వల్ల ఇరిగేషన్ రంగం బాగా అభివృద్ధి చెందింది. ఆయన చొరవ వల్లనే మిగులు ఆహార ధాన్యాలు ఉన్నాయి. ఎల్ నినో వల్ల వర్షాలు పడటం లేదు. తక్కువ నీటితో పండే పంటలను రైతులు సాగు చేయాలి. రాష్ట్రంలో ఆహార ధాన్యాలకు కొరత లేదు. వర్షాకాలంలో 20 వేల మెగా వాట్ల డిమాండ్ ఉన్నా రైతులకు అందించగలిగాం. పంటలు ఎండిపోకుండా కాపాడాం.
8 నెలలు తాగు నీరు అందించాల్సి ఉంది
100 దేశాలు ఎల్ నినో ప్రభావం వల్ల ఇబ్బంది పడుతున్నాయి. పక్కన ఉన్న మహారాష్ట్ర, కర్ణాటకలో కరవు పరిస్థితులు ఉన్నాయి. వచ్చే 8 నెలలు తాగు నీటిని అందించాల్సి ఉంది. ప్రాజెక్ట్ లో ఉన్న నీటిని తాగు నీటి కోసం వినియోగించాల్సి ఉంది. రూ.30 వేల కోట్ల సాయం కోసం పీఏసీ సమావేశంలో కూడా కేంద్రాన్ని కోరుతూ తీర్మానాలు చేయాలి. ప్రతి ఒక్కరికి పని కల్పించడమే లక్ష్యంగా త్వరలో పెద్ద కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇప్పటికే ఉపాధి హామీ పథకంలో పని చేసే వారి సంఖ్య బాగా పెరిగింది.
అమెరికాలో మహిళలకు ఓటు హక్కు ఇవ్వడానికి 300 ఏళ్ళు పట్టింది. పరిపాలన ఎవరు చేయాలన్నది ప్రజలే నిర్ణయించాలని నెహ్రూ, మహాత్మా గాంధీ, అంబేద్కర్ ఆనాడు భావించారు. అందుకే ప్రజలందరికి ఓటు హక్కు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ ఓటు హక్కు కల్పించింది.
2019లో 130 కోట్ల జనాభా ఉంటే ఓట్లు 91 కోట్లు ఉన్నాయి. 2024లో 140 కోట్ల జనాభా ఉంటే ఓట్లు 97.5 కోట్లు ఉన్నాయి. సర్ పేరుతో కనీసం 20 కోట్ల ఓట్లు తొలగించే అవకాశం ఉంది. 13 కోట్లు ఇప్పటికే తొలగించారు. దళితులు, ఆదివాసీలు, గిరిజనులు, మహిళల ఓట్లు తొలగిస్తున్నారు. వలసలు పోవడం వల్ల వీరి ఓట్లు తొలగిస్తున్నారు. ఈ వర్గాలు మొదటి నుంచి కాంగ్రెస్ కు అండగా ఉన్నారు. గతంలో సర్ ప్రక్రియ ఓటు హక్కు కల్పించడం కోసం ఉండేది. కానీ మోదీ మొదటిసారి ఓట్ల తొలగింపునకు ఉపయోగిస్తున్నారు.
తెలంగాణలో 71 లక్షల ఓట్లను పక్కన పెట్టారు. కాంగ్రెస్ పార్టీ బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలి. ఇంటి పేరు సరిగా లేకపోయినా ఓట్లను తొలగిస్తున్నారు. యాంత్రికంగా ఓట్లను తొలగిస్తున్నారు. బ్రిటిష్ హయాంలో సైమన్ కమిషన్ లాగా 100 ఏళ్ళ తర్వాత మోదీ సర్ తీసుకొచ్చారు. సైమన్ కమిషన్ గోబ్యాక్ నినాదం లాగా ఇప్పుడు జ్ఞానేశ్ కుమార్ గో బ్యాక్ నినాదంతో ముందుకు రావాలి. సర్ పైన పూర్తి అప్రమత్తంగా ఉండాలి. ఎన్నికల వరకు వేచి చూడొద్దు.
బీజేపీ దేశంలో ద్వితీయ శ్రేణి పౌరులను తయారు చేస్తుంది. సంక్రాంతి తరహా 5 నెలలు ప్రజా బలం కార్యక్రమాన్ని తీసుకుంటాం. ప్రతి గ్రామానికి నాయకులు వెళ్ళాలి. ప్రతి ఒక్కరికి పని కల్పిస్తాం. నిధులకు కొరత లేకుండా చూస్తాం. పార్టీలో పనిచేసిన వారికి అనేక మందికి పదవులు ఇచ్చాం అని రేవంత్ గుర్తు చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Yadagirigutta | యాదగిరిగుట్టలో ఘనంగా కార్తీక మాస ఉత్సవాలు
- ●Nitish Setu Controversy | నితీశ్ సేతుపై హైడ్రామా: ప్రధాని మోదీ పోస్టర్లు చించేసిన ఆర్జేడీ కార్యకర్తలు.. అసలు వివాదం ఇదే!
- ●Political Violence | బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాకాండ.. అవామీ లీగ్ నేతల ఇళ్లకు నిప్పు!
- ●Harish Rao | సదర్ సంబరాల్లో హరీశ్ రావు జోష్
- ●Dasoju Sravan | కోదండరామ్‌కో, శ్యామ్ మోహన్‌కో విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇవ్వాలి
- ●BM Sandip Kumar | కలిసి పని చేస్తేనే గెలిచాం.. వచ్చే ఎన్నికల్లో మరిన్ని స్థానాలు గెలుద్దాం

Yadagirigutta | యాదగిరిగుట్టలో ఘనంగా కార్తీక మాస ఉత్సవాలు

Nitish Setu Controversy | నితీశ్ సేతుపై హైడ్రామా: ప్రధాని మోదీ పోస్టర్లు చించేసిన ఆర్జేడీ కార్యకర్తలు.. అసలు వివాదం ఇదే!

Political Violence | బంగ్లాదేశ్‌లో మళ్లీ హింసాకాండ.. అవామీ లీగ్ నేతల ఇళ్లకు నిప్పు!

Harish Rao | సదర్ సంబరాల్లో హరీశ్ రావు జోష్





