త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ganesh immersion | గ‌ణేశ్ నిమజ్జన విధులకు వచ్చి.. రోడ్డు ప్ర‌మాదంలో ఎస్‌ఐ మృతి

Ganesh immersion | గ‌ణేశ్‌ నిమజ్జనం (Ganesh immersion) బందోబస్తు విధుల‌ కోసం హైద‌రాబాద్‌ వ‌చ్చిన ఓ ఎస్ఐ రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో నెక్లెస్ రోడ్డులో (Necklace Road) గుర్తుతెలియ‌ని ద్విచ‌క్ర‌వాహ‌నం (Hit and Run) ఢీకొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఎస్ఐ.. ద‌వాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

G

Hyderabad | Published On Sep 24, 2026, 9.26 am IST

Ganesh immersion | గ‌ణేశ్ నిమజ్జన విధులకు వచ్చి.. రోడ్డు ప్ర‌మాదంలో ఎస్‌ఐ మృతి
Advertisement

Ganesh immersion | త్రినేత్ర‌.న్యూస్‌: గ‌ణేశ్‌ నిమజ్జనం (Ganesh immersion) బందోబస్తు విధుల‌ కోసం హైద‌రాబాద్‌ వ‌చ్చిన ఓ ఎస్ఐ రోడ్డు ప్రమాదంలో మ‌ర‌ణించారు. అర్ధ‌రాత్రి స‌మ‌యంలో నెక్లెస్ రోడ్డులో (Necklace Road) గుర్తుతెలియ‌ని ద్విచ‌క్ర‌వాహ‌నం (Hit and Run) ఢీకొట్ట‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డిన ఎస్ఐ.. ద‌వాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందారు.

వ‌రంగ‌ల్ జిల్లా రాయ‌ప‌ర్తి మండ‌లం కృష్ణాపురం గ్రామానికి చెందిన కున్సోతు వెంక‌న్న (57).. కొత్త‌గూడెం టూటౌన్ (Kothagudem SI) పోలీస్ స్టేష‌న్‌లో ఎస్ఐగా విధులు నిర్వ‌హిస్తున్నారు. హైద‌రాబాద్‌లో వినాయ‌క నిమ‌జ్జ‌నం బందోబ‌స్తులో భాగంగా ఎస్ఐ వెంక‌న్న‌కు (SI Venkanna) ట్యాంక్‌బండ్ వ‌ద్ద‌ డ్యూటీ వేశారు. దీంతో ఆయ‌న తెల్ల‌వారుజామున 2 గంట‌ల స‌మ‌యంలో నెక్లెస్ రోడ్డులో విధులు నిర్వ‌హిస్తుండ‌గా.. వేగంగా దూసుకొచ్చిన ఓ ద్విచ‌క్ర‌వాహ‌నం ఆయ‌న‌ను ఢీకొట్టింది. దీంతో ఎస్ఐ త‌ల‌, కాళ్లు, చేతుల‌కు తీవ్ర‌గాయాల‌వ‌డంతో.. స‌హ‌చ‌ర సిబ్బంది ఆయ‌న‌ను ఓ ప్రైవేటు ద‌వాఖాన‌కు త‌ర‌లించారు.

పరిస్థితి మెరుగ్గా ఉన్నట్లు కనిపించడంతో కుటుంబ స‌భ్యులు ఆయ‌న‌ను హనుమకొండలోని (Hanumakonda) మెడికవర్ ద‌వాఖాన‌కు తీసుకెళ్లారు. ఈ క్ర‌మంలో ప‌రిస్థితి విష‌మించ‌డంతో వెంక‌న్న మృతి చెందారు. కాగా, ప్రమాదానికి కారణమైన ద్విచక్ర వాహనదారుడిని గుర్తించేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నారు. కాగా, ఎస్ఐ వెంక‌న్న ఇటీవలే కొత్త‌గూడెం నుంచి మహబూబాబాద్‌ బదిలీ అయ్యారు. అయితే గణేశ్‌ నిమజ్జనం అనంతరం రిలీవ్‌ కావాల్సి ఉండగా ఇంతలోనే ప్రమాదం చోటుచేసుకుంది.

 

Advertisement
Advertisement